Tata Sons IPO: స్టాక్ మార్కెట్లో లిస్టింగ్ ఆపేందుకు టాటా సన్స్ చేస్తున్న ప్రయత్నాలకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) గండి కొట్టినట్లయింది. టాటా గ్రూప్ కంపెనీల నుంచి వచ్చే నిధులను పరోక్షంగా ప్రజల నిధుల కిందే పరిగణించాలని రిజర్వ్ బ్యాంక్ కొత్త రూల్స్ తీసుకొచ్చింది. ఈ నిర్ణయం ప్రభావం చూపించనుంది. జులై 1 నుంచే అమలులోకి ఈ కొత్త నిబంధనలు వస్తున్నాయి. దీంతో టాటా సన్స్ భవిష్యత్ ప్రణాళికలపై ప్రభావం పడే అవకాశం ఉంటుంది.టాటా గ్రూప్ హోల్డింగ్ కంపెనీ తన ఫైనాన్స్ లైసెన్సును సరెండ్ చేస్తే తప్పనిసరి స్టాక్ మార్కెట్ లిస్టింగును తప్పించుకోవచ్చనే వాదననూ ఇటీవలి ఓ నోటిఫికేషన్ ద్వారా రిజర్వ్ బ్యాంక్ తోసిపుచ్చింది. ఇటీవలి రిజర్వ్ బ్యాంక్ మార్గనిర్దేశాల ప్రకారం డెట్ మార్కెట్‌తో సంబంధాలు ఉన్న గ్రూప్ కంపెనీలు, అనుబంధ సంస్థల నుంచి ఈక్విటీని పొందిన క్రమంలో పరోక్షంగా ప్రజా నిధులను పొందినట్లుగానే పరిగణించనున్నారు. న్యాయ నిపుణుల అంచనాల ప్రకారం టాటా సన్స్ కు చెందిన టాటా మోటార్స్, టాటా పవర్, టాటా స్టీల్, ఇండియన్ హోటల్స్, టాటా కెమికల్స్ తమ హోల్డింగ్ సంస్థల నిధులను అందజేసిన సమయంలో డెట్ మార్కెట్ల ద్వారా నిధులను సమీకరించాయి.మరోవైపు రూ.1000 కోట్ల ఆస్తుల్లోపు ఉన్న ఎన్‌బీఎఫ్‌సీలకు మాత్రే డీరిజిస్ట్రేషన్ మార్గాన్ని కొత్త నిబంధనలు సూచిస్తున్నాయి. టాటా సన్స్ స్టాండలోన్ ఆస్తులు రూ.1.75 లక్షల కోట్లుగా ఉన్నాయి. అంటే ఈ లిమిట్ మించి చాలా అధింగా ఉన్నట్లు తెలుస్తోంది. అంత క్రితం రూ.1 లక్ష కోట్లకు పైగా ఉన్న కంపెనీలను అప్పర్ లేయర్ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీగా వర్గీకరిస్తారని రిజర్వ్ బ్యాంక్ ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 2022న మొదటి సారి రిజర్వ్ బ్యాంక్ అప్పర్ లేయర్ లిస్ట్ విడుదల చేసింది. అప్పుడు టాటా సన్స్ ఒక్కటే తప్పనిసరి లిస్టింగ్ చేయకుండా ఉన్న కంపెనీగా మినహాయింపు పొందింది.. టాటా ట్రస్ట్స్ ఛైర్మన్ నోయల్ టాటా లిస్టింగ్ కు వ్యతిరేగింగా ఉన్నారు. అయితే వైస్ ఛైర్మన్ వేణు శ్రీనివాసం, విజయం సింగ్ లిస్టింగ్ చేయాలని కోరుతున్నారు. ఏప్రిల్ 2026లో షాపూర్జీ పల్లోంజీ మిస్త్రీ, వేణు శ్రీనివాసన్ లు కు మద్దతు పలికారు. అది అవసరమైన ప్రక్రియగా పేర్కొన్నారు. తాజా వార్తల నేపథ్యంలోనూ మిస్త్రీ టాటా న్స్ లిస్టింగును అవసరమైన పరిణామంగానే తెలిపారు. ఈ ప్రక్రియ ద్వారా గ్రూప్ లో పాలన, పారదర్శకత, బాధ్యత బలోపేతం అవుతుందని పేర్కొన్నారు.