: స్మాల్ క్యాప్ కేటగిరిలోని ఇన్‌ఫ్రా సెక్టార్ కంపెనీ (AGI Infra Limited) తమ వాటాదారులకు బంపర్ ఆఫర్ తెచ్చింది. ఈ కంపెనీ బోర్డు డైరెక్టర్స్ 1:5 రేషియోలో చేసేందుకు ఆమోదం తెలిపారు. రికార్డు డేట్ అక్టోబర్ 10గా నిర్ణయించినట్లు కంపెనీ వెల్లడించిన క్రమంలో ఈ స్టాక్ ఫోకస్‌లోకి వచ్చింది. మరో 5 రోజుల్లో ఈ షేర్లు ఎక్స్ - స్ప్లిట్ ట్రేడింగ్ చేయనున్నాయి. ప్రస్తుతం ఈ కంపెనీ స్టాక్ సరికొత్త 52 వారాల గరిష్ఠ స్థాయిలో ట్రేడవుతోంది. అంతే కాదు ఈ కంపెనీ షేరు గత ఏడాదిలో తమ షేర్ హోల్డర్లకు 198 శాతం లాభాన్ని ఇచ్చి మల్టీబ్యాగర్ స్టాక్స్‌లో చోటు దక్కించుకుంది. కంపెనీ ఎక్స్చేంజ్ ఫైలింగ్ ప్రకారం.. ఇటీవలే జరిగిన కంపెనీ బోర్డు ఆఫ్ డైరెక్టర్ల భేటీలో 1:5 రేషియోలో స్టాక్ స్ప్లిట్ చేయడానికి ఆమోదం లభించింది. దీని అర్ధం ప్రస్తుతం రూ. 5 ఫేస్ వ్యాల్యూ ఉన్న ఒక ఈక్విటీ షేరును రూ. 1 ఫేస్ వ్యాల్యూ ఉండేలా 5 ఈక్విటీ షేర్లుగా విభజిస్తారు. ఈ స్టాక్ స్ప్లిట్ అర్హులైన షేర్ హోల్డర్లను నిర్ణయించే రికార్డు డేట్ అక్టోబర్ 10, 2025గా నిర్ణయించింది కంపెనీ.ఈరోజు ట్రేడింగ్‌లో ఈ కంపెనీ స్టాక్ లాభాల్లో కొనసాగుతోంది. ఒక దశలో సరికొత్త 52 వారాల గరిష్ఠ ధర రూ.1408ని తాకింది. అలాగే 52 వారాల కనిష్ఠ స్థాయి రూ. 443 వద్ద ఉంది. గత వారం రోజుల్లో ఈ స్టాక్ దాదాపు 10 శాతం లాభాన్ని అందించింది. గత నెల రోజుల్లో ఈ షేరు 19 శాతం లాభాన్ని ఇచ్చింది. గత ఆరు నెలల్లో 99 శాతం లాభాలు అందించింది. గత ఏడాది కాలంలో 200 శాతం లాభాన్ని ఇచ్చింది. గత ఐదు సంవత్సరాల్లో 218 శాతం లాభాలు ఇచ్చింది. ఈ కంపెనీ మార్కెట్ క్యాప్ ప్రస్తుతం రూ. 3380 కోట్ల వద్ద ఉంది. బడ్జెట్ ధర ఇళ్లు, అపార్ట్మెంట్లు, పెంట్ హౌసులు, ఆఫీస్ స్థలాల వంటి రెసిడెన్షియల్, కమర్షియల్ ప్రాజెక్టులు చేపడుతుంది. 2005వ సంవత్సరంలో ఈ కంపెనీని ప్రారంభించారు. ప్రస్తుతం పంజాబ్ రాష్ట్రంలోని జలంధర్ ప్రధాన కేంద్రంగా తమ కార్యకలాపాలు నిర్వహిస్తుంది.