ఈ బ్యాంకులో పొదుపు ఖాతాతోనే 7.60 శాతం వడ్డీ.. ఎంత జమ చేస్తే ఎంతొస్తుంది? లిస్ట్ ఇదే..

Wait 5 sec.

Savings account: ఏదైనా అర్థిక లావాదేవీ నిర్వహించేందుకు బ్యాంకులో అకౌంట్ ఉండాలి. దాదాపు అందరికీ బ్యాంకులో సేవింగ్స్ అకౌంట్ ఉంటుంది. అందులో డబ్బులు జమ చేయడం, అవసరమైనప్పుడు విత్ డ్రా చేయడం చేస్తుంటాయి. ఈ ఖాతాపైన వడ్డీ ఇస్తారని చాలా మందికి తెలియదు. ఎందుకంటే బ్యాంకులు చాలా తక్కువ వడ్డీ రేటు ఇస్తాయి. దీంతో మంచి వడ్డీ రేటు కోరుకునే వారు ఫిక్స్‌డ్ డిపాజిట్లు చేస్తుంటారు. అయితే, ఎఫ్‌డీ వడ్డీ రేటును మించి సేవింగ్స్ ఖాతా ద్వారానే వడ్డీ వస్తే ఎలా ఉంటుంది? అని మీరూ ఆలోచించే ఉంటారు. అధిక వడ్డీ పొందడంతో పాటు కావాల్సినప్పుడు డబ్బులు వెనక్కి తీసుకోవచ్చు. చెప్పింది. ఈ బ్యాంక్ ప్రస్తుతం సేవింగ్స్ అకౌంట్ ద్వారానే ఏకంగా 7.60 శాతం వరకు వార్షిక వడ్డీ రేటు ఆఫర్ చేస్తోంది. సవరించిన కొత్త వడ్డీ రేట్లను మే 1, 2026 నుంచే అమలు చేస్తోంది.సవరించిన వడ్డీ రేట్లు సూర్యోదయ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుకు చెందిన డొమెస్టిక్ సేవింగ్స్ అకౌంట్లతో పాటు ఎన్ఆర్ఈ, ఎల్ఆర్ఓ సేవింగ్స్ ఖాతాలకూ వర్తిస్తాయని బ్యాంక్ తెలిపింది.సేవింగ్స్ అకౌంట్లో రూ.5 కోట్ల నుంచి రూ.25 కోట్ల వరకు బ్యాలెన్స్ ఉంటే రూ.7.60 శాతం వడ్డీ లభిస్తుంది. ఖాతాలో రూ.25 లక్షల నుంచి రూ.5 కోట్ల వరకు బ్యాలెన్స్ ఉంటే 7.50 శాతం వడ్డీ ఇస్తారు.రూ.10 లక్షల నుంచి రూ.25 లక్షల వరకు బ్యాలెన్స్ ఉంటే 6.50 శాతం వడ్డీ లభిస్తుంది. రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు బ్యాలెన్స్ ఉంటే 5.50 శాతం వడ్డీ ఇస్తారు. రూ.1 లక్ష నుంచి రూ.5 లక్షల వరకు బ్యాలెన్స్ ఉంటే 2.50 శాతం వడ్డీ లభిస్తుంది. రూ.1 నుంచి రూ.1 లక్ష వరకు బ్యాలెన్స్ ఉన్నట్లయితే 2.50 శాతం వడ్డీ లభిస్తుంది.బ్యాంక్ ఖాతాలోని బ్యాలెన్స్ ఉన్నదాని ప్రకారం వడ్డీ రేటు వర్తిస్తుంది. ఇలా లెక్కించిన వడ్డీని నెలవారీగా జమ చేస్తుంటారు. క్యాలెండర్ మంత్‌లో మొదటి రోజున వడ్డీ డబ్బులు ఇస్తుంటారు. సాధారణంగా ఈ స్థాయిలో వడ్డీ రేట్లు ఫిక్స్‌డ్ డిపాజిట్లకు ఇస్తారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ వంటి దిగ్గజ బ్యాంకులు సైతం ఈ స్థాయిలో పొదుపు ఖాతా వడ్డీ రేట్లను ఆఫర్ చేయడం లేదు.