తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీ ఆకర్షించింది. ఫైనల్ రిజల్ట్స్‌లో మాత్రం టీవీకే పార్టీ అభ్యర్థులు జయకేతనం ఎగురవేశారు. దీంతో యాక్సిస్ మై ఇండియా సంస్థ అంచనాలు నిజమై.. తమిళనాడులో అతిపెద్ద పార్టీగా టీవీకే అవతరించింది. అయితే ఎన్నికలకు ముందు చేసిన ప్రసంగాలకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు తెగ వైరల్ అవుతున్నాయి.తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా చివరిరోజున సీఎం ఎంకే స్టాలిన్‌ను టార్గెట్ చేసుకుని చేసిన వ్యాఖ్యలు బాగా వైరల్ అవుతున్నాయి. కరూర్ తొక్కిసలాట ఘటనలో తనను డీఎంకే పార్టీ, ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ టార్గెట్ చేశారని విజయ్ ఆరోపించారు. ఈ సందర్భంగా స్టాలిన్‌కు వార్నింగ్ ఇచ్చారు. తనను టచ్ చేసినందుకు స్టాలిన్ తప్పకుండా పశ్చాత్తాపానికి గురి అవుతారని విజయ్ హెచ్చరికలు చేశారు. ఇవాళ విడుదలైన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే సంచలన విజయాన్ని నమోదు చేసిన వేళ.. స్టాలిన్‌కు విజయ్ ఇచ్చిన వార్నింగ్ వీడియో వైరల్ అవుతోంది.ఈ నేపథ్యంలో ఈ ఎన్నికల్లో డీఎంకే పార్టీ అధికారానికి దూరమైందని టీవీకే వర్గాలు ఆ వీడియోకు కామెంట్లు చేస్తున్నారు. అదే సమయంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఏకంగా 9 వేల ఓట్లతో స్టాలిన్ ఓటమి పాలయ్యారని.. దీంతో ఆయన మాజీ ముఖ్యమంత్రి, మాజీ ఎమ్మెల్యే అయ్యారంటూ విజయ్ పార్టీ శ్రేణులు ఎద్దేవా చేస్తున్నాయి. టీవీకే పార్టీ నుంచి పోటీ చేసిన మాజీ డీఎంకే నేత, మాజీ ఎమ్మెల్యే వీఎస్ బాబు.. ఎంకే స్టాలిన్‌ను ఓడించారు. మరోవైపు.. తన రాజకీయం అరంగేట్రంలోనే తమిళనాడులో విజయ్ సంచలనం సృష్టించారు. తొలిసారి ఎన్నికల్లో పోటీ చేసిన విజయ్.. తాను పోటీ చేసిన రెండు స్థానాల్లోనూ ఎమ్మెల్యేగా ఘన విజయం సాధించారు. అటు పెరంబూర్ నియోజకవర్గంతోపాటు.. తిరుచ్చి ఈస్ట్ సీటులోనూ విజయ్ భారీ గెలుపును సొంతం చేసుకున్నారు.