రిలయన్స్‌తో 4 రోజుల్లోనే రూ. 1.39 లక్షల కోట్ల లాభం.. ఇన్వెస్టర్లను ముంచేసిన ఎస్బీఐ, ఎల్ఐసీ!

Wait 5 sec.

Most Valued Firms Market Cap: ఒకవైపు పశ్చిమాసియాలో ఇరాన్- అమెరికా- ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ కారణంగా మార్చి నుంచి భారత స్టాక్ మార్కెట్లలో పతనం కొనసాగుతూనే ఉంది. ఏప్రిల్‌లో కాస్త కోలుకున్నాయి. ఇక గత వారం కూడా తీవ్ర ఒడుదొడుకులకు లోనైనప్పటికీ.. చివరికి సూచీలు లాభాల్లోనే ముగిశాయి. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్ కిందటి వారం (ఏప్రిల్ 27-30) నాలుగు రోజుల్లో కలిపి మొత్తం 249 పాయింట్లు పుంజుకుంది. మే 1న శుక్రవారం రోజు మహారాష్ట్ర దినోత్సవం/ మే డే కారణంగా స్టాక్ మార్కెట్లు పని చేయలేదు. మార్కెట్లు లాభాల్లో ముగిసిన క్రమంలో.. టాప్- 10 మోస్ట్ వాల్యూడ్ సంస్థల మార్కెట్ విలువ 4 రోజుల్లో రూ. 2.20 లక్షల కోట్లు పెరిగింది. కంపెనీల మార్కెట్ విలువనే.. మదుపరుల సంపదగా పరిగణిస్తుంటారు కాబట్టి.. ఆ మేరకు ఇన్వెస్టర్ల సంపద పెరిగిందని చెప్పొచ్చు. అయితే ఇక్కడ దిగ్గజ కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్ అత్యధికంగా లాభపడింది. టాప్- 10 కంపెనీల్లో 4 కంపెనీలు రిలయన్స్ ఇండస్ట్రీస్, భారతీ ఎయిర్‌టెల్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS), బజాజ్ ఫినాన్స్ నాలుగు కలిపి మార్కెట్ విలువ రూ. 2.20 లక్షల కోట్లు పెరగ్గా.. మిగతా 6 కంపెనీల విలువ ఏకంగా రూ. 1.24 లక్షల కోట్లు తగ్గింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ 4 రోజుల్లో రూ. 1.39 లక్షల కోట్లు పెరగ్గా.. మొత్తం ఎం- క్యాప్ రూ. 19.36 లక్షల కోట్లకు ఎగబాకింది. భారతీ ఎయిర్‌టెల్ విలువ చూస్తే రూ. 43 వేల కోట్లు పెరిగి రూ. 11.49 లక్షల కోట్లకు చేరుకుంది. టీసీఎస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ కూడా రూ. 27 వేల కోట్లకుపైగా పెరగ్గా రూ. 8.94 లక్షల కోట్లుగా ఉంది. బజాజ్ ఫినాన్స్ విలువ 4 రోజుల్లో రూ. 9 వేల కోట్లకుపైగా పెరగడంతో రూ. 5.83 లక్షల కోట్లకు చేరుకుంది. ఇదిలా ఉండగా.. ఐసీఐసీఐ బ్యాంక్ మార్కెట్ విలువ అత్యధికంగా తగ్గింది. 4 రోజుల్లో ఇది రూ. 45 వేల కోట్లకుపైగా విలువను కోల్పోగా.. ప్రస్తుతం రూ. 9.04 లక్షల కోట్ల వద్ద ఉంది. రూ. 30 వేల కోట్లు తగ్గి రూ. 9.85 లక్షల కోట్లుగా ఉంది. హెచ్‌డీఎఫ్‌సీ మార్కెట్ క్యాపిటలైజేషన్ గత వారం రూ. 20 వేల కోట్లు తగ్గడంతో రూ. 11.87 లక్షల కోట్లకు చేరుకుంది. హిందుస్థాన్ యూనిలివర్ విలువ రూ. 18 వేల కోట్లు తగ్గడంతో రూ. 5.28 లక్షల కోట్లుగా ఉంది. కూడా రూ. 8 వేల కోట్లకుపైగా తగ్గి రూ. 5.04 లక్షల కోట్లుగా ఉంది. ఎల్ అండ్ టీ విలువ గత వారం రూ. 178 కోట్లు తగ్గి రూ. 5.51 లక్షల కోట్లుగా ఉంది.