SRHతో మ్యాచ్‌లో మనీష్ పాండే సెన్సేషన్.. బ్యాటింగ్ చేయకపోయినా రికార్డు సొంతం!

Wait 5 sec.

కోల్‌కతా నైట్‌రైడర్స్ వెటరన్ బ్యాటర్ ఐపీఎల్‌లో చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్ చరిత్రలోనే 19 సీజన్లు ఆడిన మూడో బ్యాటర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ తర్వాత ఈ ఫీట్ సాధించిన మూడో ప్లేయర్‌గా నిలిచాడు. ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో ఉప్పల్ వేదికగా ఆదివారం జరిగిన మ్యాచ్‌లో బరిలోకి దిగడం ద్వారా మనీష్ పాండే ఈ ఫీట్ సాధించాడు.ఐపీఎల్ 2026లో మనీష్ పాండేకు ఇదే తొలి మ్యాచ్. కేకేఆర్ రెగ్యులర్ ప్లేయర్ రమణ్‌దీప్ సింగ్ స్థానంలో మనీష్ పాండే తుది జట్టులో చోటు సంపాదించాడు. ఐపీఎల్‌లోని 19 సీజన్లలో మనీష్ పాండే కనీసం ఒక్క మ్యాచ్ ఆడాడు. అరంగేట్ర సీజన్ 2008లో ముంబై ఇండియన్స్‌తో ఐపీఎల్ కెరీర్ ప్రారంభించిన మనీష్ పాండే.. ఆ తర్వాత తన కెరీర్‌లో చాలా ఫ్రాంఛైజీల తరఫున ఆడాడు. 36 ఏళ్ల మనీశ్.. తన కెరీర్‌లో మొత్తంగా ఏడు ఫ్రాంఛైజీల తరఫున ఆడాడు.ఐపీఎల్‌లో మనీశ్ పాండే ప్రాతినిధ్యం వహించిన ఫ్రాంఛైజీలు..ముంబై ఇండియన్స్రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకోల్‌కతా నైట్ రైడర్స్సన్ రైజర్స్ హైదరాబాద్లక్నో సూపర్ జెయింట్స్ఢిల్లీ క్యాపిటల్స్పుణె వారియర్స్ఐపీఎల్‌లో మొత్తంగా 175 మ్యాచులు ఆడిన పాండే.. అందులో 3,942 పరుగులు స్కోరు చేశాడు. ఇందులో ఒక సెంచరీ.. 22 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. పాండే కంటే ముందు.. కోహ్లీ, రోహిత్‌లు 19 ఎడిషన్‌లలోనూ మ్యాచ్ ఆడిన ప్లేయర్‌లుగా ఉన్నారు. ఇందులో కోహ్లీ ఒక్కడే.. అన్ని మ్యాచులూ ఒకే ఫ్రాంఛైజీ తరఫున ఆడాడు. టోర్నీ ప్రారంభ సీజన్ నుంచి అతడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫునే ఆడుతున్నాడు. రోహిత్ శర్మ.. ముంబై ఇండియన్స్, దక్కన్ ఛార్జర్స్ తరఫున ఆడాడు.ఐపీఎల్ 2026లో సన్ రైజర్స్‌తో మ్యాచ్‌లో ప్లేయింగ్ లెవెన్‌లో చోటు సంపాదించినా.. మనీశ్‌కు బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. ఈ మ్యాచులో సన్ రైజర్స్ నిర్దేశించిన 166 పరుగుల లక్ష్యాన్ని