బెంగాల్‌ గడ్డపై మమతా బెనర్జీ హవాకు కారణాలేంటి.. ఈ నాలుగు అంశాలే దీదీ గెలుపు రహస్యం!

Wait 5 sec.

పశ్చిమ బెంగాల్‌లో వరుసగా మూడుసార్లు ఎన్నికల్లో గెలిచింది. 2011 ఎన్నికల్లో మార్పు నినాదంతో 34 ఏళ్ల కమ్యూనిస్టు పాలనను అంతం చేసిన దీదీ తొలిసారి బెంగాల్ సీఎం అయ్యారు. 2016 ఎన్నికల నాటికి శారద, నారద లాంటి కుంభకోణాల ఆరోపణలు వచ్చినప్పటికీ.. సంక్షేమ పథకాల సాయంతో రెండోసారి సునాయాసంగా గెలిచారు. 2021 ఎన్నికల నాటికి బీజేపీ బలంగా పోటీ ఇచ్చింది. హిందువులను తమవైపు తిప్పుకోవడానికి ప్రయత్నించింది. అయినా సరే ‘బెంగాల్’ సెంటిమెంట్‌, ముస్లిం ఓటు బ్యాంక్, మహిళా ఓట్ల సాయంతో ఆమె హ్యాట్రిక్ సాధించగలిగారు. లక్ష్మీర్‌ భాండార్, రూపశ్రీ, కన్యాశ్రీ, మహాత్మా శ్రీ, కర్మశ్రీ, యోగ్యశ్రీ వంటి పథకాలను అమలు చేస్తున్న .. బెంగాలీలను మరోసారి తిప్పుకోగలుగుతారేమో చూడాలి. . ఈ క్రమంలోనే జాతీయ నాయకులు సైతం ఆ పార్టీ తరఫున ప్రచారం చేస్తున్నారు. దీన్ని మమతా బెనర్జీ తనకు అనుకూలంగా మలుచుకుంటున్నారు. ఈ ఎన్నికలు బెంగాలీలకు బయటి వ్యక్తులకు జరుగుతున్న పోరుగా ఆమె అభివర్ణిస్తున్నారు. బెంగాల్ తన సొంత కుమార్తెనే కోరుకుంటుంది లాంటి నినాదాలతో ఆమె ప్రజల్లోకి వెళ్తున్నారు. బెంగాల్ సంస్కృతిని కాపాడే నాయకురాలిగా తనను తాను ప్రొజెక్ట్ చేసుకోవడంలో ఆమె విజయం సాధించారు. సంక్షేమ పథకాల అమలుపై శ్రద్ధ వహిస్తూన్న మమతా బెనర్జీ.. మన దగ్గర గతంలో ఉన్న ప్రజల వద్దకే పాలన తరహాలో దువారే సర్కార్ (మీ ఇంటి వద్దకే ప్రభుత్వం) కార్యక్రమాన్ని చేపట్టారు. రేషన్ కార్డులు, పెన్షన్లు, స్వాస్థ్య సాథి లాంటి వాటిని రాజకీయాలతో సంబంధం లేకుండా అందరికీ అందేలా చూశారు. దీదీ గెలవడానికి మరో ముఖ్య కారణంగా బెంగాల్‌లోని ముస్లింలు. బెంగాల్‌లో 27 శాతం వరకు ఉన్న ముస్లింలు.. బీజేపీకి వ్యతిరేకంగా నిలవడం కోసం ఏకపక్షంగా టీఎంసీకి అండగా నిలుస్తూ వస్తున్నారు. దీంతో ముస్లిం జనాభా ఎక్కువగా ఉన్న 60-70 నియోజకవర్గాల్లో మమతా బెనర్జీ పార్టీ తిరుగులేని ఆధిక్యం సాధిస్తోంది.బీజేపీ వ్యూహాలకు దీటైన ప్రతి వ్యూహాలను అమలు చేయడంలో దీదీ దిట్ట అని చెప్పొచ్చు. 2021 ఎన్నికల సమయంలో ఆమె కాలికి గాయం కావడంతో వీల్‌ఛైర్లోనే ప్రచారం నిర్వహించారు. తద్వారా ప్రజల్లో సానుభూతిని పొందగలిగారు. కేంద్రంపై పోరాడుతున్న యోధురాలిగా బెంగాల్ ప్రజల్లో ఆమె తనను తను ప్రొజెక్ట్ చేసుకున్నారు.కన్య శ్రీ, రూప శ్రీ, స్వాస్థ్య శ్రీ లాంటి సంక్షేమ పథకాలతో మమతా బెనర్జీ మహిళలకు చేరువయ్యారు. కన్య శ్రీ అనేది ఆడ పిల్లల చదువుకోసం ఉద్దేశించిన పథకం. ఈ పథకం కింది చదువుకునే ఆడ పిల్లలకు ఏటా స్కాలర్‌షిప్‌లు అందిస్తున్నారు. రూప శ్రీ అనేది తెలంగాణలో కేసీఆర్ ప్రవేశపెట్టిన కళ్యాణ లక్ష్మీ పథకం లాంటిది. ఈ పథకం కింద 18 ఏళ్లు నిండిన పేద ఆడ పిల్లల వివాహానికి ప్రభుత్వం రూ.25 వేలు ఆర్థిక సాయం చేస్తోంది. ఇక స్వాస్థ్య శ్రీ అనేది ఆరోగ్య శ్రీ లాంటి పథకం. దీని కింద ప్రతి కుటుంబానికి రూ. 5 లక్షల వరకు వైద్య సేవలు అందిస్తున్నారు. వీటన్నింటి కంటే ముఖ్యంగా 2011లో గెలిచిన తర్వాత దీదీ లక్ష్మీర్ భాండార్ అనే పథకాన్ని ప్రారంభించారు. దీని ద్వారా గతంలో ప్రతి నెలా 25 ఏళ్లు-60 ఏళ్ల మధ్య వయసున్న మహిళలకు రూ.1000 చొప్పున ఆర్థిక సాయం చేసేవారు. ఎస్సీ, ఎస్టీ మహిళలకు రూ.1200 చొప్పున సాయం చేసేవారు. ఇటీవలి బడ్జెట్లో ఈ పథకం కింద ప్రతి నెలా ఇచ్చే మొత్తాన్ని రూ.500 చొప్పున పెంచారు. ఈ పథకాల వల్ల మహిళలను దీదీ తనవైపు తిప్పుకున్నారు. ఈసారి బీజేపీ ఈ పథకానికి కౌంటర్‌గా ‘మాతృ శక్తి వందన్‌ యోజన’ పేరుతో మహిళలకు రూ.3,000 ఇస్తామని ఈసారి మేనిఫెస్టోలో ప్రకటించింది.లోకల్ సెంటిమెంట్, మహిళా ఓటు బ్యాంక్, సంక్షేమ పథకాలు, ముస్లింల మద్దతుతో మమతా బెనర్జీ మరోసారి అధికారంలోకి వస్తారా? లేదంటే తృణమూల్ కంచు కోటలను బీజేపీ బద్దలు కొడుతుందా అనేది మరి కాసేపట్లోనే తేలనుంది.