IPL 2026 పాయింట్స్ టేబుల్‌‌: డేంజర్‌ జోన్‌లో టాప్ 4 టీమ్స్.. గందరగోళంగా ప్లే ఆఫ్స్ సినారియో!

Wait 5 sec.

రోజురోజుకూ మారిపోతుందీ ఉంది. . వరుసగా విజయాలు సాధించిన జట్లు ఇప్పుడు ఒకదాని తర్వాత ఒకటి ఓడిపోతూ వస్తున్నాయి. ప్లే ఆఫ్స్‌కి ఛాన్స్ లేని జట్లు టాప్ 4 టీమ్స్ ఛాన్స్‌ని దిగజార్చుతూ వస్తున్నాయి. మొత్తానికి ఇప్పటి వరకు వన్ సైడెడ్‌గా సాగిన మ్యాచ్‌లు ఇప్పుడు డూ ఆర్ డైగా సాగుతున్నాయి. వీకెండ్ డబుల్ హెడ్డర్‌లో భాగంగా ఆదివారం జరిగిన రెండు మ్యాచ్‌లలోనూ పాయింట్స్ టేబుల్ టాప్ 4లో ఉన్న రెండు జట్లూ ఓడిపోయాయి. సన్‌రైజర్స్ హైదరాబాద్ అయితే దారుణ పరాజయం పాలవగా.. పంజాబ్ కింగ్స్ ఆఖరి ఓవర్ వరకూ పోరాడి ఓడిపోయింది. ఈ రెండు జట్లు ఓడిపోవడంతో పాయింట్స్ టేబుల్‌లో ప్రస్తుతానికి మార్పులు రాలేదు కానీ.. ప్లే ఆఫ్స్‌కి చేరుకునే అవకాశాలు మాత్రం క్లిష్టతరమయ్యాయి.మొన్నటి వరకు వరుస ఓటములతో ఉన్న గుజరాత్ టైటాన్స్ ఇప్పుడు టాప్ టీమ్స్‌ను ఒక్కొక్కటిగా ఓడిస్తూ టఫ్ కాంపిటీషన్ ఇస్తోంది. గుజరాత్ పది మ్యాచ్‌లు ఆడి ఆరు విజయాలతో 12 పాయింట్లు సాధించింది. ఆర్సీబీ, సన్‌రైజర్స్, రాజస్థాన్ రాయల్స్ కూడా 12 పాయింట్లతో కొనసాగుతుండటంతో ఏ జట్టు ప్లే ఆఫ్స్‌కు వెళ్తుందో, ఏ జట్టు ఇంటిబాట పడుతుందో ఎవ్వరికీ అర్థంకాని పరిస్థితిగా మారిపోయింది. ఐపీఎల్ 2026 పాయింట్స్ టేబుల్‌ని ఒకసారి పరిశీలిస్తే పంజాబ్ కింగ్స్ 9 మ్యాచ్‌లలో 6 గెలిచి 13 పాయింట్లతో టేబుల్ టాపర్‌గా కొనసాగుతుంటే.. ఆర్సీబీ, సన్‌రైజర్స్, రాజస్థాన్ రాయల్స్, గుజరాత్ టైటాన్స్ జట్లు 12 పాయింట్లతో సరిసమానంగా ఉన్నాయి. అయితే నెట్ రన్‌రేట్ కారణంగా ఆర్సీబీ రెండు, సన్‌రైజర్స్ మూడు, రాజస్థాన్ రాయల్స్ నాలుగు, గుజరాత్ టైటాన్స్ ఐదో స్థానంలో కొనసాగుతున్నాయి. చెన్నై సూపర్ కింగ్స్ కూడా ప్లే ఆఫ్స్ రేసులో పరిగెడుతున్నా ఇప్పుడున్న పరిస్థితుల్లో టాప్ 4లో నిలవాలంటే ఆ జట్టుకు కత్తి మీద సామే అని చెప్పొచ్చు. సీఎస్కే 9 మ్యాచ్‌లలో 8 పాయింట్లతో ఆరో స్థానంలో కొనసాగుతోంది. ఆరెంజ్ ఆర్మీని ఓడించిన కేకేఆర్ 7 పాయింట్లతో 8వ స్థానంలో ఉండగా.. ముంబై ఇండియన్స్ తొమ్మిది, లక్నో సూపర్ జెయింట్స్ పదో స్థానంలో కొనసాగుతున్నాయి.