కేరళంలో గెలుపుదిశగా యూడీఎఫ్.. సీఎం రేసులో వీడీ సతీశన్, కేసీ వేణుగోపాల్, రమేష్, శశిథరూర్..!

Wait 5 sec.

ఎగ్జిట్ పోల్స్ అంచనాలను నిజం చేస్తూ.. కేరళలో పినరయి విజయన్ నేతృత్వంలోని ఎల్‌డీఎఫ్ కూటమి 10 ఏళ్ల అధికారానికి తెరపడే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ కూటమి.. ఇప్పటికే మెజార్టీ స్థానాలకు మించి ఆధిక్యంలో కొనసాగుతుండగా.. ఆ కూటమిదే అధికారం అని దాదాపు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు యూడీఎఫ్ కూటమి కేరళలో విజయం సాధిస్తే.. ముఖ్యమంత్రి ఎవరు అవుతారు అనేది సర్వత్రా తీవ్ర ఉత్కంఠగా మారింది. , రమేష్ చెన్నితల, , శశిథరూర్ వంటి నేతల పేర్లు ఇప్పుడు సీఎం రేసులో ముందంజలో ఉన్నాయి. దీంతో ఎవరికి సీఎం పోస్టు దక్కుతుంది అనేది ఆసక్తిని రేకెత్తిస్తోంది. 140 స్థానాలు ఉన్న కేరళం అసెంబ్లీలో కాంగ్రెస్ ఆధ్వర్యంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (యూడీఎఫ్) స్పష్టమైన ఆధిక్యం దిశగా దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలోనే ఇప్పటివరకు కేరళ ప్రతిపక్ష నేతగా ఉన్న కాంగ్రెస్ సీనియర్ నేత వీడీ సతీశన్, మరో సీనియర్ నేత రమేష్ చెన్నితల.. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ పేర్లు ముఖ్యమంత్రి రేసులో ప్రధానంగా వినిపిస్తున్నాయి. ఇక కేరళంలో యూడీఎఫ్‌ కూటమిలో కీలక భాగస్వామిగా ఉన్న ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (ఐయూఎంఎల్) అధినేత పాణక్కాడ్ సాదిక్ అలీ షిహాబ్ తంగల్.. వీడీ సతీశన్ ముఖ్యమంత్రిగా ఉండాలని ఆయన వైపే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న కేసీ వేణుగోపాల్.. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితంగా ఉండటంతో ఆయనకే ముఖ్యమంత్రి పదవి దక్కబోతోందనే చర్చ ఇప్పుడు హస్తం పార్టీలో జోరుగా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే కేసీ వేణుగోపాల్ పేరుతో కేరళలో ఇప్పటికే పోస్టర్లు వెలువడం తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది.మరోవైపు.. కేరళ సీఎం రేసులో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత శశిథరూర్ పేరు కూడా వినిపిస్తోంది. అయితే.. గత కొన్ని రోజులుగా కాంగ్రెస్ పార్టీ తీసుకునే నిర్ణయాలు, అనుసరిస్తున్న విధానాల పట్ల శశిథరూర్ వ్యవహరించిన తీరుపై కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ అసంతృప్తిగా ఉందనే చర్చ జరుగుతోంది. అదే సమయంలో సొంత పార్టీపై విమర్శలు గుప్పిస్తూ.. బీజేపీ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విధానాలను శశిథరూర్ ప్రశంసించడం కూడా హస్తం పార్టీకి మింగుడు పడటం లేదు. దీంతో శశిథరూర్‍ పేరు సీఎం రేసులో వినిపిస్తున్నా.. ఆయనకు అధిష్ఠానం నుంచి అండదండలు ఉంటాయా అనేది అనుమానంగానే కనిపిస్తోంది. మరోవైపు.. ఇక యూడీఎఫ్ కూటమిలో ఉన్న ముస్లిం లీగ్ నేతలు కూడా తమకు సీఎం పదవి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే కేరళంలో అధికార మార్పు ఖాయంగా కనిపిస్తుండగా.. యూడీఎఫ్ కూటమి అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి ఎవరు అవుతారు అనేది.. తేలాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందేనని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.