తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ సరిహద్దు రాష్ట్రాలు.. ఇక్కడి రాజకీయాలకు, తమిళ రాజకీయాలకు అసలు సంబంధం లేదు.. కానీ తమిళనాడు ఎన్నికల్లో విజయ్‌కు చెందిన టీవీకే పార్టీ విజయంతో ఏపీలో వైసీపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. టపాసులు పేలుస్తూ, కేక్‌లు కట్ చేస్తూ సంబరాలు జరుపుకుంటున్నాయి. సోషల్ మీడియా వేదికగానూ టీవీకే విజయాన్ని వైసీపీ శ్రేణులు పెద్దఎత్తున సెలబ్రేట్ చేస్తున్నాయి. నగరిలో విజయ్ అభిమానులు టీవీకే విజయాన్ని ఘనంగా జరుపుకున్నారు. క్లాక్ టవర్ వద్ద టపాసులు పేల్చి కేరింతలు కొట్టారు. సత్యవేడు నియోజకవర్గం నాగలాపురంలోనూ టీవీకే చీఫ్ విజయ్ అభిమానులు సంబరాలు జరుపుకున్నారు.Read also: మరోవైపు చంద్రగిరిలో వైసీపీ యువనేత చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి ఆధ్వర్యంలో టీవీకే గెలుపు సంబరాలు జరుపుకున్నారు. వైఎస్ జగన్, విజయ్ ఫోటోలతో భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన వైసీపీ కార్యకర్తలు.. జగన్, విజయ్ ఫోటోలు, వైసీపీ, టీవీకే జెండాలతో కూడిన కేక్‌ కట్ చేసి, టపాసులు కాల్చి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన హర్షిత్ రెడ్డి.. వైఎస్ జగన్ తరహాలోనే విజయ్ కూడా ఒంటరిగా పోటీచేసి విజయం సాధించటం ఎంతో సంతోషంగా ఉందన్నారు. మరోవైపు చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి సంబరాల్లోనూ.. వైసీపీ సోషల్ మీడియా ట్వీట్లలోనూ.. ఓ ఫోటో ప్రముఖంగా కనిపిస్తోంది. అదే వైఎస్ జగన్, విజయ్ కలిసి ఉన్న ఫోటో..Read also: వైఎస్ జగన్‌, విజయ్ గతంలో ఓ ప్రైవేట్ కార్యక్రమంలో కలిశారు. ఈ సందర్భంగా తీసుకున్న ఫోటో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది. అయితే తమిళనాడు ఎన్నికల ప్రచారం సమయంలో ఈ ఫోటోను ఓ అభిమాని.. విజయ్ చేతికి అందించడం.. దానిని విజయ్ బహిరంగంగా ప్రదర్శించటం అప్పట్లో వైరల్ అయ్యింది. దీంతో విజయ్‌కు జగన్ అంటే అభిమానమని.. విజయ్ కూడా జగన్ తరహాలోనే ఒంటరిగా పోటీ చేస్తున్నారంటూ వైసీపీ శ్రేణులు అతన్ని అభినందిస్తూ పలు ట్వీట్లు కూడా పెట్టాయి. ఈ విషయంలో టీడీపీ, వైసీపీ సోషల్ మీడియా శ్రేణుల మధ్య ట్వీట్ల వార్ కూడా జరిగింది.Read also: తాజాగా వెలువడిన తమిళనాడు ఎన్నికల ఫలితాల్లో సింగిల్‌గా పోటీ చేసిన విజయ్ పార్టీ టీవీకే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది. దీంతో ఏపీలో వైసీపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి.