తమిళనాడులో విజయ్ విక్టరీ.. పాలిటిక్స్, పర్సనల్‌ లైఫ్‌కు ముడిపెట్టొద్దు: దివ్వెల మాధురి

Wait 5 sec.

తమిళనాడు ఎన్నికల్లో టీవీకే జయకేతనం ఎగురవేస్తోంది. టీవీకే అధినేత విజయ్.. ముఖ్మమంత్రి పీఠం అధిష్టించే దిశగా అడుగులు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో పలువురు ప్రముఖులు విజయ్‍కు అభినందనలు తెలియజేస్తున్నారు, సినీ, రాజకీయ రంగాలకు చెందిన ఎంతో మంది ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా విజయ్‌కు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ క్రమంలోనే సైతం.. టీవీకే చీఫ్ విజయ్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు. ఇన్‌స్టాగ్రామ్‌లో స్టోరీ పెట్టారు దివ్వెల మాధురి. "వ్యక్తిగత జీవితానికి రాజకీయాలకు ఏమాత్రం సంబంధం లేదు. వ్యక్తిగత జీవితంతో రాజకీయాలు ముడిపడి ఉంటే ఈ ప్రపంచంలో ఎవరూ రాజకీయాలు చేయలేరు. కంగ్రాట్యులేషన్స్ విజయ్ గారు" అంటూ దివ్వెల మాధురి ఇన్‌స్టాలో స్టోరీ పెట్టారు.Read also: ఈ స్టోరీ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దివ్వెల మాధురి, ఎమ్మెల్సీ వ్యవహారం గత కొన్నేళ్లుగా ఏపీలో చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. దువ్వాడ శ్రీనివాస్ కుటుంబంలో వివాదం.. దివ్వెల మాధురి ఎంట్రీ అప్పట్లో సంచలనం రేపింది. ఆ తర్వాత దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి ఎక్కడికి వెళ్లినా కలిసే ఉంటున్నారు. ఇదే సమయంలో దువ్వాడ వాణికి విడాకులు ఇవ్వనున్నట్లు దువ్వాడ శ్రీనివాస్ అప్పట్లోనే ప్రకటించారు. ఈ తరహాలోనే తమిళనాడులో టీవీకే చీఫ్ విజయ్ వ్యవహారం ఉంది. Read also: విభేదాలు రావటంతో భార్య సంగీతతో విడాకులు తీసుకుంటున్నారు విజయ్. ఇదే సమయంలో విజయ్, త్రిష పెళ్లి చేసుకోబోతున్నారంటూ గత కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. దీనిపై అటు విజయ్ కానీ.. ఇటు త్రిష కానీ ఎలాంటి క్లారిటీ ఇవ్వటం లేదు. పైపెచ్చు టీవీకే వ్యవహారాల్లో త్రిష కీలక పాత్ర పోషిస్తున్నారంటూ వార్తలు వస్తున్నాయి.Read also: ఈ క్రమంలోనే వ్యక్తిగత విషయాలను, రాజకీయాలకు ముడిపెట్టకూడదంటూ దివ్వెల మాధురి స్టోరీ షేర్ చేశారు. ఆ రకంగా దువ్వాడ శ్రీనివాస్, విజయ్ వ్యక్తిగత, రాజకీయ జీవితాలను పోల్చే ప్రయత్నం చేశారు. విజయ్ లాగే శ్రీనివాస్ కూడా రాజకీయాల్లో రాణిస్తారని దివ్వెల మాధురి పరోక్షంగా తన స్టోరీ ద్వారా ప్రస్తావించారు.