శాంతించిన బంగారం.. ఇవాళ 24, 22 క్యారెట్ల గోల్డ్ రేట్లు ఇవే.. తులం ధర ఎంతుందంటే?

Wait 5 sec.

: భారతీయులకు అత్యంత ఇష్టమైన వాటిల్లో బంగారం ముందు వరుసలో ఉంటుంది. వందల సంవత్సరాల నుంచి భారతీయ సంస్కృతి, సాంప్రదాయాల్లో బంగారానికి ప్రత్యేక స్థానం కల్పించారు. పండగలు, శుభకార్యాలు, పెళ్లిళ్లలో పసిడి కచ్చితంగా ఉండాల్సిందే. ఇక మహిళలు బంగారు ఆభరణాలు ధరించేందుకు ఇష్టపడతారు. ఇటీవలి కాలంలో బంగారం ఒక పెట్టుబడి సాధనంగా మారింది. హైరిటర్న్స్ అందించే మార్గంగా కనిపిస్తోంది. దీంతో చాలా మంది బంగారం కొంటున్నారు. భౌతిక బంగారంతో పాటు డిజిటల్ విధానంలో వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెడుతున్నారు. దీంతో బులియన్ మార్కెట్లో పసిడి ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. గత ఏడాది కాలంలోనే తులం బంగారం రేటు దాదాపు 50 శాతం పెరగడం గమనార్హం. సామాన్యులకు అందనంత దూరంలోకి వెళ్లిపోతోంది. అక్టోబర్ 6వ తేదీన బంగారం రేట్లు తెలుసుకుందాం. అంతర్జాతీయ మార్కెట్లో చూస్తే బంగారం ధరలు సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. ఇవాళ సైతం స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 20 డాలర్లకు పైగా పెరిగి 3904 డాలర్ల వద్దకు చేరుకుంది. ఆల్ టైమ్ హై స్థాయిలో ట్రేడవుతోంది. ఇక స్పాట్ సిల్వర్ ధర ఔన్సుకు 0.23 శాతం పెరిగి 48 డాలర్ల పైన ట్రేడవుతోంది. హైదరాబాద్‌లో బంగారం ధరలుహైదరాబాద్ విపణిలో ఈరోజు బంగారం ధరలు శాంతించాయి. క్రితం రోజు 24 క్యారెట్ల మేలిమి గోల్డ్ రేటు తులానికి రూ.870 మేర పెరగగా ఇవాళ స్వల్ప ఊరట కల్పించింది. ఈరోజు ఎలాంటి మార్పు లేకుండా స్థిరంగా కొనసాగుతోంది. అయితే మళ్లీ పెరగవచ్చు. ఇవాళ 24 క్యారెట్ల గోల్డ్ రేటు 10 గ్రాములకు రూ. 1,19,400 వద్ద స్థిరంగా ట్రేడవుతోంది. ఇక 22 క్యారెట్ల బంగారం ధరలో సైతం ఏ మార్పు లేదు. ఇవాళ 10 గ్రాములకు రూ. 1,09,450 వద్ద ట్రేడవుతోంది. స్థిరంగానే వెండి రేటుఅయితే, అంతకు ముందు రోజు ఏకంగా రూ.3000 పెరిగి కొత్త రికార్డ్ సృష్టించింది. ప్రస్తుతం కిలో వెండి రూ.1,65,000 మార్క్ వద్ద ట్రేడవుతోంది. అయితే, బెంగళూరు, ముంబై, ఢిల్లీ వంటి ప్రధాన నగరాల్లో కిలో వెండి రూ.10 వేలు తక్కువకే లభిస్తోంది. పైన చెప్పిన బంగారం, వెండి రేట్లు అక్టోబర్ 6వ తేదీ సోమవారం రోజు ఉదయం 7 గంటల సమయంలో ఉన్నవి. అయితే, మధ్యాహ్నానికి రేట్లు మారవచ్చు. ప్రాంతాల వారీగా వేరు వేరు ఉంటాయి. అందుకు పన్నులు, ఛార్జీలు కారణమవుతాయి. కొనే ముందు తెలుసుకోవడం మంచిది.