తెలంగాణ ప్రజలకు బిగ్ రిలీఫ్.. నేడు ఈ జిల్లాల్లో వర్షాలు, హెచ్చరికలు జారీ

Wait 5 sec.

తెలంగాణలో ప్రస్తుతం విభిన్న వాతావరణం నెలకొని ఉంది. ప్రజల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే.. మరోవైపు వాతావరణ శాఖ ప్రకటించిన వర్ష సూచన కొంత ఊరటనిస్తోంది. ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా ఎండల తీవ్రత గరిష్ట స్థాయికి చేరుకుంది. ముఖ్యంగా తలపించాయి. నిజామాబాద్ జిల్లా బాల్కొండలో అత్యధికంగా 45.8 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైందంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. జగిత్యాల, పెద్దపల్లి, ఆదిలాబాద్, నిజామాబాద్, మంచిర్యాల, అసిఫాబాద్ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల సెల్సియస్ మార్కును దాటేశాయి. ఎండల ధాటికి ఆదిలాబాద్ జిల్లాలో ఓ పంచాయతీ కార్మికుడు వడదెబ్బతో మరణించడం విషాదం నింపింది.ఈ నేపథ్యంలో హైదరాబాద్ వాతావరణ కేంద్రం రాష్ట్ర ప్రజలకు కీలక హెచ్చరిక జారీ చేసింది. దక్షిణ ఛత్తీస్‌గఢ్ నుంచి తమిళనాడు వరకు విస్తరించి ఉన్న ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో రానున్న మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ముఖ్యంగా జయశంకర్ భూపాలపల్లి, ములుగు, వరంగల్, హనుమకొండ, సూర్యాపేట, నల్గొండ, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఈ సమయంలో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీచే ప్రమాదం ఉందని చెప్పారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. రాష్ట్రంలోని మిగిలిన జిల్లాల్లో కూడా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉందని వాతావరణసాఖ అంచనా వేసింది. ఈ వర్షాల వల్ల ప్రస్తుతానికి వడగాల్పుల తీవ్రత తగ్గే అవకాశం కనిపిస్తోందని చెప్పారు. రానున్న రెండు రోజులు ఉష్ణోగ్రతలు ప్రస్తుత స్థాయిలోనే ఉన్నప్పటికీ.. ఆ తర్వాత మూడు రోజుల్లో క్రమేపి 2 నుండి 3 డిగ్రీల మేర తగ్గుతాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న జిల్లాల్లో ప్రజలు మధ్యాహ్నం వేళ బయటకు రావద్దని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆరోగ్య శాఖ సూచిస్తోంది. ముఖ్యంగా 11 నుంచి సాయంత్రం 4 సమయంలో అత్యవసరం అయితే తప్ప ఇళ్ల నుంచి బయటకు వెళ్లొద్దని చెబుతున్నారు. ఆహారం విషయంలోనూ జాగ్రత్తలు తీసుకోవాలని.. తేలికగా జీర్ణమయ్యే ఆహారం తీసుకోవాలని అంటున్నారు. మసాలా ఫుడ్స్, ఎక్కువగా నూనెలో వేయించిన ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలని చెబుతున్నారు. మద్యం, టీ, కాఫీలు తగ్గించాలని జ్యూసులు, కొబ్బరి నీళ్లు, జ్యూసులు తాగాలని సూచిస్తున్నారు.