గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా క్యాచ్‌ల విషయంలో మాత్రం ఆ జట్టు దారుణంగా ట్రోల్స్‌కు గురవుతుంటుంది. గాల్లోకి లేచిన బంతిని పట్టుకోవడానికి ఇద్దరు ఫీల్డర్లు ఒకేసారి వెళ్లారా? కచ్చితంగా ఆ తర్వాత రోజు సోషల్ మీడియాకు పెద్ద ట్రోలింగ్ మెటీరియల్ అవుతారు. లో కూడా సరిగ్గా అదే జరిగింది. పాపం ఇప్పుడు నెట్టింట ఒకటే ట్రోల్స్ వస్తున్నాయి. , చివరి ఓవర్‌లో ఫీల్డింగ్‌లో ఘోర తప్పిదం చేసింది. ఆ క్యాచ్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ, అభిమానుల వంగ్యాస్త్రాల వర్షం కురుస్తోంది.టీమిండియా ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్‌లో రిచా ఘోష్‌ స్ట్రయిక్‌లో, కాంతి గౌడ్‌ నాన్‌స్ట్రైక్‌ ఎండ్‌లో ఉన్నారు. పాకిస్తాన్‌ బౌలర్‌ డయానా బైగ్‌ వేసిన షార్ట్‌ బంతిని రిచా గాల్లోకి లేపింది. ఫీల్డర్‌ నవాజ్‌ దానికి పరుగెత్తి వచ్చి క్యాచ్‌ పట్టే ప్రయత్నం చేసింది. అదే సమయంలో పర్వైజ్‌ కూడా వెనుక నుంచి పరుగెత్తి రావడంతో ఇద్దరు ఢీకొని, సులభమైన క్యాచ్‌ను వదిలేశారు. ఈ గందరగోళం మధ్య రిచా ఒక్క రన్‌ తీసుకోగా, తర్వాత కాంతి గౌడ్‌ బైగ్‌పై బౌండరీ బాదింది. అయితే, అదే ఓవర్‌లో బైగ్‌ తన తప్పిదాన్ని సరిదిద్దుకుంది. ఆమె వరుసగా గౌడ్‌, రేణుకా సింగ్‌లను ఔట్‌ చేస్తూ భారత్‌ను 50 ఓవర్లలో 247 పరుగులకే ఆలౌట్‌ చేసింది.ఈ ఫీల్డింగ్‌ మిస్టేక్‌పై సోషల్ మీడియాలో అభిమానులు ట్రోల్స్ చేస్తున్నారు. “పాకిస్తాన్‌ ఫీల్డింగ్‌కి ఇది ఒక కల్ట్‌ క్లాసిక్‌ మూమెంట్‌,” అని ఒకరు కామెంట్ చేయగా.. మరొకరు “ఇలా క్యాచ్‌లు వదిలేస్తే మ్యాచ్‌ ఎలా గెలుస్తారు?” అని విమర్శించారు.మ్యాచ్‌లో మరో విచిత్ర ఘటన కూడా చోటుచేసుకుంది. మైదానంలో కీటకాలు రావడంతో ఆటలో అంతరాయం కలిగించాయి. ఈ విషయంపై భారత బ్యాటర్‌ జెమిమా రోడ్రిగ్స్‌ మాట్లాడుతూ “నిజంగా చాలా కష్టంగా అనిపించింది. కీటకాల వల్ల దృష్టి సరిగా కనిపించకపోయినా, పరిస్థితులకు అనుగుణంగా ఆడాల్సిందే” అని చెప్పింది.ఇక మ్యాచ్ విషయానికి వస్తే టాస్ గెలిచిన పాకిస్తాన్ జట్టు కెప్టెన్ బౌలింగ్ ఎంచుకోగా భారత్ తొలుత బ్యాటింగ్‌కి వచ్చింది. టీమిండియా బ్యాటర్లు నిలకడగా ఆడటం.. ఆఖర్లో రిచా ఘోష్ బౌండరీల మోత మోగించడంతో 50 ఓవర్లలో 247 పరుగులకు ఆలౌట్ అయింది. భారత బౌలర్ల ధాటికి పాకిస్తాన్ బ్యాటర్లు ఎక్కువ సేపు నిలవలేకపోయారు. సిద్రా అమిన్ 81 పరుగులతో పోరాడినప్పటికీ.. మిగతా బ్యాటర్లు రాణించకపోవడంతో పాక్ 43 ఓవర్లకు 159 పరుగులకు ఆలౌట్ అయింది. దాంతో టీమిండియా 88 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.