SRHకి ప్లే ఆఫ్స్‌ గండం.. కొంపదీసి ఐపీఎల్ 2022 సీన్ రిపీట్ కాదు కదా!

Wait 5 sec.

చాలా ఆసక్తికరంగా మారుతున్నాయి. . వరుసగా ఐదు మ్యాచ్‌లు గెలిచిన తర్వాత హోం గ్రౌండ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌పై దారుణ ప్రదర్శన చేసింది. ఇంకో నాలుగు పాయింట్లు సాధిస్తే ప్లే ఆఫ్స్‌లో సీటు కన్ఫార్మ్ చేసుకోవచ్చు అనుకున్న సమయంలో.. కేకేఆర్‌పై రెండు పాయింట్లు కోల్పోయింది. దాంతో ఇప్పుడు సన్‌రైజర్స్ ప్లే ఆఫ్స్ ఛాన్స్‌లు సన్నగిల్లుతూ వస్తున్నాయి. ఇది చూసిన కొందరు ఐపీఎల్ 2022 సీన్ రిపీట్ అవుతుందేమోనన్న టెన్షన్‌లో ఉన్నారు. ఈ సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇప్పటి వరకు పది మ్యాచ్‌లు ఆడితే ఆరు మ్యాచ్‌లు గెలిచి, నాలుగింటిలో ఓడింది. ప్రస్తుతానికి 12 పాయింట్లతో కొనసాగుతున్న సన్‌రైజర్స్.. పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉంది. ఆరెంజ్ ఆర్మీకి ఇంకో నాలుగు మ్యాచ్‌లు మిగిలుండగా.. అందులో రెండు గెలిస్తే ప్లే ఆఫ్స్‌లోకి ఎంట్రీ ఇచ్చినట్టే. ఇప్పుడు ఆ రెండు గెలవడమే అగ్ని పరీక్షలా మారింది. ఇప్పుడు సన్‌రైజర్స్ పొజిషన్ చూసిన ఫ్యాన్స్.. కొంపదీసి 2022 సీన్ రిపీట్ కాదు కదా అని భయపడుతున్నారు. ఐపీఎల్ 2022లో కూడా సన్‌రైజర్స్ హైదరాబాద్ వరుసగా ఐదు మ్యాచ్‌లలో గెలిచి ప్లే ఆఫ్స్‌కు ఈజీగా చేరుకుంటుంది అనుకునేలోపు.. గ్రూప్ స్టేజ్‌ని ఆరు విజయాలతో ముగించి ఇంటి బాట పట్టింది. అప్పుడు మూడో మ్యాచ్ నుంచి ఏడో మ్యాచ్ వరకు వరుసగా ఐదు గెలిచిన ఆరెంజ్ ఆర్మీ ఆ తర్వాత వరుసగా ఐదు ఓడింది. ఇప్పుడు కూడా సేమ్ సీన్ రిపీట్ అవుతుందేమోనన్న టెన్షన్‌లో ఫ్యాన్స్ ఉన్నారు. ఇక ఈ సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తన మిగతా నాలుగు మ్యాచ్‌లలోనూ టఫ్ టీమ్స్‌నే ఎదుర్కోనుంది. అందులో మూడు ఇప్పుడు ప్లే ఆఫ్స్ రేసులో దూసుకుపోతున్న జట్లే ఉండటం విశేషం. మే 6న టేబుల్ టాపర్‌గా ఉన్న పంజాబ్ కింగ్స్‌తో ఆడనుండగా, మే 12న గుజరాత్ టైటాన్స్, మే 18న చెన్నై సూపర్ కింగ్స్, మే 22న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో ఆడనుంది. ఈ నాలుగు మ్యాచ్‌లలో రెండు గెలిస్తేనే సన్‌రైజర్స్ ప్లే ఆఫ్స్‌కి వెళ్లేది. లేకపోతే ఇంటిదారి పట్టినట్టే.