పోటీచేసిన తొలి ఎన్నికల్లోనే విజయం.. టీవీకే విజయ్‌పై పవన్ కళ్యాణ్ ప్రశంసలు

Wait 5 sec.

నేపథ్యంలో టీవీకే చీఫ్ విజయ్‌పై అభినందనల వెల్లువ కురుస్తోంది. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు అభినందనలు తెలియజేస్తున్నారు. , డిప్యూటీ సీఎం పవన్ కళ్యా్ణ్‌.. విజయ్‌కు అభినందనలు తెలియజేశారు. సాధించిన విజయ్‌కు అభినందనలు తెలియజేస్తున్నానన్న చంద్రబాబు.. తమిళనాడు ప్రజలకు సేవ చేయడంలోనూ, వారి పురోగతికి, శ్రేయస్సుకు తోడ్పడటంలోనూ ఆయన చేసే కృషిలో సంపూర్ణ విజయం చేకూరాలని ఆకాంక్షిస్తున్నట్లు ట్వీట్ చేశారు. మరోవైపు టీవీకే పార్టీ స్థాపించిన అనతి కాలంలోనే విజయం సాధించిన నేపథ్యంలో విజయ్‌పై ప్రశంసలు కురిపించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. "ఎన్నికల్లో విజయం సాధించిన టీవీకేకు, ఆ పార్టీ అధినేత విజయ్‌కు ప్రత్యేక అభినందనలు. విజయ్ పార్టీ ఈ ఎన్నికల్లో అద్భుత విజయాన్ని సాధించింది. ఎన్నికల్లో పోటీ చేసిన తొలిసారే ప్రజలకు నమ్మకమైన ప్రత్యామ్నాయంగా నిలిచింది. ఇది మార్పు కావాలన్న తమిళ ప్రజల ఆకాంక్షలకు అద్దం పడుతోంది. తమిళనాడు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా.. విజయ్ నిబద్ధత, బాధ్యతతో పనిచేస్తారని ఆశిస్తున్నా" అంటూ పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు. మరోవైపు మిగతా రాష్ట్రాల ఫలితాలపైనా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. ఈ ఎన్నికల ఫలితాల్లో ఓటర్ల చైతన్యం స్పష్టంగా కనిపించిందన్నారు. పాలన నచ్చితే గెలిపిస్తారని.. నచ్చకపోతే నిర్దాక్షిణ్యంగా ఓడిస్తారనేందుకు ఈ ఫలితాలే ఓ ఉదాహరణ అంటూ పవన్ కళ్యాణ్ అభివర్ణించారు. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ ప్రజలు మార్పును కోరుకున్నారన్న పవన్ కళ్యాణ్.. అస్సాం, పుదుచ్చేరిలో బీజేపీ తమ ప్రాభవాన్ని నిలబెట్టుకుందన్నారు. బెంగాల్ ప్రజల మనసును గెలుచుకున్నారని కొనియాడారు. బెంగాల్‌లో విజయం కోసం ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా ఏళ్లపాటు చేసిన కృషి ఇప్పుడు ఫలితాన్ని ఇచ్చిందంటూ పవన్ కళ్యాణ్ వారికి అభినందనలు తెలియజేశారు. మరోవైపు తమిళనాడు ఎన్నికల్లో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన టీవికే.. మ్యాజిక్ ఫిగర్‌కు కాస్త దూరంలో ఆగిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి.