SRH 9 ఓవర్లకు 105/2.. 19 ఓవర్లకు 165 ఆలౌట్.. కాటేరమ్మ కొడుకులకు ఏమైంది!

Wait 5 sec.

. ఆరంభంలో అదరగొట్టిన బ్యాటర్లు.. టాప్ ఆర్డర్ అవుటవ్వగానే ఒక్కసారిగా డౌన్‌ఫాల్ స్టార్ట్ అయింది. ఉప్పల్‌లో మొదటి తొమ్మిది ఓవర్ల స్కోర్ చూసిన ఫ్యాన్స్ 250 గ్యారెంటీ అని ఫిక్స్ అయ్యారు. కానీ సీన్ కట్ చేస్తే 165కే ఆలౌట్ అయ్యారు. టాప్‌లో నిలవాల్సిన మ్యాచ్‌లో చెత్త బ్యాటింగ్‌తో ఓటమిని ఎదుర్కొన్నారు. ఉప్పల్ వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచిన సన్‌రైజర్స్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. సన్‌రైజర్స్ ఫస్ట్ బ్యాటింగ్, అది కూడా హోం గ్రౌండ్ ఉప్పల్‌లో కావడంతో ఫ్యాన్స్ భారీ స్కోర్ ఊహించారు. అందుకు తగ్గట్టుగానే ఓపెనర్లు మంచి ఆరంభమే ఇచ్చారు. మొదటి తొమ్మిది ఓవర్లలోనే 105 పరుగులు చేసింది. ట్రావిస్ హెడ్ అవుటైన తర్వాత సీను తారుమారయింది. క్లాసెన్ కూడా వికెట్ కోల్పోవడంతో సన్‌రైజర్స్ పతనం మొదలైంది. 10.4 ఓవర్లకు 117/3తో ఉన్న జట్టు ఆ తర్వాత పెద్దగా భాగస్వామ్యాలు నెలకొల్పలేక తక్కువ పరుగులకే ఆలౌట్ అయింది. ఇషాన్ కిషన్ కాసేపు నెట్టుకొచ్చినా మిగతా బ్యాటర్లు క్రీజులో నిలువలేకపోవడం సన్‌రైజర్స్‌కు పెద్ద మైనస్. ట్రావిస్ హెడ్ 61, ఇషాన్ కిషన్ 42, ప్యాట్ కమిన్స్ 10, అభిషేక్ శర్మ 15 పరుగులు చేయడంతో 19 ఓవర్లలోనే 165 పరుగులకు ఆలౌట్ అయింది. ఈజీ టార్గెట్‌తో బరిలోకి దిగిన కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన దానికి రివేంజ్ తీర్చుకుంది. అజింక్య రహానే 43, ఫిన్ అలెన్ 29, అంగ్‌క్రిష్ రఘువంశీ 59, రింకూ సింగ్ 22 పరుగులు చేయడంతో 18.2 ఓవర్లలోనే 169/3తో కేకేఆర్ విజయం సాధించింది. మ్యాచ్ అనంతరం కెప్టెన్ ప్యాట్ కమిన్స్ మాట్లాడుతూ తమ జట్టు కచ్చితంగా కమ్ బ్యాక్ ఇస్తుందని చెప్పాడు. ప్లే ఆఫ్స్‌లో అడుగుపెట్టాలంటే సన్‌రైజర్స్ మిగతా నాలుగు మ్యాచ్‌లలో కచ్చితంగా రెండు గెలిచి తీరాల్సిందే. ప్రస్తుతానికి 10 మ్యాచ్‌లలో ఆరు గెలిచి 12 పాయింట్లతో మూడో స్థానంలో కొనసాగుతోంది.