హైదరాబాద్‌లో ఇళ్ల ధరలకు రెక్కలు.. 3 నెలల్లో 8 శాతం జంప్.. చ.అ. ధర ఎంతంటే?

Wait 5 sec.

: హైదరాబాద్ నగరం వేగంగా విస్తరిస్తోంది. ఔటర్ రింగ్ రోడ్ దాటి ఓఆర్ఆర్ వైపు వెళ్తోంది. హైదరాబాద్ నగరంలో సొంత ఇల్లు ఉండాలనుకునే వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. దీంతో నగరం నలువైపులా ఇళ్లకు మంచి డిమాండ్ ఉంది. అపార్ట్‌మెంట్లతో పాటు ఇండిపెండెండ్ ఇళ్లకు మంచి గిరాకీ ఉంది. ఈ క్రమంలోనే ధరలు సైతం భారీగా పెరుగుతున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2025-26 జూలై- సెప్టెంబర్ త్రైమాసికంలో హైదరాబాద్ నగరంలో ఇళ్ల ధరలు భారీగా పెరిగాయి. సగటున 8 శాతం మేర ధరలు పెరిగినట్లు ప్రముఖ స్థిరాస్తి కన్సల్టెంట్ కంపెనీ అనరాక్ ఓ నివేదిక విడుదల చేసింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే జూలై- సెప్టెంబర్ త్రైమాసికంలో చదరపు అడుగు ధర రూ.7,150 వద్ద ఉన్నట్లు తెలిపింది. దేశంలోని 7 ప్రధాన నగరాల్లో ఇళ్ల ధరలపై ఈ నివేదిక రూపొందించింది. 7 నగరాల్లో చూసుకుంటే చదరపు అడుగు సగటు రేటు ఏడాదిలోనే ఏకంగా 9 శాతం పెరిగి రూ.8390 నుంచి రూ.9105 వద్దకు చేరినట్లు తెలిపింది. 7 నగరాల్లో ఇళ్ల ధర ఇలాహైదరాబాద్ నగరంలో జూలై- సెప్టెంబర్ 2024- 25లో చదరపు అడుగు ధర రూ. 7150 వద్ద ఉండగా 8 శాతం పెరిగి రూ.7750 వద్దకు చేరుకుంది. ఢిల్లీ-ఎన్‌సీఆర్ ప్రాంతంలో 24 శాతం వృద్ధితో రూ. 7200 నుంచి రూ. 8900 వద్దకు చేరింది. ముంబై-ఎంఎంఆర్ ప్రాంతంలో 6 శాతం పెరిగి రూ. 16,300 నుంచి రూ. 17,230 వద్దకు చేరింది. బెంగళూరు నగరంలో 10 శాతం ధరలు పెరిగాయి. గతేడాది రూ. 8100 వద్ద ఉండగా ఇప్పుడు రూ. 8870 వద్దకు ధర పెరిగింది. పుణె నగరంలో చదరపు అడుగు ధర 4 శాతం పెరిగి రూ. 7600 నుంచి రూ. 7935 వద్దకు చేరింది.చెన్నై నగరంలో చదరపు అడుగు ధర 5 శాతం పెరిగి రూ. 6680 నుంచి రూ. 7010 వద్దకు పెరిగింది. కోల్‌కతా ప్రాంతంలో చదరపు అడుగు రేటు 6 శాతం వృద్ధితో రూ. 5700 నుంచి రూ. 6060 వద్దకు ఎగబాకింది.