విజయ్ పార్టీ గెలుపును ఊహించిన ఏకైక ఎగ్జిట్ పోల్.. 100% అని బలంగా.. ఇంత కరెక్ట్‌గా ఎలా ఊహించారు?

Wait 5 sec.

On Tamil Nadu Elections: తమిళనాట పార్టీ విజయ దుందుభి మోగిస్తోంది. 60 ఏళ్లుగా అధికారంలో ఉన్న డీఎంకే, అన్నాడీఎంకే పార్టీలను వెనక్కి నెట్టి.. ఊహించని ఫలితాలను సాధిస్తోంది. 100కుపైగా స్థానాల్లో ఆధిక్యంలో ఉండటం రాజకీయ విశ్లేషకులను సైతం ఆశ్చర్యానికి గురి చేసింది. ఎగ్జిట్ పోల్స్‌కు ఏమాత్రం అందని స్థాయిలో ఈ ఫలితాలు ఉన్నాయి. చాలా వరకు ఎగ్జిట్ పోల్స్ విజయ్ పార్టీ 20 శాతం ఓట్లు సాధిస్తుందని.. అయితే సీట్లు తక్కువగా వస్తాయని అంచనా వేశాయి. కానీ అందుకు భిన్నంగా ఫలితాలు ఉన్నాయి.ఒక్క అంచనా వేసింది. తమిళనాడు యువతలో ప్రతి పది మందిలో ఏడుగురు విజయ్ పార్టీకి ఓటేశారని.. మహిళలు సైతం పెద్ద సంఖ్యలో ఆ పార్టీకి అండగా నిలిచారని మై యాక్సిస్ ఇండియా తెలిపింది. పట్టణ ప్రాంత ఓటర్లు టీవీకే వెంట నిలిచారని తెలిపింది.సినిమాల్లో సూపర్ స్టార్‌గా ఉన్న విజయ్.. రాజకీయాల్లోనూ సూపర్ స్టార్ అవుతారని.. టీవీకే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరిస్తుందని యాక్సిస్ మై ఇండియా సర్వే అంచనా వేసింది. టీవీకే పార్టీకి 35 శాతం ఓటు షేరింగ్ వస్తుందని ఈ సర్వే జోస్యం చెప్పింది. విజయ్ కింగ్ మేకర్ కాదు కింగ్ అవుతారని బల్ల గుద్ది మరీ చెప్పింది. దీనికి తగ్గట్టుగానే ఇప్పుడు ఫలితాలు వెలువడుతున్నాయి. దీంతో తమిళనాడు వ్యాప్తంగా టీవీకే శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి.Read Also: యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్స్ డీఎంకే కూటమి 92 నుంచి 100 సీట్లు సాధించే అవకాశం ఉందని, అన్నాడీఎంకే మూడో స్థానంలో నిలుస్తుందని అంచనా వేసింది. ట్రెండ్ చూస్తుంటే.. అన్నాడీఎంకే రెండో స్థానంలో నిలుస్తుండగా.. డీఎంకే మూడో స్థానానికి పడిపోతున్న సూచనలు కనిపిస్తున్నాయి. టీవీకే ఒంటరిగా పోటీ చేసి ఈ స్థాయిలో సీట్లు సాధించడం నిజంగా గొప్ప విషయం.‘‘తమిళనాడు ఓటర్లలో 18 నుంచి 39 ఏళ్ల మధ్య వయసు ఉన్న వారు 42 శాతం ఉన్నారు. మహిళలు 50 శాతం ఉన్నారు. ఈ రెండు వర్గాలను విజయ్ పార్టీ అందరికన్నా బాగా ఆకట్టుకుంది. కానీ 40 ఏళ్లు దాటిన ఏజ్ గ్రూప్‌లో డీఎంకేకు ఆధిక్యం ఉంటుంది. 18-39 ఏళ్ల మధ్య వయస్కుల్లో 67 శాతం మంది టీవీకే వైపు మొగ్గు చూపారు. ఎస్సీ, ఎస్టీలు కూడా విజయ్ పార్టీకి ఎక్కువగా ఓటేశారు. ఓబీసీల్లోనూ అత్యధికంగా 36 శాతం మంది టీవీకే పార్టీ వైపు చూశారు’’ అని యాక్సిస్ మై ఇండియా సర్వే ఛైర్మన్ ప్రదీప్ గుప్తా తెలిపారు.‘విజిల్ సింబల్ ప్రజల మైండ్‌లో రిజిస్టర్ కావడానికి టైం పట్టింది. ముఖ్యంగా 40 ఏళ్లు పైబడిన వారిలో. కానీ టెక్నాలజీ యుగంలో ఇది విజయ్‌కు పెద్దగా ప్రాబ్లం కాలేదని ఆయన తెలిపారు. విజయ్ పార్టీకి 30 శాతం కంటే తక్కువ ఓట్లు ఎట్టి పరిస్థితుల్లోనూ రావని ఆయన చెప్పారు. 50 ఏళ్లుగా తమిళనాడులో రెండు పార్టీలదే హవా. ఈ పరిస్థితి మారే టైం వచ్చింది.విజయ్ వచ్చినా ద్రవిడ రాజకీయాలే తమిళనాడులో కొనసాగుతాయ’ని ఆయన చెప్పారు. తమిళనాడులో ముఖ్యంగా చెన్నైలోని దిగ్గజ నేతలు గట్టి పోటీని ఎదుర్కొబోతున్నారని ఆయన అంచనా వేశారు.