బిగ్‌బాస్ లేటెస్ట్ ప్రోమో మాములుగా లేదు. నామినేషన్స్ జరుగుతుండటంతో హౌస్‌మేట్స్ అందరూ ఫుల్ హీటు మీద ఉన్నారు. ఇప్పటికే . అయితే లేటెస్ట్ ప్రోమోలో రమ్యని టార్గెట్ చేస్తూ తనూజ నామినేట్ చేసింది. దీంతో ఇద్దరి మధ్యా మళ్లీ రచ్చరచ్చ అయింది.ఒకరిని హర్ట్ చేయాలని ఇంకొకరికి మంట పెట్టాలని వచ్చావా.. ఇంకొకరికి చెప్పే ముందు నీ గేమ్ ఏంటో నువ్వు తెలుసుకో.. అంటూ తనూజ క్లాస్ పీకింది. దీంతో అమ్మా ఫేక్ పిల్ల నేను నీకులా ఉండలేనమ్మా.. అంటూ రమ్య కామెంట్ చేసింది. నాలాగ నువ్వు ఉండలేవు కూడా.. అని తనూజ కౌంటర్ ఇచ్చింది. దీంతో నేను బాండింగ్స్ కోసం రాలేదు నీకు లాగ.. ఒకరు వెళ్లిపోయారు నేను ఇంకొకర్ని వెతుక్కోవాలి అనే టైపు కాదు నేను.. అంటూ రమ్య పర్సనల్ అటాక్ చేసింది.దీంతో స్టేట్‌మెంట్స్ పాస్ చేసే ముందు నిన్ను నువ్వు చెక్ చేసుకో.. ఈ హ్యాండ్ ఈ హ్యాండ్ కలిపితేనే క్లాప్ కదా.. అంటూ చప్పట్లు కొడుతూ వచ్చిందా సౌండ్.. రెండు చేతుల సౌండ్ కన్నా ఒక చేతి విజిల్ గట్టిగా వినిపిస్తుంది.. అంటూ తనూజ మాములు డైలాగ్ కొట్టలేదు. అంతేకాకుండా తన సీట్లో కూర్చొని విజిల్ వేసి మరీ చూపించింది తనూజ. పక్కనే ఉన్న మాధురికి చెవులు చిల్లులు పడేలా వచ్చింది సౌండ్.సంజన Vs దివ్యమరోవైపు దివ్యని టార్గెట్ చేసింది సంజన. లీడర్ బోర్డ్‌లో 4లో ఉంటే కూడా నన్ను ఫ్లోరాని తీసేశావ్.. అని సంజన రీజన్ చెప్పింది. ఈ చెత్త రీజన్స్ అన్నీ మీరు ఇప్పుడు చెప్పకండి.. అని దివ్య ఫైర్ అయింది. దీంతో భరణి అన్న బయటికి పోవడానికి మేజర్ రీజన్ నువ్వే కదా.. అంటూ సంజన అంది. నా వల్ల కాదు పోయింది..మీరు నామినేట్ చేస్తే ఆయన ఎలిమినేట్ అయ్యారు.. మీరు రీజన్ అయి ఉండి అది వేరే వాళ్ల మీద రుద్దకండి..మీరూ నేనూ కలిసిపోదామన్నా అని చెప్పి నెక్స్ట్ మినిట్ నామినేట్ చేయను మీలాగ.. అంటూ దివ్య రెయిజ్ అయింది. దీంతో శ్రీజ 2.0.. అటూ దివ్యని రెచ్చగొట్టింది సంజన. నాకు నా సొంత పేరు ఉంది మీకు తెలీదా.. దివ్య గుర్తుపెట్టుకోండి.. అంటూ దివ్య చెప్పింది. దీనికి అంత గుర్తుపెట్టుకునే పేరు కాదు అది.. అంటూ సంజన వాదించింది.అలానే కళ్యాణ్‌ని నామినేట్ చేస్తూ సాయి తన రీజన్స్ చెప్పాడు. ఇమ్యూనిటీ పవర్‌ని మీరు ఎంతలా తీసేద్దాం అనుకుంటున్నారో.. అది ఎంత రైట్ అని భావిస్తున్నారో.. ఎవరైతే మిమ్మల్ని అన్‌సేఫ్ చేశారో అది భరించి ముందుకెళ్లడం కూడా రాంగే.. అన సాయి అన్నాడు. ఒక గేమ్ ఆడుతున్నావ్ సాయి.. నువ్వు ఎన్నిసార్లు టచ్ చేసినా వాడు ఔట్ అవ్వడు అంటే నేనెందుకు ఒప్పుకుంటాను.. ఓపెన్‌గా ఆరుగురి పవర్స్ తీసేయడానికి నేను రెడీగా ఉన్నాను.. ఏ అడ్వాంటేజ్‌లు నేను ఎవరికీ ఇవ్వదలచుకోలేదు.. అంటూ కళ్యాణ్ క్లారిటీగా చెప్పాడు.