సీన్ రివర్స్.. బంగారం ధరల్లో ఊహించని మార్పు.. దసరా తర్వాత ఇలా.. తులం ఎంతంటే?

Wait 5 sec.

: దసరా ఉత్సవాలు ముగించుకుని దీపావళి కోసం యావత్ భారత్ ఎదురుచూస్తోంది. గత వారం రోజులుగా దేశవ్యాప్తంగా దసరా, దుర్గాశరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ క్రమంలో బంగారం కొనుగోళ్లు భారీగా జరిగాయి. దసరా సందర్భంగా కొనుగోలు చేస్తే మంచిదని భావిస్తారు. తమ బంధువులకు బంగారం కానుకలుగా ఇస్తుంటారు. అందుకే దసరా వేళ బంగారం ఎక్కువగా కొంటుంటారు. అయితే, ఈసారి దసరాకు బంగారం కొనుగోళ్లపై ధరల ప్రభావం పడిందని చెప్పవచ్చు. దేశీయం మార్కెట్లో పసిడి ధరలు సరికొత్త రికార్డులు కొడుతూ ఆకాశమే హద్దుగా దూసుకెళ్తున్నాయి. అయితే, దసరా తర్వాత బంగారం రేట్లు స్వల్పంగా తగ్గాయి. దీంతో చాలా మంది కొనేందుకు సిద్ధమయ్యారు. కానీ, వారికి ఒక్కరోజు మురిపమే అయింది. బంగారం రేట్లు మళ్లీ భారీగా పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. ఇవాళ స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 42.19 డాలర్ల మేర పెరిగి 3886 డాలర్ల స్థాయిని దాటింది. ఇక స్పాట్ సిల్వర్ ధర ఇవాళ 3.07 శాతం మేర దూసుకెళ్లింది. దీంతో స్పాట్ 48 డాలర్ల వద్దకు ఎగబాకింది. హైదరాబాద్‌లో బంగారం ధరలుహైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు తగ్గినట్లే తగ్గి ఒక్కసారిగా భారీగా పెరిగాయి. ఇవాళ 22 క్యారెట్ల ఆభరణాల గోల్డ్ 10 గ్రాములపై రూ.800 మేర పెరిగింది. దీంతో తులం ధర రూ. 1,09,450 వద్దకు చేరుకుంది. ఇక 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం రేటు ఒక్కరోజే రూ.870 మేర పెరిగింది. దీంతో తులం ధర రూ.1,19,400 వద్దకు ఎగబాకింది. స్థిరంగానే వెండి ధరఇవాళ వెండి రేట్లలో ఏ మార్పు లేదు. ప్రస్తుతం హైదరాబాద్‌లో కిలో వెండి రేటు రూ.1,65,000 మార్క్ వద్ద ట్రేడవుతోంది. అయితే, ఢిల్లీ, ముంబై వంటి ఇతర ప్రాంతాల్లో మాత్రం కిలో వెండి రేటు రూ.1,55,000 వద్ద లభిస్తోంది. పైన చెప్పిన బంగారం, వెండి రేట్లు అక్టోబర్ 5వ తేదీన ఉదయం 7 గంటల సమయంలో ఉన్నవి. అయితే, పసిడి రేట్లు మధ్యాహ్నానికి మారవచ్చు. కొనే ముందే స్థానిక ధరలు తెలుసుకోవాలి. ఎందుకంటే పన్నులు కలిపితే రేట్లు ప్రాంతాలను బట్టి మారుతాయి.