వాంఖడేలో ముంబై సునామీ బ్యాటింగ్.. రోహిత్, రికెల్టన్ విధ్వంసంతో 229 టార్గెట్‌ను ఊదేశారు!

Wait 5 sec.

ముంబై ఇండియన్స్ అంటే ఏంటో ఇన్నాళ్లు చూయించారు. ఐపీఎల్ 2026 సీజన్ ముగింపు దశకు వస్తున్న సమయంలో ముంబై ప్లేయర్లు ఫామ్‌లోకి వచ్చారు. బౌలింగ్‌లో ఆరంభంలో తడబడిన ముంబై.. ఆఖర్లో అద్భుతంగా బంతులు వేసి లక్నోని 250 టచ్ చేయకుండా చేసింది. ఇక బ్యాటింగ్‌లో గాయపడ్డ సింహంలా కమ్ బ్యాక్ ఇన్నింగ్స్‌తో లక్నో బౌలర్లకు చుక్కలు చూపెట్టాడు. విరుచుకుపడటంతో ఓపెనర్లు ఇద్దరే ముంబై‌ను విజయతీరాలకు చేర్చారు. వాంఖడే వేదికగా జరిగిన హై ఓల్టేజ్ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ - ముంబై ఇండియన్స్ పోటాపోటీగా బ్యాటింగ్ చేసింది. లక్నో అందించిన 229 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్‌ను ఓపెనర్లు రోహిత్ శర్మ, ర్యాన్ రికెల్టన్ అద్భుతంగా నడిపించారు. ఈ ఇద్దరే 10.5 ఓవర్లలో 145 పరుగులు నమోదు చేసి ముంబై విజయాన్ని ఖరారు చేశారు. ముంబై ఓపెనర్లు రోహిత్ శర్మ, ర్యాన్ రికెల్టన్ ఆరంభం నుంచే దూకుడు ఆడటం మొదలుపెట్టారు. పవర్ ప్లేలో 71 పరుగులు నమోదు చేసిన ఓపెనర్లు.. ఆ తర్వాత విధ్వంసం సృష్టించారు. ర్యాన్ రికెల్టన్ 32 బంతుల్లో ఆరు ఫోర్లు, ఎనిమిది సిక్సర్లతో ఏకంగా 83 పరుగులు చేశాడు. ఒకానొక దశలో సెంచరీ చేస్తాడని అందరూ అనుకున్నారు. కానీ మొహ్సిన్ ఖాన్ బౌలింగ్‌లో షాట్‌కి ప్రయత్నించి దొరికిపోయాడు. ర్యాన్ రికెల్టన్ 22 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేయగా.. రోహిత్ శర్మ 27 బంతుల్లో ఫిఫ్టీ చేశాడు. చాలా మ్యాచ్‌ల తర్వాత మళ్లీ జట్టులోకి వచ్చిన రోహిత్ శర్మ 44 బంతుల్లో 84 పరుగులు చేసి అవుటయ్యాడు. రోహిత్ ఇన్నింగ్స్‌లో ఆరు ఫోర్లు, ఏడు సిక్సర్లు ఉండగా.. ర్యాన్ రికెల్టన్ ఇన్నింగ్స్‌లో ఆరు ఫోర్లు, మూడు 8 సిక్సర్లు ఉన్నాయి. రోహిత్ అవుటయ్యే సమయానికి ముంబై 14 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసింది. ఓపెనర్లు ఇద్దరూ అవుటైన తర్వాత ఆ ఫామ్‌ను నమన్ ధీర్ కొనసాగించాడు. తిలక్ వర్మ ఫస్ట్ డౌన్‌లో వచ్చినా పెద్దగా రాణించలేకపోయాడు. 13 బంతులు ఆడిన తిలక్ కేవలం 11 పరుగులు మాత్రమే చేసి అవుటయ్యాడు. సెకండ్ డౌన్‌లో బ్యాటింగ్‌కి వచ్చిన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కూడా పెద్దగా రాణించలేకపోయాడు. 7 బంతుల్లో రెండు ఫోర్లతో 12 పరుగులు చేసి అవుటయ్యాడు. వికెట్లు పడుతున్నా నమన్ ధీర్ 12 బంతుల్లో 23 పరుగులు చేసి మ్యాచ్ విజయంలో తన వంతు పాత్ర కూడా పోషించాడు. విల్ జాక్స్ విన్నింగ్ షాట్‌ బాదడంతో ముంబై ఇండియన్స్ 18.4 ఓవర్లలోనే 229 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి విజయం సాధించింది.