తమిళనాడు రాజకీయం.. దశాబ్దాల తరబడి రెండు ప్రధాన పార్టీల మధ్యనే సాగుతూ వస్తోంది. అయితే డీఎంకే లేదా అన్నాడీఎంకే అధికార పీఠం.. వీటి మధ్యలో అనేక పార్టీలు తమిళనాడు రాజకీయ యవనికపై రంగ ప్రవేశం చేసినప్పటికీ.. అవన్నీ పెద్దగా ప్రభావం చూపలేకపోయాయి. కొన్ని సీట్లలో ప్రభావం చూపించటమో లేదా.. డీఎంకే, అన్నాడీఎంకే కూటములలో చేరటమో జరుగుతూ వస్తోంది. కానీ 2026 ఎన్నికల్లో తొలిసారిగా తమిళనాడు ఓటర్లకు మరో ప్రత్యామ్నాయం కనిపించదన్న విశ్లేషణలు మొదలయ్యాయి. అదే స్థాపించిన టీవీకే. ఇన్నేళ్లూ రెండు పార్టీల మధ్యనే ప్రధానంగా సాగుతూ వచ్చిన తమిళనాడు ఎన్నికలు.. ఈసారి త్రిముఖ పోరుగా మారాయి. సినీ రంగం నుంచి రాజకీయ రంగంవైపు అడుగులు వేసిన తన టీవీకే ప్రత్యామ్నాయమని నిరూపించేందుకు ఈ ఎన్నికల్లో తీవ్రంగా కృషి చేశారు. మరి తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2026లో .. మరో అరవింద్ కేజ్రీవాల్ అవుతారా.. లేక ప్రశాంత్ కిషోర్‌గా మిగిలిపోతారా అనేది మరికొద్ది గంటల్లో తెలియనుంది. ఎన్నికల వ్యూహకర్తగా దేశవ్యాప్తంగా పేరొందిన ప్రశాంత్ కిషోర్.. జన్ సూరజ్ పార్టీ స్థాపించి బిహార్ అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచిన సంగతి తెలిసిందే. బిహార్‌లో జేడీయూ, ఆర్జేడీలకు ప్రత్యామ్నాయంగా నిలవాలనే ఉద్దేశంతో ప్రశాంత్ కిషోర్ బిహార్ ఎన్నికల్లో బరిలోకి దిగారు. మొత్తం 243 అసెంబ్లీ స్థానాల్లోనూ తన పార్టీ తరుఫున అభ్యర్థులను బరిలోకి దింపారు. బిహార్ ప్రభుత్వ పరిపాలనా వైఫల్యాలు, వలసలు, ఉద్యోగాలు వంటి అంశాలను ఆయుధంగా చేసుకుని.. బిహార్ రాజకీయాలలో పాతుకుపోయిన కుల రాజకీయాలను సవాల్ చేశారు. అయితే పీకే ప్రయత్నం విఫలమై.. ఆయన జనసూరజ్ పార్టీ ఒక్క సీటులో కూడా గెలవలేకపోయింది. ఇదే సమయంలో ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీని తీసుకుంటే.. అవినీతి వ్యతిరేక ఉద్యమం తర్వాత అరవింద్ కేజ్రీవాల్ తన ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసి ఆమ్ ఆద్మీ పార్టీని ప్రారంభించారు. తొలి ఎన్నికలలోనే ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలోని 70 స్థానాలకు గాను 28 స్థానాలను గెలుచుకుంది. ఆ తర్వాత జరిగిన ఎన్నికలలో కూడా ఆమ్ ఆద్మీ పార్టీ హవా కొనసాగింది. ఢిల్లీ ఆమ్ ఆద్మీ పార్టీ, బిహార్ జన సూరజ్ పార్టీల తరహాలోనే రెండు పెద్ద పార్టీల మధ్య రాజకీయ అరంగేట్రం చేసిన విజయ్ టీవీకే.. అరవింద్ కేజ్రీవాల్ ఆప్‌లా మారుతుందా.. పీకే జన సూరజ్ పార్టీల మిగులుతుందా అనేది ఇప్పుడు ప్రాధాన్యం సంతరించుకుంది. 1967 నుంచి తమిళనాడులో అధికారం డీఎంకే, అన్నాడీఎంకే మధ్యనే చేతులు మారుతూ వస్తోంది. ఎన్నో చిన్న పార్టీలు తమిళనాడు ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నప్పటికీ.. ఈ పార్టీలలో ఏదో ఒక పార్టీ పంచన చేరాల్సి వస్తోంది. ఇక లెక్కల విషయానికి వస్తే 2016 తమిళనాడు ఎన్నికల్లో అన్నాడీఎంకే 40 శాతం ఓట్లతో 134 సీట్లు గెలుచుకుని అధికారంలోకి వచ్చింది. డీఎంకే 32.1 శాతం ఓట్లతో 89 సీట్లు గెలుచుకుంది. మిగతా 20 శాతం ఓట్లు బీజేపీ, లెఫ్ట్ వంటి పార్టీలకు పడ్డాయి. 2021 ఎన్నికల్లో అన్నాడీఎంకే - డీఎంకే కూటమికి 39.71 శాతం ఓట్లు వస్తే.. డీఎంకే కూటమికి 45 శాతం ఓట్లు వచ్చాయి. ఆ లెక్కన తమిళనాడు ఎన్నికల్లో 15 నుంచి 20 శాతం ఓట్లు.. అటు డీఎంకే వైపు కానీ, ఇటు అన్నాడీఎంకే వైపు కానీ పడటం లేదు. ఈ 20 శాతం ఓటర్లు మూడో ప్రత్యామ్నాయం వైపు చూస్తున్నారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు 2026లో ఈ 20 శాతం ఓటర్లు విజయ్ టీవీకే వైపు మొగ్గుచూపుతారని కచ్చితంగా చెప్పలేనప్పటికీ.. ఎ వేశాయి. విజయ్‌కు చెందిన టీవీకే పార్టీకి 10 నుంచి 24 సీట్లు రావొచ్చని మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. ఒక్క రావచ్చని అంచనా వేసింది. ఈ నేపథ్యంలో సినీ రంగం వదిలి రాజకీయ యవనికపై అడుగుపెట్టిన తలపతి విజయ్.. జననాయగన్‌గా నిలుస్తాడా లేదా అనే ప్రశ్నకు మే నాలుగో తేదీన సమాధానం దొరకనుంది.