లక్నో సూపర్ జెయింట్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ భారీ ట్విస్ట్ ఇచ్చింది. ముంబై వరుస పతనాలతో మేనేజ్‌మెంట్ కీలక నిర్ణయం తీసుకుంది. కెప్టెన్ హార్దిక్ పాండ్యాను లక్నోతో మ్యాచ్‌కు పక్కనపెట్టేసింది. టాస్ కోసం చూస్తున్న అందరికీ ఒక్కసారిగా షాక్ ఇచ్చింది. హార్దిక్ ప్లేస్ సూర్య టాస్‌కి రావడం.. రోహిత్ శర్మను ఈ మ్యాచ్‌లో ఆడించనుండటంతో ఫ్యాన్స్‌లో ఒక్కసారిగా జోష్ వచ్చేసింది. ఐపీఎల్ 2026లో భాగంగా వాంఖడే స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్ - లక్నో సూపర్ జెయింట్స్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ బౌలింగ్ ఎంచుకున్నాడు. దాంతో లక్నో సూపర్ జెయింట్స్ జట్టు తొలుత బ్యాటింగ్‌కి రానుంది. పాయింట్ల పట్టికలో ముంబై తొమ్మిదో స్థానంలో ఉండగా, లక్నో పదో స్థానంలో ఉంది. దాంతో ఇరు జట్లు ఈ మ్యాచ్‌లో గెలిచి పరువు నిలబెట్టుకోవాలని చూస్తున్నాయి. హార్దిక్ ఆఖరి నిమిషంలో ఎందుకు తప్పుకున్నాడని కామెంటేటర్ అడగ్గా.. కొంచెం ఇబ్బందిగా ఉండటంతో మ్యాచ్‌కి దూరమైనట్లు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ చెప్పాడు. ఇక జట్టులో మార్పులు గురించి చెబుతూ ట్రెంట్ బౌల్ట్ స్థానంలో కార్బిన్ బోష్‌ను దింపుతున్నారని, అదేవిధంగా హార్దిక్ స్థానంలో హిట్ మ్యాన్ రోహిత్ శర్మను ప్లేయింగ్ 11లో ఆడిస్తున్నట్లు తెలిపాడు. రోహిత్ పేరు చెప్పగానే వాంఖడేలో ఫ్యాన్స్‌ ఫుల్ జోష్‌తో గోల గోల చేశారు. ముంబై ఇండియన్స్‌తో పాటు లక్నో సూపర్ జెయింట్స్‌లో కూడా మార్పులు చోటుచేసుకున్నాయి. జోష్ ఇంగ్లిస్ ఈ సీజన్‌లో తొలి మ్యాచ్ ఆడుతుండగా.. ముకుల్ చౌదరి స్థానంలో అక్షత్ రఘువంశీ ఆడనున్నట్లు పంత్ తెలిపాడు. లక్నో ఓనర్ సంజీవ్ గోయెంకా, ఫ్యాన్స్ కోసం ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలవాలని పంత్ చెప్పాడు. ముంబై ఇండియన్స్ జట్టుర్యాన్ రికెల్టన్, నమన్ ధీర్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, విల్ జాక్స్, రాజ్ బవా, కార్బిన్ బోష్, దీపక్ చాహర్, జస్ప్రీత్ బుమ్రా, ఏఎం ఘజన్‌ఫర్, రఘు శర్మ, (ఇంపాక్ట్ ప్లేయర్).లక్నో సూపర్ జెయింట్స్ జట్టుమిచెల్ మార్ష్, ఎయిడెన్ మార్కరమ్, రిషభ్ పంత్ (కెప్టెన్), జోష్ ఇంగ్లిస్, నికోలస్ పూరన్, అక్షత్ రఘువంశీ, హిమ్మత్ సింగ్, మొహమ్మద్ షమీ, మొహ్సిన్ ఖాన్, అవేశ్ ఖాన్, ప్రిన్స్ యాదవ్.