రణరంగంగా మారిన బెంగాల్ కౌంటింగ్.. జమురియాలో టీఎంసీ ఆఫీస్ దహనం.. పోలీసుల లాఠీచార్జ్

Wait 5 sec.

: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల వేళ రాష్ట్రవ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఓట్ల లెక్కింపులో భారతీయ జనతా పార్టీ 195 స్థానాలకు పైగా ఆధిక్యంలో కొనసాగుతుండటంతో.. రాజకీయ వర్గాల మధ్య ఘర్షణలు చెలరేగుతున్నాయి. ముఖ్యంగా జమురియాలో టీఎంసీ ఆఫీస్‌కు ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టగా.. మరోచోట పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. ఆపూర్తి వివరాలు మీకోసం. అగ్నికి ఆహుతైన టీఎంసీ పార్టీ కార్యాలయం..పశ్చిమ బెంగాల్‌లోని జమురియా నియోజక వర్గంలో అత్యంత దారుణమైన ఘటన వెలుగుచూసింది. కౌంటింగ్ ట్రెండ్స్ బీజేపీకి అనుకూలంగా వస్తున్న తరుణంలో.. అక్కడ ఉన్న తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. చూస్తుండగానే మంటలు కార్యాలయం మొత్తం వ్యాపించాయి. ఈక్రమంలోనే భవనం నుంచి భారీగా మంటలు, పొగలు ఎగిసిపడ్డాయి. ఈ ఘటనతో.. స్థానికంగా ఉన్న ప్రజలంతా తీవ్ర భయాందోళకు గురయ్యారు. అసన్సోల్, దిన్హటాలో తీవ్ర ఘర్షణలు..కేవలం జమురియాలోనే కాకుండా అసన్సోల్, దిన్హటాలోని కౌంటింగ్ కేంద్రాల వద్ద కూడా తీవ్ర స్థాయిలో ఘర్షణలు జరిగాయి. అసన్సోల్ ఇంజినీరింగ్ కాలేజీ కౌంటింగ్ సెంటర్ వద్ద పోలింగ్ ఏజెంట్ల మధ్య మొదలైన వాగ్వాదం కాసేపటికే పెద్ద గొడవకు దారి తీసింది. ఆందోళనకారులు పరస్పరం కుర్చీలు విసురుకోవడమే కాకుండా కేంద్రం వెలుపల ఉన్న వాహనాలను ధ్వంసం చేశారు. పరిస్థితి అదుపు తప్పుతుండటంతో రంగంలోకి దిగిన భద్రతా దళాలు ఆందోళనకారులపై లాఠీచార్జ్ చేసి చెల్లాచెదురు చేశారు.రంగంలోకి కేంద్ర బలగాలు..రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడేందుకు కేంద్ర ఎన్నికల సంఘం అప్రమత్తం అయింది. సమస్యాత్మక ప్రాంతాల్లో భారీగా కేంద్ర సాయుధ పోలీసు బలగాలను (సీఏపీఎఫ్) మోహరించింది. అసన్సోల్ దుర్గాపూర్ పోలీస్ కమిషనర్ ప్రణవ్ కుమార్ మాట్లాడుతూ.. "కొందరు దుండగులు ఒక రాజకీయ పార్టీ శిబిరంపై దాడి చేసి ధ్వంసం చేశారు. సీసీటీవీ దృశ్యాల ఆధారంగా నిందితులను గుర్తిస్తున్నాం. ఎవరైనా చట్టాన్ని అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం" అని హెచ్చరించారు.ప్రస్తుతం కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుండటంతో రాష్ట్రవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. .. ఓటమిని జీర్ణించుకోలేని వర్గాలు, విజయోత్సాహంలో ఉన్న వర్గాల మధ్య ఘర్షణలు పెరిగే అవకాశం ఉందని నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి. ఈక్రమంలోనే అప్రమత్తమైన కేంద్ర ఎన్నికల సంఘం.. పశ్చిమ బెంగాల్‌లో ఎవరు విజయం సాధించినా . ఒకవేళ ఎవరైనా కాదని ర్యాలీలు నిర్వహిస్తే.. కఠిన చర్యలు తప్పవని సూచించింది. అంతేకాకుండా ప్రభుత్వం, పోలీసులు కూడా సున్నితమైన ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరించి పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నారు.