ఒకటి రెండూ కాదు.. వరుసగా 13 సెషన్లు అప్పర్ సర్క్యూట్ కొట్టిన స్టాక్.. కాసుల పంట పండింది!

Wait 5 sec.

: స్టాక్ మార్కెట్లలో కొన్ని స్టాక్స్ అప్పటికప్పుడు పెరుగుతుంటాయి.. మరికొన్ని స్టాక్స్ దారుణంగా పడిపోతుంటాయి. ఇక్కడ కారణాల గురించి తెలుసుకోవడం ముఖ్యం. ఆయా కంపెనీల ఫలితాలు, ప్రకటనలు, పెట్టుబడి వ్యూహాలు, ప్రణాళికలు, ఒప్పందాలు ఇలా అన్నీ ప్రభావం చూయిస్తుంటాయి. ఏ కారణంతో పెరిగింది.. ఏ కారణంతో తగ్గిందనేది తెలుసుకుంటే.. మంచి లాభాలు అందుకునేందుకు అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఇలాంటి ఒక స్టాక్ గురించి మాట్లాడుకుందాం. ముందుగా భారత స్టాక్ మార్కెట్ల పరిస్థితి చూస్తే మే 4న సూచీలు మంచి లాభాల్లో ట్రేడవుతున్నాయి. దేశంలోని 4 రాష్ట్రాలు సహా ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఇవాళ వెలువడనున్నాయి. కౌంటింగ్ జరుగుతోంది. ఈ క్రమంలోనే ఇన్వెస్టర్లు అటువైపు దృష్టి సారించగా.. కొనుగోళ్లు జరుగుతున్నాయి. ప్రస్తుతం వార్త రాసే సమయంలో సెన్సెక్స్ దాదాపు 1000 పాయింట్లు పెరిగి 77,900 మార్కుపైన ఉంది. నిఫ్టీ 300 పాయింట్ల లాభంతో 24,280 వద్ద ట్రేడవుతోంది. ఇక్కడే ఏవీఐ పాలీమర్స్ స్టాక్ గురించి మనం మాట్లాడుకోవాలి. ఇది కిందటి రోజు రూ. 19.97 వద్ద ముగియగా.. మే 4న 5 శాతం అప్పర్ సర్క్యూట్ కొట్టి రూ. 20.96 వద్ద ఓపెన్ అయి అక్కడే స్థిరంగా ఉంది. అయితే ఇవాళ ఒక్కరోజే కాదు ఈ స్టాక్ వరుసగా 13 సెషన్ల నుంచి అప్పర్ సర్క్యూట్ కొడుతుండటం విశేషం. ఈ క్రమంలోనే షేర్ ధర రికార్డు స్థాయిలో 87 శాతం పుంజుకుంది. దీంతో ఇందులో ఇన్వెస్ట్ చేసిన వారికి కాసుల పంట పండుతోందని చెప్పొచ్చు. గత 5 ట్రేడింగ్ సెషన్లలో 21 శాతానికిపైగా పెరగ్గా.. నెలలో 45 శాతం పుంజుకుంది. 6 నెలల్లో 260 శాతం ఎగబాకగా.. ఈ ఏడాదిలో ఇప్పటివరకు 125 శాతం పెరిగింది. ఏడాది వ్యవధిలో 220 శాతానికిపైగా పెరిగి మల్టీబ్యాగర్ రిటర్న్స్ అందించింది. ఇక కంెనీ మార్కెట్ విలువ చూస్తే ప్రస్తుతం 197.20 కోట్లుగా ఉంది. స్టాక్ 52 వారాల గరిష్ఠ ధర రూ. 29.41 గా ఉండగా.. కనిష్ఠ ధర రూ. 5.43 గా ఉంది. ఈ స్టాక్ టాప్ ట్రెండింగ్‌లో ఉంది. మంచి వాల్యూమ్స్‌తో ట్రేడవుతోంది. ఇటీవల ఏప్రిల్ 29న కంపెనీ నుంచి వచ్చిన ప్రకటనతో స్టాక్ దూసుకెళ్తోంది. కంపెనీ పెయిడ్ అప్ ఈక్విటీ షేర్ క్యాపిటల్‌లో 5 శాతం వరకు కొనుగోలు చేయనున్నట్లు ప్రమోటర్, ప్రమోటర్ గ్రూప్ పేర్కొంది. ఈ క్రమంలోనే ఇన్వెస్టర్లు ఈ షేర్లను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తోంది.