తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ టీవీకే పార్టీ దుమ్మురేపింది.. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది. 100కుపైగా స్థానాల్లో టీవీకే అభ్యర్థులు దూసుకెళుతున్నారు. మూవీస్ టు పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన దళపతి విజయ్ రాజకీయాల్లో కూడా సూపర్ హిట్ అయ్యారు. విజయ్‌కు దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. పై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి స్పందించారు విజయ్‌కు శుభాకాంక్షలు తెలిపారు. అలాగే ఏపీ మంత్రి లోకేష్ కూడా విజయ్‌ పార్టీ గెలుపుపై ట్వీట్ చేశారు.'నా ప్రియమైన సోదరుడు విజయ్‌కు హృదయపూర్వక అభినందనలు. తొలిసారి ఎన్నికల బరిలోకి దిగి అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించడం అద్భుతం. ప్రజా సేవ చేసేందుకు సరికొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తున్న సందర్భంగా.. మీకు అవసరమైన బలం, విజయం చేకూరాలని ఆకాంక్షిస్తున్నాను.. దేవుడు మీకు తోడుగా ఉంటారు' అంటూ ట్వీట్ చేశారు. అలాగే పశ్చిమ బెంగాల్‌‌లో విజయం సాధించిన బీజేపీకి శుభాకాంక్షలు.. అదే సందర్భంలో దీదీకి నా సానుభూతిని ప్రకటిస్తున్నానన్నారు జగన్.. బరిలో దిగి విజయం సాధించిన విజయ్‌కు అభినందనలు తెలిపారు మంత్రి నారా లోకేష్. తమినళాడులో ఎన్నికల ఫలితాలు అక్కడి ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబిస్తున్నాయన్నారు. తమిళనాడు రాజకీయ ముఖచిత్రంలో ఓ కొత్త కోణంగా అభివర్ణించారు. విజయ్ ప్రజా జీవితంలోకి అడుగు పెట్టబోతున్నందుకు శుభాకాంక్షలు. 'బాధ్యత, నిబద్ధతతో ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే దిశగా అడుగులు వేయనున్న విజయ్‌కు శుభాభినందనలు' అంటూ మంత్రి లోకేష్ ట్వీట్ చేశారు.అస్సాం, పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాల సందర్భంగా ఎన్డీఏకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు మంత్రి లోకేష్. ఈ ప్రజా తీర్పు, అభివృద్ధి, స్థిరత్వం, నిర్ణయాత్మక నాయకత్వంపై ప్రజలలో పెరుగుతున్న ప్రగాఢ విశ్వాసాన్ని ప్రతిబింబిస్తుందన్నారు. నరేంద్ర మోడీ దార్శనిక నాయకత్వంలో, ప్రజలు ఇచ్చిన తీర్పు ఎన్డీఏ యొక్క విశ్వాసాన్ని మరింత బలపరుస్తుంది అన్నారు. రాజకీయ ప్రముఖులు మాత్రమే కాదు టాలీవుడ్ ప్రముఖులు కూడా విజయ్‌కు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. తమిళనాడు ఎన్నికల్లో అద్భుత విజయం సాధించారంటూ ప్రశంసిస్తున్నారు.