అదరగొట్టిన 3 మల్టీ అసెట్ 'గోల్డ్' స్కీమ్స్.. ఏడాదికే హైరిటర్న్స్.. ఏ స్కీమ్ ఎంతంటే?

Wait 5 sec.

Investment: ప్రస్తుతం మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు భారీగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా యువత ఫండ్స్ ఎంచుకుని కోట్లాది రూపాయలు పెట్టుబడులు పెడుతున్నారు. ఇందులోనూ హైబ్రిడ్ ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. గత ఏడాది కాలంలో చూసుకుంటే సాధారణ ఫండ్స్‌తో పోలిస్తే హైరిటర్న్స్ ఇస్తున్నాయి. మార్కెట్ ఒడుదొడుకులను తట్టుకుని మంచి రాబడులు ఇస్తున్నాయి. ఈక్విటీ, డెట్, గోల్డ్ కలయికతో మంచి రాబడులు అందిస్తున్నాయి. బంగారం ధరలు 47 శాతం మేర పెరిగిన క్రమంలో ఈ ఫండ్స్ లాభాలు పెరిగాయి. మరోవైపు.. కొద్ది రోజులుగా ఈక్విటీ ఫండ్స్ రాబడులు అందించడంలో సతమతమవుతున్నాయి. లార్జ్ క్యాప్ ఫండ్స్ గత ఏడాది కాలంలో 5-6 శాతం మేర నష్టపోయాయి. ఇక మిడ్ క్యాప్ ఫండ్స్ 4-6 శాతం వరకు నష్టపోగా స్మాల్ క్యాప్ ఫండ్స్ 6-9 శాతం వరకు పడిపోయాయి. అయితే, ఫ్లెక్సీ క్యాప్ ఫేండ్, మల్టీక్యాప్ ఫండ్స్ స్వల్పంగా 1-3 శాతం వరకు లాభాలు అందించాయి. ఈక్విటీ మార్కెట్ బలహీనంగా ఉండడం, బంగారం ధరలు పెరిగినట్లయితే ఈ ఈక్విటీ ఫండ్స్ మరింత పడిపోయే ప్రమాదం ఉన్నట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. అదరగొట్టిన 3 స్కీమ్స్ ఇవేకొన్ని ఫండ్స్ డబుల్ డిజిట్ రాబడులు అందించాయి. అందులో వైట్ ఓక్ క్యాపిటల్ మల్టీ అసెట్ అలకేషన్ ఫండ్ () గత ఏడాది కాలంలో 12.6 శాతం మేర రాబడులు ఇచ్చింది. ఇక డీఎస్‌పీ మల్టీ అసెట్ అలకేషన్ ఫండ్ చూస్తే ఏడాదిలో 10.1 శాతం మేర రిటర్న్స్ ఇచ్చింది. ఈ కేటగిరీ సగటు ఏడాదిలో 5.2 శాతంగా ఉండగా ఈ ఫండ్స్ మాత్రం 10 శాతానికి పైగా రాబడులు అందించాయి. ఆ తర్వాత మహీంద్రా మాన్యులైఫ్ మల్టీ అసెట్ అలకేషన్ () గత ఏడాది కాలంలో 9.10 శాతం మేర రాబడులు అందించింది. ఈ కేటగిరీ యావర్ 5.2 శాతంగా ఉంది. అంటే దానికి మించి రెండింతల లాభాలు అందించింది. మ్యూచువల్ ఫండ్స్‌లోనూ హైరిస్క్ ఉంటుంది. మార్కెట్ ఒడుదొడుకులకు ఫండ్స్ లోనవుతుంటాయి. అందుకే అన్ని తెలుసుకుని, పూర్తి అవగాహనతో పెట్టుబడి పెట్టినప్పుడే లాభాలు పొందే అవకాశం ఉంటుంది.