గుజరాత్ టైటాన్స్‌కి గోల్డెన్ ఛాన్స్.. ఆ టీమ్స్‌తో మ్యాచ్‌లంటే ఇక ప్లే ఆఫ్స్‌లో అడుగుపెట్టినట్టే

Wait 5 sec.

పేరు వినగానే స్లో అండ్ స్టడీ విన్స్ ది రేస్ అనే ఇంగ్లిష్ సామెత మనకు గుర్తొచ్చేస్తది. ఓటములతో సీజన్‌ను ఆరంభించి ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా గెలుస్తూ చేరుకోవడం గుజరాత్‌కి పరిపాటే. ప్లే ఆఫ్స్ వరకూ వెళ్లకపోయినా.. ఐదో స్థానంతో అయినా సీజన్‌ను ముగిస్తుంది. ఈ ఏడాది కూడా సీజన్ ఆరంభంలో పాయింట్ల పట్టికలో కింద కూర్చున్న గుజరాత్ ఇప్పుడు టాప్ 4 టీమ్స్‌కు నిద్రలేకుండా చేస్తోంది. ఆసక్తికరంగా మారింది. మొన్నటి వరకు టాప్ 4 టీమ్స్ అయిన పంజాబ్, ఆర్సీబీ, సన్‌రైజర్స్, రాజస్థాన్ రాయల్స్ ఈజీగా ప్లే ఆఫ్స్‌లో కూర్చుంటాయి అనుకుంటే.. ఇప్పుడు గుజరాత్ ఆ జట్లు అన్నింటికీ ఏకుకు మేకై కూర్చుంది. టాప్ టీమ్స్‌ను ఒక్కొక్కటిగా ఓడించుకుంటూ వస్తూ ఇప్పుడు 12 పాయింట్లతో ఎప్పుడైనా ప్లే ఆఫ్స్‌లో అడుగుపెట్టేందుకు సిద్దంగా ఉంది. పాయింట్స్ టేబుల్‌లో రెండో స్థానంలో ఉన్న ఆర్సీబీని చిత్తుగా ఓడించిన గుజరాత్ టైటాన్స్.. ఇప్పుడు టేబుల్ టాప్ పంజాబ్ కింగ్స్‌‌పై ఆఖరి ఓవర్‌లో విజయం సాధించి.. రివేంజ్ సెషన్‌కు అసలైన అర్థం చెప్పింది. సీఎస్కే, ఆర్సీబీ, పంజాబ్‌పై హ్యాట్రిక్ విక్టరీలు సాధించిన ప్లే ఆఫ్స్‌కు రెండు విజయాల దూరంలో నిలిచింది. గుజరాత్ టైటాన్స్ తన ఆఖరి నాలుగు మ్యాచ్‌లలో రెండు గెలిస్తే ప్లే ఆఫ్స్‌లో అడుగుపెట్టినట్టే. గుజరాత్ టైటాన్స్ ఆడాల్సిన ఆఖరి నాలుగు మ్యాచ్‌లు కూడా రాజస్థాన్, సన్‌రైజర్స్, కోల్‌కతా నైట్ రైడర్స్, చెన్నై సూపర్ కింగ్స్ మీదే. సన్‌రైజర్స్‌తో ఒక్కదానితోనే ఈ సీజన్‌లో కొత్తగా ఆడనుండగా.. రాజస్థాన్, కోల్‌కతా, చెన్నైపై ఆల్రెడీ ఈ సీజన్‌లో గుజరాత్ ఆడింది. అందులో రాజస్థాన్‌పై ఓడిన గుజరాత్.. కోల్‌కతా, చెన్నైపై విజయం సాధించింది. దాంతో ఈ నాలుగు మ్యాచ్‌లలో రెండు గెలవడం గుజరాత్‌కి నల్లేరు మీద నడకలాగే కనిపిస్తోంది. జేసన్ హోల్డర్ జట్టులోకి వచ్చిన తర్వాత గుజరాత్ టైటాన్స్ చాలా స్ట్రాంగ్ అయింది. ఆర్సీబీ, పంజాబ్‌తో జరిగిన రెండు మ్యాచ్‌లలోనూ జేసన్ హోల్డర్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచింది గుజరాత్ విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. సాయి సుదర్శన్, శుభ్‌మన్ గిల్ బ్యాటింగ్‌లో రాణిస్తుండగా.. రబడా, సిరాజ్ బౌలింగ్‌తో గుజరాత్‌ విజయాల్లో కీలకంగా మారారు. రానున్న నాలుగు మ్యాచ్‌లలో కూడా ఈ ఐదుగురు మళ్లీ రాణిస్తే గుజరాత్ టైటాన్స్ ప్లే ఆఫ్స్‌కి వెళ్లడం చాలా సులభమనే చెప్పొచ్చు.