స్టాలిన్ ఓటమిపై ప్రకాశ్ రాజ్ ట్వీట్.. ఇంత చీప్ ఏంటంటూ తమిళ తంబీల ఆగ్రహం..!

Wait 5 sec.

తమిళనాడులో విజయ్ పార్టీ విజయం సాధించడంతో దక్షిణాదికి చెందిన సినీ నటులు దళపతికి అభినందనలు తెలుపుతున్నారు. తమిళంతోపాటు తెలుగు నటులు, రాజకీయ ప్రముఖులు సైతం పెద్ద సంఖ్యలో విజయ్‌కు కంగ్రాట్స్ మెసేజ్‌లు పంపారు. అయితే విలక్షణ నటుడు మాత్రం ప్రధానంగా టీవీకే విజయం పట్ల కాకుండా.. బాధను వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ‘‘నమస్కారం తమిళనాడు.. కామరాజ్ ఓడిపోయారు. ఎంకే కూడా ఓడిపోయారు. సమాజం అభిమానమయం (ఫ్యాన్స్) అయిపోయిందని.. రాజకీయమయం కాలేదని మరోసారి రుజువైంది. రాజకీయ చైతన్యం తెచ్చే వారిది ఎప్పుడూ ప్రతిపక్ష పాత్రే. మన ప్రయాణం కొనసాగిద్దాం. గెలిచిన వారికి, వారు చేయబోయే ప్రజాసేవకు శుభాకాంక్షలు’’ అని అర్థం వచ్చేలా తమిళంలో ప్రకాశ్ రాజ్ పోస్టు చేశారు. ఎప్పటిలాగే తనదైన స్టయిల్లో దానికి జస్ట్ ఆస్కింగ్ అనే హ్యాష్ ట్యాగ్ తగిలించారు.Read Also: తమిళనాడు రాజకీయాల్లో కీలక నేత అయిన కామరాజ్‌కు అజేయుడిగా పేరుంది. మధ్యాహ్న భోజనం పథకాన్ని తొలుత ప్రవేశపెట్టింది ఈయనే. నెహ్రూ మరణం తర్వాత లాల్ బహుదూర్ శాస్త్రి, ఇందిరా గాంధీలను ప్రధానులను చేయడంలో ఈయనదే కీలక పాత్ర. అందుకే ఆయన్ను కింగ్ మేకర్ అని, దక్షిణ గాంధీ అని కూడా పిలుస్తారు. 9 ఏళ్లు సీఎంగా పని చేసినప్పటికీ ఆయనకు సొంత ఇల్లు కూడా లేకపోయింది. 1976లో భారత ప్రభుత్వం ఆయన మరణానంతరం భారతరత్న పురస్కారంతో గౌరవించింది.అలాంటి గొప్ప నేత అయిన కామరాజ్.. 1967లో మద్రాస్ రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విరుదునగర్ నుంచి పోటీ చేసి.. 29 ఏళ్ల వయసున్న పి.శ్రీనివాసన్ అనే డీఎంకే అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. సొంత ఊళ్లో ఓడిపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటానని ప్రకటించిన కామరాజ్ అనూహ్యంగా ఓటమిపాలయ్యారు. మళ్లీ 1969లో నాగర్‌కోయిల్ నుంచి ఆయన ఎంపీగా ఎన్నికయ్యారు. దీంతో ఎంతటి నాయకులైనా ఎన్నికల్లో ఓడిపోక తప్పదు అని చెప్పడం కోసం కామరాజ్ ఓటమిని ప్రస్తావిస్తుంటారు. డీఎంకే అధినేత స్టాలిన్ ఓటమిని ప్రకాశ్ రాజ్.. కామరాజ్ ఓటమితో పోల్చడాన్ని తమిళ తంబీలు సహించలేకపోతున్నారు. కామరాజ్ లాంటి గొప్ప నేతతో స్టాలిన్‌ను పోలుస్తావా అని కొందరు మండిపడుతున్నారు. ఇక విజయ్ ఫ్యాన్స్ అయితే.. విజయ్ పట్ల ద్వేషం ఎందుకు అని ప్రశ్నిస్తున్నారు.తమిళనాడులోని డీఎంకే ప్రభుత్వ పెద్దలతో ప్రకాశ్ రాజ్ సత్సంబంధాలు నెరిపేవారు. బీజేపీ, రైట్ వింగ్ భావజాలాన్ని వ్యతిరేకించే ప్రకాశ్ రాజ్.. అదే బాటలో నడిచే డీఎంకేకి సహజ మిత్రుడు అయ్యారు. ఇటీవలి ఎన్నికల్లో ఆయన డీఎంకేకు మద్దతుగా నిలిచారు. డీఎంకే ప్రభుత్వం కూడా ఆయన్ను గౌరవించేది. ఈ సత్సంబంధాల నేపథ్యంలో స్టాలిన్ ఓటమిని ప్రకాశ్ రాజ్ ‘కామరాజ్’ ఓటమితో పోల్చారు.