లక్కీ ఛాన్స్.. 50 షేర్లు ఉచితంగా ఇస్తోన్న కంపెనీ.. అప్పర్ సర్క్యూట్ కొట్టిన స్టాక్

Wait 5 sec.

: స్మాల్ క్యాప్ కేటగిరిలోని టెలికాం సెక్టార్ సంస్థ వాలియాంట్ కమ్యూనికేషన్స్ లిమిటెడ్ (Valiant Communications Limited) తమ షేర్ హోల్డర్లకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఈ కంపెనీ బోర్డు ఆఫ్ డైరెక్టర్స్ కొద్ది రోజుల క్రితమే జారీ చేయడానికి ఆమోదం తెలిపారు. ఈ బోనస్ షేర్ల రికార్డ్ తేదీ అక్టోబర్ 10గా నిర్ణయించారు. ఆ రోజున కంపెనీ షేర్లు ఎక్స్-బోనస్ ట్రేడింగ్ చేస్తాయి. ఆలోపు షేర్లు కొన్న వారికి ఉచితంగా బై టు గెట్ వన్ రూపంలో షేర్లు లభిస్తాయి. మరోవైపు ఈ కంపెనీ స్టాక్ గత ఆరు నెలల్లోనే సుమారు 137 శాతం లాభాన్ని షేర్ హోల్డర్లకు అందించి మల్టీబ్యాగర్ స్టాక్స్‌లో ఒకటిగా మారింది. అలాగే శుక్రవారంతో ముగిసిన ట్రేడింగ్ సెషన్లో ఈ కంపెనీ స్టాక్ 5 శాతం లాభంతో అప్పర్ సర్క్యూట్ కొట్టింది. అంతే కాదు సరికొత్త 52 వారాల గరిష్ఠ స్థాయిని చేరుకుని తమ ఇన్వెస్టర్లపై కాసుల వర్షం కురిపించింది. బోనస్ షేర్ల రికార్డ్ తేదీ సమీపిస్తున్న క్రమంలో ఈ స్టాక్ ఫోకస్ లోకి వచ్చింది. కంపెనీ ఎక్స్చేంజ్ ఫైలింగ్ ప్రకారం.. 1:2 రేషియోలో బోనస్ షేర్లు ఇచ్చేందుకు కంపెనీ డైరెక్టర్స్ ఇటీవలే సిఫార్స్ చేశారు. అంటే నిర్దేశిత రికార్డు డేట్ నాటికి రూ. 10 ఫేస్ వ్యాల్యూ ఉన్న 2 ఈక్విటీ షేర్లను తమ డీమ్యాట్ ఖాతాలో కలిగి ఉన్నవారికి అదనంగా రూ. 10 ఫేస్ వ్యాల్యూ ఉండే 1 ఈక్విటీ షేరును బోనస్ రూపంలో ఉచితంగా ఇస్తారు. క్రితం రోజు స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ ముగిసే నాటికి వాలియాంట్ కమ్యూనికేషన్స్ షేరు 5 శాతం లాభంతో రూ. 1107 వద్ద ముగిసింది. ఈ స్టాక్ 52 వారాల గరిష్ఠ ధర సైతం ఇదే కావడం గమనార్హం. అలాగే 52 వారాల కనిష్ఠ ధర రూ. 322.07 వద్ద ఉంది. గత వారం రోజుల్లో ఈ స్టాక్ 17 శాతం లాభాన్ని ఇచ్చింది. గత నెల రోజుల్లో 18 శాతం పెరిగింది. గత ఆరు నెలల్లో137 శాతం లాభాన్ని ఇచ్చింది. గత ఏడాది కాలంలో 80 శాతం లాభాన్ని అందించింది. గత ఐదేళ్లలో 2710 శాతం లాభాన్ని ఇచ్చింది. లక్ష రూపాయలు పెట్టిన వారికి ఏకంగా రూ.28 లక్షలు అందించింది. ప్రస్తుతం ఈ కంపెనీ మార్కెట్ విలువ రూ. 844 కోట్ల వద్ద ఉంది.