తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి వేలాదిమంది భక్తులు ప్రతిరోజూ తరలివస్తుంటారు. ఆ కలియుగ ప్రత్యక్ష దైవాన్ని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటారు. తిరుమలకు వచ్చేవారిలో చాలామంది భక్తులు అలిపిరి, శ్రీవారి మెట్టు మార్గాల్లో నడిచి వస్తుంటారు. కొందరు భక్తులు వెంకన్న స్వామిపై భక్తితో తిరుమలకు వచ్చిన ప్రతిసారి నడిచి వెళుతుంటారు. అలా పదులు, వందసార్లు శ్రీవారి దర్శనం కోసం వెళ్లిన భక్తులు చాలామంది ఉన్నారు. కానీ ఓ భక్తుడు మాత్రం తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి ఏకంగా వెయ్యిసార్లు నడిచి వెళ్లారు. రిటైర్డ్ హెడ్‌మాస్టర్ అరుదైన రికార్డు సృష్టించారు.తిరుపతి పద్మావతిపురానికి చెందిన మధు హెడ్‌మాస్టర్‌గా పనిచేసి రిటైర్ అయ్యారు. ఆయన తిరుమలకు తరచూ వెళుతుంటారు.. ఆయన 2006 డిసెంబర్ 2 నుంచి శనివారం (మే 2) వరకు ఏకంగా వెయ్యిసార్లు తిరుమలకు కాలినడకన వెళ్లి శ్రీవారిని దర్శించుకున్నారు. విద్యార్థులు ఆరోగ్యంగా ఉండాలి.. వారికి మంచి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు రావాలి, నైతిక విలువలతో జీవించాలని స్వామివారిని కోరుకున్నట్లు మధు చెబుతున్నారు. తాను ఇప్పటి వరకు వెయ్యిసార్లు తిరుమలకు కాలినడకన వచ్చినట్లు మధు తెలిపారు. తిరుమల శ్రీవారి ఆశీస్సులతో ఇలా వెయ్యిసార్లు వచ్చానంటున్నారు.మరో వెళ్లానని చెప్పిన వీడియో కూడా వైరల్ అయ్యింది. తిరుపతికి చెందిన రమణమూర్తి మొత్తం 2600 సార్లు తిరుమల వెళ్లినట్లు చెప్పుకొచ్చారు.అయితే ఈ వీడియో 2024 సెప్టెంబర్ 21 నాటిది అని కొందరు చెప్పారు. ఆయన 14 ఏళ్ల నుంచి 2600 సార్లు తిరుమల కొండెక్కి దిగినట్లు వీడియోలో అన్నారు. ఆయనకు ఇప్పటి వరకు 3350 దర్శనాలు వీడియోలో తెలిపారు. ఒక్కోసారి రోజుకు రెండుసార్లు స్వామిని దర్శించుకున్నట్లు చెప్పడం విశేషం.అన్నమయ్య సాహితీ సదస్సు ప్రారంభంశ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల 618వ జయంతి ఉత్సవాల్లో భాగంగా తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో సాహితీ సదస్సులు ఘనంగా ప్రారంభమయ్యాయి. సంకీర్తనలు భక్తి, తాత్వికత, మానవీయ విలువల సమ్మేళనంగా తరతరాలకు స్ఫూర్తినిచ్చే అపూర్వ సాహిత్య సంపదగా నిలిచాయని హైదరాబాద్ కు చెందిన ఆచార్య ఆంజనేయులు తెలిపారు. సదస్సుకు అధ్యక్షత వహించిన ఆయన “ప్రాచీనాంధ్ర సాహిత్యంలో అన్నమయ్య ప్రత్యేకత” అంశంపై ప్రసంగించారు. తాళ్లపాక అన్నమాచార్యుల సంకీర్తనలు భక్తిని గాఢం చేసే దివ్య మార్గదర్శకాలుగా నిలిచాయన్నారు. “అన్నమయ్య సంకీర్తనల ప్రచారం–ప్రసారం”పై హైదరాబాద్‌కు చెందిన డాక్టర్ అనంత పద్మనాభరావు ప్రసంగించారు. టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్ట్ ద్వారా సంకీర్తనల ప్రచారం సమర్థవంతంగా కొనసాగుతోందన్నారు. రేడియో, టీవీ, డిజిటల్ వేదికల ద్వారా ఈ కీర్తనలు ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చెందుతున్నాయన్నారు. తాళ్లపాక కవుల పదప్రయోగాల వైశిష్ట్యాన్ని తిరుపతికి చెందిన ఆచార్య దామోదర నాయుడు వివరించగా.. అన్నమయ్య కీర్తనల్లో సమానత్వం, మానవత్వం ప్రతిఫలిస్తున్నాయని ఆచార్య చెన్నప్ప తెలిపారు.తిరుమల బియ్యం ఈ-వేలంతిరుమల శ్రీవారి ఆలయంతో పాటు టీటీడీ అనుబంధ ఆలయాలకు భక్తులు హుండీ ద్వారా బియ్యాన్ని సమర్పిస్తుంటారు. భక్తులు సమర్పించి ఈ బియ్యాన్ని మే 14న ఈ-వేలం ద్వారా విక్రయించనున్నారు. మొత్తం 41 లాట్లుగా ఉన్న మిక్స్‌డ్‌ రైస్‌లో ఉదయం సెషన్‌లో 21 లాట్లు, మధ్యాహ్నం సెషన్‌లో 20 లాట్లు కలిపి సుమారు 16,338 కిలోల బియ్యాన్ని ఈ-వేలంలో ఉంచనున్నారు. ఈ బియ్యం వేలంలో పాల్గొనదలచిన వారు.. ఉదయం, మధ్యాహ్నం సెషన్‌లకు విడివిడిగా మే 13వ తేదీ సాయంత్రం లోపు ఆన్‌లైన్‌లో konugolu పోర్టల్ ద్వారా ప్రతి సెషన్‌కు రూ.50,000/- ఈఎండీ (EMD) చెల్లించాల్సి ఉంటుంది. ఇతర వివరాల కోసం తిరుపతిలోని టీటీడీ మార్కెటింగ్ కార్యాలయాన్ని కార్యాలయ వేళల్లో సంప్రదించవచ్చు. ఫోన్ నంబర్ 0877-2264429.. టిటిడి వెబ్‌సైట్‌ www.konugolu.ap.gov.in సంప్రదించాలని టీటీడీ సూచించింది.