చైనాకు ప్రత్యామ్నాయంగా భారత్‌కు ఇదే మంచి ఛాన్స్.. ఆశలు రేకెత్తిస్తున్న ఏపీ సహా 5 రాష్ట్రాలు!

Wait 5 sec.

: భారత్.. కొంత కాలంగా అన్ని రంగాల్లో సత్తా చాటుతున్న సంగతి తెలిసిందే. పలు రంగాల్లో.. పలు దేశాల్ని అధిగమిస్తూ.. ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసుకుంటోంది. ఈ క్రమంలోనే ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో టాప్- 5 లోకి దూసుకొచ్చింది. ఈ క్రమంలోనే ఇప్పుడు . ఇవే ఇప్పుడు 21వ శతాబ్దపు కొత్త వ్యూహాత్మక ఇంధనంగా మారాయి. విద్యుత్ వాహనాలు, విండ్ టర్బైన్స్, స్మార్ట్ ఫోన్స్ సహా రక్షణ వ్యవస్థల ఉత్పత్తిలో ఈ భూ అయస్కాంత ఖనిజాలే కీలకంగా ఉంటాయి. వీటిని ప్రపంచంలో సరికొత్త వ్యూహాత్మక ఆస్తులుగా పరిగణిస్తున్నారు. స్వచ్ఛ ఇంధన పరివర్తన దిశగా ప్రపంచం పరుగులు తీస్తున్న క్రమంలో.. ఈ 17 లోహాల సమాహారంపై అన్ని దేశాలు దృష్టి సారిస్తున్నాయి.>> ప్రస్తుతం అంతర్జాతీయంగా . వీటి ఉత్పత్తిలో 70 శాతం, రిఫైనింగ్‌లో 90 శాతం ప్రస్తుతం చైనా వాటాగా ఉంది. అయినప్పటికీ.. గ్లోబల్ సప్లై చెయిన్‌లో వైవిధ్యత కోసం అమెరికా, ఆస్ట్రేలియా వంటి దేశాలు చైనాకు ప్రత్యామ్నాయ దేశాలవైపు చూస్తున్నాయి. ఇక ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ (IEA) రిపోర్ట్ ప్రకారం.. 2030 నాటికి చైనా ఉత్పత్తి 70 శాతం నుంచి 51 శాతానికి; రిఫైనింగ్ 90 శాతం నుంచి 76 శాతానికి తగ్గుతుందని అంచనా వేస్తోంది. ఇది భారత్‌కు మంచి అరుదైన అవకాశాన్ని కల్పిస్తోంది. ప్రస్తుతం ప్రపంచ నిల్వల్లో.. భారత్ వాటా 6 శాతంగా ఉంది. అయితే అంతర్జాతీయ ఉత్పత్తిలో చూస్తే భారత్ వాటా ఒక శాతం కంటే తక్కువగానే ఉంది. దీన్ని విస్తృతంగా పెంచేందుకు.. కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ముందుగా గనుల తవ్వకం, వెలికితీత, ప్రాసెసింగ్‌కు మద్దతు ఇచ్చేందుకు కేంద్రం.. నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్- 2025 ను ఆవిష్కరించింది.IREL ఇండియా లిమిటెడ్‌ను అమెరికా ఎగుమతి నియంత్రణ జాబితా నుంచి తొలగించడం ద్వారా అంతర్జాతీయ భాగస్వామ్యాలకు మార్గం సుగమమైంది. విశాఖపట్నంలో రాబోతున్నటువంటి IREL ప్లాంట్.. దేశీయంగా సమారియం- కోబాల్ట్ మాగ్నెట్లను ఉత్పత్తి చేయనుంది. దీంతో సాంకేతిక స్వయం సమృద్ధి మరింత బలోపేతం కానుంది.ఆంధ్రప్రదేశ్, కేరళ, తమిళనాడు సహా ఒడిశా, గుజరాత్ వంటి రాష్ట్రాలు.. ఇప్పటికే ఖనిజాల వెలికితీతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నాయి. భవిష్యత్తులో ఈ భూ అయస్కాంత ఖనిజాల ఉత్పత్తిలోనూ ఇవి ముఖ్య కేంద్రాలుగా మారేందుకు అవకాశం ఉంది.స్వచ్ఛ ఇంధనం, డిజిటల్ టెక్నాలజీకి ప్రపంచం మారే కొద్దీ.. REE లకు డిమాండ్ కూడా అపారంగా పెరుగుతుంది. 2040 కల్లా వీటి డిమాండ్.. 300 నుంచి 700 శాతం వరకు పెరిగే అవకాశం ఉంది. మేకిన్ ఇండియా ఇనిషియేటివ్ కింద.. సంస్కరణలతో ప్రైవేట్ పెట్టుబడుల్ని ప్రోత్సహించడం ద్వారా.. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకునేందుకు భారత్ సిద్ధంగా ఉంది.