TVK Vijay: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలపై విజయ్ ఇంపాక్ట్.. విజిల్‌ దెబ్బకు గెలుపోటములు తారుమారు.. కొత్త ఆశలు రేపుతోన్న టీవీకే..!

Wait 5 sec.

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు అనగానే.. ఏముందిలే తమిళ ప్రజలు అధికార పార్టీని ఓడించి, ప్రతిపక్షానికి పట్టం కడతారని భావించేవారు ఒకప్పుడు. దశాబ్దాలుగా తమిళ రాజకీయాల్లో ద్రవిడ పార్టీలైన డీఎంకే, అన్నాడీఎంకే మధ్యే అధికార మార్పిడి జరుగుతుండటమే దీనికి కారణం. అయితే ఈసారి పొలిటికల్ ఎంట్రీతో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. తమిళ ప్రజలకు రూపంలో ద్రవిడ పార్టీలకు ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీ అందుబాటులోకి వచ్చింది. దీంతో తమిళనాట ముక్కోణపు పోరు నెలకొంది.విజయ్ పార్టీ తమిళ రాజకీయాలపై గణనీయమైన ప్రభావాన్నే చూపిందని చెప్పొచ్చు. యువత, మహిళలు పెద్ద సంఖ్యలో ఈ పార్టీకి ఓటేసినట్లు.. పట్టణ ప్రాంతాల్లో ఈ పార్టీ ప్రభావం ఎక్కువగా ఉన్నట్లు ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. తమిళనాట ఈసారి కూడా డీఎంకే అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని అంచనా వేసిన మెజార్టీ ఎగ్జిట్ పోల్స్.. విజయ్ పార్టీకి 20 శాతానికిపైగానే ఓట్లు పడతాయని కూడా అంచనా వేశాయి. రాజకీయాల్లోకి వస్తూనే 20 శాతానికిపైగా ఓట్లు సాధించడం అనేది ప్రస్తుత రోజుల్లో అంత సాధారణ విషయం కాదు. Read Also: ఇక యాక్సెస్ మై ఇండియా సర్వే అయితే.. . విజయ్ మరో ఎంజీఆర్ అవుతారని చెప్పకనే చెప్పింది. టుడేస్ చాణక్య స్ట్రాటజీ సైతం టీవీకే 63 సీట్లు గెలుస్తుందని అంచనా వేసింది. కొన్ని ఎగ్జిట్ పోల్ సంస్థలు విజయ్ పార్టీ తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటులో కీలకంగా మారుతుందని చెప్పాయి. అయితే అన్నాడీఎంకే, డీఎంకేల్లో ఎవరి ఓటు బ్యాంకును విజయ్ పార్టీ చీల్చిందనేది సస్పెన్స్‌గా మారింది. కొన్ని చోట్ల అన్నాడీఎంకే ఓటు బ్యాంకు చీలితే, మరికొన్ని చోట్ల డీఎంకే ఓటు బ్యాంకును టీవీకే తనవైపు మళ్లించుకుందనే అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. తమిళనాడు ఉత్తర, పశ్చిమ ప్రాంతాల్లో అన్నాడీఎంకేకు సంప్రదాయ ఓటు బ్యాంక్ బలంగా ఉండేది. ఈ ఓటు బ్యాంక్‌ను విజయ్ తన వైపు తిప్పుకున్నారని విశ్లేషణలు వస్తున్నాయి. దీంతో ఈ ప్రాంతాల్లో అన్నాడీఎంకేకు గట్టి దెబ్బ తగిలిందని భావించొచ్చు. తమిళనాడులో మళ్లీ డీఎంకే అధికారంలోకి వస్తుందని అనేక సంస్థల ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. అయితే ఆ పార్టీకి పట్టున్న చెన్నై, తిరుచ్చి లాంటి పట్టణ ప్రాంతాల్లో టీవీకే కారణంగా పోటాపోటీగా పరిస్థితి మారింది.Read Also: 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో 85 శాతం ఓటింగ్ నమోదైంది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల చరిత్రలోనే ఇది అత్యధికం. ఈ స్థాయిలో పోలింగ్ నమోదు కావడానికి విజయ్ పార్టీనే ప్రధాన కారణం అనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. విజయ్ పార్టీ ఎన్ని సీట్లు గెలుస్తుందనేది పక్కనబెడితే.. ఆ పార్టీ తక్కువలో తక్కువగా 60 నుంచి 80 స్థానాల్లో స్థానాల్లో డీఎంకే, అన్నాడీఎంకే కూటముల గెలుపోటములను తీవ్రంగా ప్రభావితం చేసిందనే అంచనా ఉంది.తమిళ ప్రజలకు కొత్త ఆశ..ఈ ఎన్నికల్లో 20-35 శాతం వరకు ఓటు బ్యాంక్‌‌ సాధిస్తే.. ప్రస్తుతానికి పెద్దగా సీట్లు గెలవలేక పోయినప్పటికీ.. వచ్చే ఎన్నికల్లో విజయ్ అత్యంత కీలకంగా మారతారని.. ఆయన సీఎం పదవికి ప్రధాన పోటీదారు అవుతారనే అంచనాలు ఉన్నాయి. 2026 అసెంబ్లీ ఎన్నికలు విజయ్ గ్రౌండ్ ప్రిపేర్ చేసుకోవడానికి ఉపయోగపడటమే కాకుండా.. తమిళ ప్రజలకు ద్రవిడ పార్టీలకు ప్రత్యామ్నాయ రాజకీయ శక్తి దొరికిందనే నమ్మకాన్ని కలిగించాయని చెప్పొచ్చు. ఒక్క మాటలో చెప్పాలంటే.. తమిళనాడు పవర్ పాలిటిక్స్‌లో ఫ్యూచర్ స్టార్ ఇన్ మేకింగ్ అన్నమాట.