ఇప్పటి మోడర్న్ సొసైటీ కంటే ఒకప్పటి ట్రైబల్ కల్చర్స్ చాలా గొప్పవని అభిప్రాయపడ్డారు డైరెక్టర్ . గత కొన్ని రోజులుగా '' ద్వారా వివిధ అంశాలపై తన ఆలోచనలను పంచుకుంటున్న ఆయన.. తాజాగా 'ట్రైబల్ కల్చర్స్' అనే టాపిక్ మీద పాడ్ కాస్ట్ చేశారు. ఆధునిక సమాజం కంటే గిరిజన సంస్కృతులు ఎందుకు ఉన్నతమైనవో వివరించారు. ఈరోజుల్లో మనుషుల్లో పెరిగిపోయిన ఆధిపత్య ధోరణి కంటే.. గిరిజనులలో ఉండే సామూహిక ఐక్యత, నైతిక విలువలు, మహిళల పట్ల ఉన్న గౌరవం చాలా గొప్పవని పూరీ పేర్కొన్నారు. ''ఇప్పుడున్న మోడర్న్ సొసైటీస్ కంటే ఒకప్పటి ట్రైబల్ కల్చర్స్ చాలా గొప్పవి. వాళ్లకి మనకున్న తెలివి తేటలు, టెక్నాలజీ లేకపోవచ్చు. అయినప్పటికీ వాళ్లు మనకంటే ఎంతో మంచిగా బతికారు. దానికి కారణం వారి మధ్య సంబంధాలు, జ్ఞాన వ్యవస్థ, వారి జీవన విధానం అని చెప్పాలి. వాళ్లకి నేచర్ తో స్ట్రాంగ్ కనెక్షన్ ఉండేది. వాళ్లు అడవులను, జంతువుల్ని, సీజన్స్ ని డీప్ గా అర్థం చేసుకున్నారు. వాళ్ళకి సస్టైనబుల్ లైఫ్ స్టైల్ ఉండేది. 'మనం', 'మన జాతి', 'మన తండా' అనే భావం ఉండేది. కానీ మోడర్న్ సొసైటీలో 'నేను' అనేది ఎక్కువైపోయింది, అందుకే మనందరం ఐసోలేట్ అయిపోయాం''''గిరిజనులు జ్ఞాన సంపన్నులు. అడవిలో ఆకుల మీద, ఆయుర్వేదం, వ్యవసాయం, సర్వైవల్ స్కిల్స్ మీద వాళ్ళకి పట్టు ఎక్కువ. ఆ నాలెడ్జ్ ఒక జనరేషన్ నుంచి ఇంకో జనరేషన్ కి వస్తూ ఉండేది. పండగలు, పాటలు, డాన్సులు.. వాళ్ల డైలీ లైఫ్ లో ఉండేవి. వాళ్ళు నిజంగా వాళ్ళ కల్చర్ లో బతికారు. మనమేమో మన కల్చర్ గురించి మాట్లాడుకుంటాం లేదా గుర్తు తెచ్చుకుంటాం అంతే. వాళ్లకి కోరికలు చాలా తక్కువ. అందుకే వాళ్ళు మనకంటే ఆనందంగా ఉంటారు. బతకడానికి కావాల్సిన కనీస అవసరాలు ఉంటే చాలు వాళ్ళకి. అదే ఆనందం. మనమేమో అందరికంటే ఎక్కువ సంపాదించాలని అనుకుంటాం. మిగతా వాళ్ళ మీద ఆధిపత్యం చలాయించాలని అనుకుంటాం''* ''కానీ ఒక ట్రైబ్ ఎప్పుడు మిగతా ట్రైబ్స్ ని డామినేట్ చేయాలని చూడరు. ఒకరి మీద ఒకరు కాంపిటీషన్ తో బతకరు. అందరూ కలిసి మెలిసి ఉంటారు. వాళ్ళలో ఏ ఒక్కరికి హాని జరిగినా, అందరూ కలిసి ఎదిరిస్తారు. ఒక మాట మీద నిలబడతారు. మీరు బాగా గమనిస్తే, వాళ్ళు అవసరమైనప్పుడు మాత్రమే మాట్లాడతారు. మనలాగా అనవసరంగా రోజంతా వాగరు. వాళ్ళకి మనకున్న హెల్త్ కేర్ యాక్సెస్ లేకపోవచ్చు. అయినా వాళ్ళు నేచర్ ని నమ్ముకుంటారు.. ఆకులని నమ్ముకుంటారు. మనకన్నా ఆరోగ్యంగా ఉంటారు. మనకున్న ఎడ్యుకేషన్ లేకపోవడమే వాళ్ళకి అడ్వాంటేజ్ అయింది. అందుకే మనలాగా వాళ్ళకి క్రిమినల్ ఆలోచనలు రావు. ఒకరిని ఒకరు మోసం చేసుకోరు. ట్రైబల్ కల్చర్స్ సంబంధాలలో మనకన్నా సంపన్నులు''''మీరు అబ్సర్వ్ చేస్తే, ట్రైబల్ విలేజెస్ లో ఎక్కడా చెత్తపడి ఉండడం చూడరు. వాళ్ళకు ఉన్న పరిశుభ్రత ఆరోగ్యం మనకి లేదు. ప్రకృతిని వాళ్ళు ప్రేమించినంతగా మనకి ప్రేమించడం తెలియదు. మనం అడవులను నరికి పాడు చేస్తాం.. వాళ్ళు అడవి తల్లి నీడలో నిద్రపోతారు. ఈ మోడర్న్ సొసైటీ ఎప్పుడూ వాళ్ళని అనాగరికులని అనుకుంటుంది. కానీ నాగరికత లేనిది మనకి. ఇప్పటికీ 90 దేశాల్లో 500 మిలియన్స్ కి పైగా ట్రైబల్స్ ఈ ప్రపంచంలో బతుకుతున్నారు. వాళ్ళందరికీ యూనిక్ లాంగ్వేజెస్, కల్చర్స్, ట్రెడిషన్స్ ఉన్నాయి. ప్రపంచంలో ఉన్న ప్రతి ట్రైబల్ కల్చర్ ఆడవాళ్ళని ఎంతో గౌరవిస్తాయి. ఆడవాళ్ళని తిట్టేది, మానభంగం చేసేది మనమే. ''ఇప్పటికీ అమెజాన్, బ్రెజిల్, పెరూ, కెన్యా, ఇథియోపియా, ఇండియా, ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, కెనడా.. ఇలా చాలా దేశాల్లో ట్రైబల్స్ ఉన్నారు. వరల్డ్ వైడ్ దాదాపు 5000 ఇండిజినస్ గ్రూప్స్ ఉన్నాయి. సివిలైజేషన్, ఎడ్యుకేషన్ పెరిగిపోయిన మనమే నాశనం అయిపోయాం. వాళ్ళు ఇప్పటికీ మనకంటే గొప్పగా, మనశ్శాంతిగా బతుకుతున్నారు. ఎప్పుడైనా ట్రైబల్స్ ని చూసినప్పుడు వాళ్లు అనాగరికులు అని మీరు అనుకుంటే, మీకు నాగరికత లేదని అర్థం. 'మేము ఈ భూమిని మా పూర్వీకుల నుండి వారసత్వంగా పొందలేదు. మా పిల్లల దగ్గర నుండి అప్పుగా తీసుకున్నాం' అని నేటివ్ అమెరికాలో ఒక నానుడి ఉంది. ట్రైబల్స్ అంటే ఎవరో అనుకోవద్దు.. ఒకప్పటి మనమే. చివరిగా చెప్పేది ఏంటంటే.. మన రూట్స్ (మూలాలు) ఈ స్టుపిడ్ రోడ్స్ కంటే లోతైనవి'' అని పూరీ జగన్నాథ్ వివరించారు.