ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే 3 రాష్ట్రాల్లో అధికార పార్టీలకు బిగ్ షాక్ తగిలింది. దీంతో ముఖ్యమంత్రులు తమ కుర్చీలను వదులుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. పశ్చిమ బెంగాల్‌లో ఇప్పటికే హ్యాట్రిక్ విజయాలు సాధించి నాలుగోసారి సత్తా చాటాలని ఎదురుచూసిన మమతా బెనర్జీకి ఎదురుదెబ్బ తగిలింది. ఇక కేరళంలోనూ రెండు సార్లు వరుసగా విజయం సాధించిన పినరయి విజయన్.. ముచ్చటగా మూడోసారి ముఖ్యమంత్రి కావాలన్న ఆశలు అడియాసలు అయ్యాయి. మరోవైపు.. తమిళనాడులో వరుసగా రెండోసారి గెలుస్తామని ధీమాగా ఉన్న ఎంకే స్టాలిన్‌కు షాకిస్తూ.. తమిళ ఓటర్లు.. కొత్తగా పార్టీ పెట్టిన విజయ్‌కి పట్టం కట్టారు. దీంతో ఏళ్ల తరబడి ఆయా పార్టీలు, నేతలకు కంచుకోటలుగా ఉన్న రాష్ట్రాలు ఇప్పుడు వారి చేతులు జారాయి.పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు293 స్థానాలు ఉన్న పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు 2 విడతలుగా జరగ్గా.. తాజాగా వెలుడవడిన ఫలితాల్లో బీజేపీ ప్రభంజనం సృష్టిస్తోంది. దాదాపు 200 సీట్లలో కమలం పార్టీ నేతలు ఆధిక్యంలో ఉన్నారు. దీంతో చరిత్రలో తొలిసారి బెంగాల్ గడ్డపై కాషాయ జెండా రెపరెపలాడనుంది. ఒకప్పుడు పశ్చిమ బెంగాల్ అంటే కమ్యూనిస్టుల అడ్డాగా ఉండేది. కమ్యూనిస్ట్‌ల కంచుకోటలను బద్దలు కొట్టి మమతా బెనర్జీ అధికారంలోకి వచ్చారు. ఏకంగా 3 సార్లు టీఎంసీని అధికారంలోకి తీసుకువచ్చిన దీదీకి నాలుగోసారి మాత్రం బెంగాల్ ఓటర్లు అవకాశం ఇవ్వలేదు. అయితే పశ్చిమ బెంగాల్‌ చరిత్రలో మొట్టమొదటిసారి 92 శాతం పైగానే పోలింగ్ నమోదు కావడం గమనార్హం. అయితే ప్రభుత్వ వ్యతిరేక ఓటు.. బీజేపీకి పడిందనే ఊహాగానాలు వెల్లడయ్యాయి. కేరళం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలుదేశంలో కమ్యూనిస్టుల కంచుకోటగా ఉన్న ఏకైక రాష్ట్రమైన కేరళంలోనూ వారికి బిగ్ షాక్ తగిలింది. మొదట బెంగాల్, తర్వాత త్రిపుర, ఇప్పుడు కేరళంలో కమ్యూనిస్టుల కోటలు బద్దలయ్యాయి. వరుసగా రెండుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన పినరయి విజయన్.. హ్యాట్రిక్‌పై కన్నేసినా.. మలయాళీలు మాత్రం దూరం పెట్టారు. శబరిమల గోల్డ్ మాయం వ్యవహారం, గోల్డ్ స్మగ్లింగ్ కేసు.. పినరయి విజయన్ ఓటమికి ప్రధాన కారణాలుగా రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఈ రెండు కేసుల్లో పినరయి విజయన్ సర్కార్‌పై కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడంతో బీజేపీ, కమ్యూనిస్టులు ఒక్కటి అయ్యారని కాంగ్రెస్ పార్టీ చేసిన ప్రచారం ప్రజల్లోకి బలంగా వెళ్లింది. ఒకవైపు యూడీఎఫ్ కూటమి.. బీజేపీ కూటమి పోటీలో ఉండటంతో.. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోయి.. తనకు లాభం అవుతుందని భావించిన పినరయి విజయన్ లెక్కలు అంచనాలు తప్పాయి. మొత్తం 140 సీట్లు ఉన్న కేరళం అసెంబ్లీలో మ్యాజిగ్ ఫిగర్ 71 సీట్లు కాగా.. యూడీఎఫ్‌ అభ్యర్థులు దాదాపు 100 సీట్లలో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలుదేశంలో ద్రవిడ రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ అయిన తమిళనాడులో.. బద్దలు కొట్టి ఎంట్రీ ఇచ్చింది. ఇక కొలత్తూరు నియోజకవర్గంలో 3 సార్లు గెలుపొందిన ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్.. ఓటమి పాలు కావడం డీఎంకేకు మరింత ఇబ్బందికరంగా మారింది. తమిళనాడు ఓటర్లు ఈసారి విలక్షణ తీర్పు ఇచ్చి.. విజయ్‌కి పట్టం కట్టారు. ఎన్నికలు జరిగిన తర్వాత వెలువడిన ఎగ్జిట్ పోల్స్‌లో మెజార్టీ సర్వేలు.. డీఎంకే మళ్లీ అధికారంలోకి వస్తుందని పేర్కొన్నాయి. యాక్సిస్ మై ఇండియా మాత్రమే విజయ్.. తమిళనాడులో గెలుస్తారని అంచనా వేసింది. అయితే తుది ఫలితాల్లో అదే నిజమై.. టీవీకే ప్రభంజనం సృష్టించి.. మెజార్టీ మార్కు చేరువలో ఉంది. .. విజయ్ టీవీకే పార్టీకి దరిదాపుల్లోకి వచ్చింది. అయితే చిన్న పార్టీల మద్దతుతో తమిళనాడులో విజయ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తానికి ఇటీవల జరిగిన 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ముగ్గురు ముఖ్యమంత్రుల పీఠాలు కదిలిపోయాయి. ఇక అస్సాంలో తిరిగి బీజేపీ అధికారంలోకి రాగా.. పుదుచ్చేరిలో ఎన్డీఏ కూటమి తన అధికారాన్ని నిలబెట్టుకుంది.