తెలంగాణలో కుండపోత వానలు.. రానున్న 2 గంటల్లో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

Wait 5 sec.

తెలంగాణకు జారీ అయ్యాయి. రాష్ట్రంలో నేటి నుంచి మూడు రోజుల పాటు వర్షాలు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ముఖ్యంగా ద్రోణి ప్రభావం, క్యూములోనింబస్ మేఘాల కారణంగా కొన్ని జిల్లాల్లో భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. వర్షాలతో పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వానలు కురుస్తాయని చెప్పారు. అలాగే గంటకు 30 నుంచి 40 కి.మీ వేగంతో పాటు కొన్ని ప్రాంతాల్లో 40 నుంచి 50 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.నేడు హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, రంగారెడ్డి, నారాయణపేట జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. అనేక చోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన చెప్పారు. రాబోయే 2 గంటల్లో నిర్మల్, నిజామాబాద్, సిరిసిల్ల, సిద్దిపేట, కామారెడ్డి, మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి, రంగారెడ్డిలలో అక్కడక్కడా భారీ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తుందని అంచనా వేశారు. మంగళవారం హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబునగర్, నారాయణపేట, జోగులాంబ, గద్వాల్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, భువనగిరి, రంగారెడ్డి జిల్లాల్లో వర్షం పడే అవకాశం ఉందని చెప్పారు. బుధవారం ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, రంగారెడ్డి, హైదరాబాద్, వికారాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది.లోతట్టు ప్రాంతాల ప్రజలు, ముఖ్యంగా నగర ప్రాంతాలలో, నీరు నిలిచే ప్రమాదం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. వర్షాలు, ఈదురు గాలుల కారణంగా ట్రాఫిక్ అంతరాయాలు, వాహనాల రాకపోకలకు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని.. ఈ వాతావరణ పరిస్థితుల దృష్ట్యా, తగిన జాగ్రత్తలు తీసుకోవడం ఉత్తమమని చెబుతున్నారు.