IT Notice: మనలో చాలా మందికి డబ్బులకు సంబంధించిన ట్రాన్సాక్షన్లు నిర్వహించేందుకు ప్రాథమిక మార్గం బ్యాంకు సేవింగ్స్ అకౌంట్. బ్యాంకు ఖాతాను ఉపయోగించి పేమెంట్లు, మనీ ట్రాన్స్‌ఫర్, క్యాష్ విత్ డ్రా, డిపాజిట్ల వంటివి చేస్తుంటాం. సేవింగ్స్ అకౌంట్ ద్వారా వివిధ పనులు పూర్తి చేస్తున్నప్పటికీ చాలా మందికి పొదుపు ఖాతా పరిమితులు తెలియదు. రోజు వారీ ట్రాన్సాక్షన్ల ద్వారానే మనపై ఇన్‌కమ్ ట్యాక్స్ విభాగం దృష్టి పడే అవకాశం ఉంటుంది. అలా పొదుపు ఖాతా ద్వారా నిర్వహించే మరి ఆ వివరాలు తెలుసుకుందాం. 1.పెద్ద మొత్తంలో నగదు డిపాజిట్లుఒక ఆర్థిక సంవత్సరంలో మీ సేవింగ్స్ అకౌంట్లో రూ.10 లక్షలు ఆపైన డబ్బులు డిపాజిట్ చేసినట్లయితే మీ బ్యాంకు మీ వివరాలను ఇన్‌కమ్ ట్యాక్స్ విభాగానికి పంపిస్తుంది. అయితే, ఇది చట్ట విరుద్ధం కాకపోయినా ఐటీ శాఖ మీ ట్రాన్సాక్షన్ల వివరాలు అడగవచ్చు. అందుకు సంబంధించిన డాక్యుమెంట్లను భద్రంగా ఉంచుకోవాలి. మీ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయో చెప్పాల్సి ఉంటుంది. 2.క్రెడిట్ కార్డ్ బిల్ పేమెంట్లుబ్యాంకులు, క్రెడిట్ కార్డు జారీ సంస్థలు కార్డు పేమెంట్లు పరిమితి దాటినట్లయితే వాటి వివరాలను ఐటీ శాఖకు అందిస్తాయి. రూ.1 లక్షకు మించి నగదు ట్రాన్సాక్షన్ లేదా రూ.10 లక్షలు (ఆన్‌లైన్, చెక్ పేమెంట్లు) వంటివి జరిగినప్పుడు వివరాలు ఇస్తాయి. మీరు వెల్లడించిన ఆదాయానికి, మీరు చేసే ట్రాన్సాక్షన్ల మధ్య తేడాను ఐటీ శాఖ బేరీజు వేస్తుంది. తేడా వస్తే నోటీసులు పంపుతుంది. 3. తరుచుగా పెద్ద మొత్తంలో విత్ డ్రా చేయడంమీరు బ్యాంక్ ఖాతా నుంచి తరుచుగా డబ్బులు విత్ డ్రా చేయడం లేదా ఒకేసారి పెద్ద మొత్తంలో తీసుకోవడం వంటివి చేస్తున్నప్పుడు మీ ఆదాయానికి ఆ వివరాలు సరిపోలకపోతే వస్తాయి. అలాంటి ట్రాన్సాక్షన్లకు సంబంధించిన రికార్డులను ఉంచుకోవాలి. డాక్యుమెంట్లు భద్రపరుచుకోవాలి. 4.ఆస్తుల అమ్మకం, కొనుగోలురూ.30 లక్షలు ఆపైన ఏదైనా స్థిరాస్తిని అమ్మడం గానీ, కొనడం గానీ చేసినప్పుడు మీ ట్రాన్సాక్షన్ విలువ లేదా స్టాంప్ డ్యూటీ విలువ ఆధారంగా సబ్‌రిజిస్ట్రార్ మీ వివరాలను ఐటీ శాఖకు అందిస్తారు. ఈ వివరాలను రెండు పార్టీల ఐటీఆర్‌లో ఐటీ విభాగం చెక్ చేస్తుంది. సరిపోలకపోతే నోటీసులు పంపిస్తుంది. 5.ఇనాక్టివ్ అకౌంట్ సడెన్‌గా యాక్టివ్ చేయడం లేదా విత్ డ్రా చేసినప్పుడు బ్యాంకులు అలాంటి వాటిని అసహజ చర్యలుగా భావిస్తాయి. ఆ వివరాలను ఐటీ శాఖకు పంపిస్తాయి. అందుకు సంబంధించిన వివరాలను అందించాల్సి ఉంటుంది. 6.విదేశీ కరెన్సీ ట్రాన్సాక్షన్లుఒక ఆర్థిక సంవత్సరంలో మీ ఫారెక్స్ కార్డులు, డ్రాన్స్, ఇంటర్నేషనల్ క్రెడిట్ కార్డు ట్రన్సాక్షన్ల ద్వారా రూ.10 లక్షలు ఆపైన ఖర్చు చేసినా, డబ్బులు జమ చేసినా అలాంటి వివరాలను ఐటీ రిటర్నుల్లో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంద. ఒక వేళ ఆ వివరాలను దాచిపెడితే మీకు నోటీసులు అందుతాయి. 7. వడ్డీ ఆదాయంలో తేడాలుమీకు వచ్చిన వడ్డీ ఆదాయానికి సంబంధించి బ్యాంకు చెప్పిన వివరాలు, మీరు ఐటీ రిటర్నుల్లో ఇచ్చిన వివరాలు సరిపోలకపోతే అప్పుడు మీకు ఐటీ నోటీసులు వస్తాయి. ఫారం 26ఏఎస్ లేదా ఏఐఎస్‌లోని వడ్డీ వివరాలను క్రాస్ చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. 8. వడ్డీ, డివిడెండ్, క్యాపిటల్ గెయిన్స్బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు, పోస్టాఫీసులు, మ్యూచువల్ ఫండ్స్ మీకు వచ్చిన వడ్డీ ఆదాయం, డివిడెండ్లు లేదా క్యాపిటల్ గెయిన్స్ వంటివి ఐటీ శాఖకు పంపిస్తాయి. ఒక వేళ మీ పొదుపు ఖాతా వడ్డీ రూ.10 వేల లోపు ఉన్నప్పటికీ ఆ వివరాలు యాన్యువల్ ఇన్ఫర్మేషన్ స్టేట్మెంట్ (AIS)లో కనిపిస్తాయి. ఐటీఆర్‌లోని వివరాలు, ఏఐఎస్ లోని వివరాలు సరిపోలకపోతే మీకు నోటీసులు వస్తాయి. 9.ఒకటికి మించి సేవింగ్స్ అకౌంట్లుఒకటికి మించి పొదుపు ఖాతాలు ఉండడం అనేది సహజమే. అయితే, అన్ని అకౌంట్ల నుంచి వచ్చే వడ్డీ ఆదాయాన్ని ఐటీఆర్‌లో చూపించాలి. ఏ చిన్న వివరాలు మిస్ అయినా మీకు ఐటీ నోటీసులు అందుతాయి. 10.క్రెడిట్/ డెబిట్ కార్డుతో పెద్ద ట్రాన్సాక్షన్లుక్రెడిట్ కార్డు, డెబిట్ కార్డుల ద్వారా పెద్ద ట్రాన్సాక్షన్లు చేస్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అలాగే పండగల సమయంలో ఇ-కామర్స్ సంస్థలు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటివి ఫెస్టివ్ సేల్స్ తెస్తాయి. బ్యాంకులు తమ కార్డులపై ఆఫర్స్ ఇస్తాయి. ఈ క్రమంలో చాలా మంది తమ స్నేహితులు, బంధువుల కార్డుల ద్వారా ట్రాన్సాక్షన్లు చేస్తుంటారు. అయితే, కొన్నిసార్లు అలా చేయడం ఇబ్బందులు తీసుకొస్తుంది. క్రెడిట్ కార్డు లిమిట్ దాటడం, దాటితే నోటీసులు అందే అవకాశం ఉంటుంది.