లో రనౌట్ డ్రామా హైలెట్ అయింది. కొలంబోలోని ఆర్.ప్రేమదాసా స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో పాక్ ఓపెనర్ రనౌట్ అందర్నీ డైలమాలో పడేసింది. మొదట అప్పీల్ చేసినప్పుడు నాటౌట్‌గా ప్రకటించిన థర్డ్ అంపైర్, మళ్లీ రెండోసారి అవుట్‌గా ఇచ్చాడు. దాంతో టీమిండియా ఫుల్ హ్యాపీ అవ్వగా.. పాకిస్తాన్ మాత్రం షాక్‌లోకి వెళ్లింది. పాక్ కెప్టెన్ ఫాతిమా సనా మాత్రం అంపైర్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అసలు ఏం జరిగిందంటే.. పాకిస్తాన్ ఇన్నింగ్స్ నాలుగో ఓవర్‌లో క్రాంతి గౌడ్ తన ఆఖరి బంతిని బౌల్ చేసింది. ఆ బంతి నేరుగా బ్యాటర్ ప్యాడ్స్ తగలడంతో అందరూ ఎల్‌బీడబ్ల్యూకి అప్పీల్ చేశారు. ఈలోపే మునీబా క్రీజ్ బయటకు వెళ్లిపోయి తిరిగి రావడానికి ప్రయత్నించింది. ఆమె బ్యాట్ మొదట క్రీజ్‌కి తాకినప్పటికీ, అదే క్షణంలో దీప్తి శర్మ చాకచక్యంగా స్టంప్స్‌ను డైరెక్ట్ హిట్ చేసింది.మొదట థర్డ్ అంపైర్ నాటౌట్ అని సూచించినప్పటికీ, మరోసారి రీప్లేలు పరిశీలించిన తర్వాత అంపైర్ కెరిన్ క్లాస్ట్ నిర్ణయం మార్చి, బంతి స్టంప్స్‌ను తాకే సమయంలో బ్యాట్ నేలని తాకలేదని తేల్చి అవుట్‌గా ప్రకటించారు. ఈ నిర్ణయం పాకిస్తాన్ శిబిరాన్ని షాక్‌కు గురిచేసింది. కెప్టెన్ ఫాతిమా సనా సూటిగా డ్రెస్సింగ్‌రూమ్‌ నుంచి బయల్దేరి, ఫోర్త్ అంపైర్‌తో తీవ్ర వాదనకు దిగారు. ఈ సంఘటనతో మ్యాచ్ కొద్ది సేపు నిలిచిపోయింది. ఎల్‌బీడబ్ల్యూ రివ్యూ కూడా ఆమెకు వ్యతిరేకంగా వచ్చి, డబుల్ అవుట్‌గా మారింది. ఈ నిర్ణయంతో మునీబా షాక్‌లో పడగా, అంపైర్‌ను వివరణ కోరింది. చివరకు నిరుత్సాహంగా పెవిలియన్‌కి నడిచి వెళ్లింది. సోషల్ మీడియాలోనూ ఈ అవుట్‌పై తీవ్ర చర్చ నెలకొంది. అయితే క్రికెట్ నిబంధనల ప్రకారం.. బ్యాటర్ రన్ తీయడానికో, లేక డైవ్ చేసిన సమయంలో బ్యాట్ గాల్లో ఉంటే అవుట్‌గా పరిగణిస్తారు. ఓపెనర్ మునీబా త్వరగా అవుటవ్వడంతో 248 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్ కేవలం 159 పరుగులకే ఆలౌట్ అయింది. గూగుల్ ట్రెండ్స్‌లో మునీబా అలీ:పాకిస్థాన్ బ్యాటర్ అనూహ్య రీతిలో రనౌట్ కావడంతో.. ఇది ఔటా కాదా అనే విషయమై చర్చ నడిచింది. దీంతో మునీబా అలీ రనౌట్ గురించి వివరాలు తెలుసుకోవడం నెటిజన్లు గూగుల్‌లో వెతికారు. దీంతో మునీబా అలీ కీవర్డ్ 2 లక్షలకుపైగా సెర్చ్ వాల్యూమ్‌తో గూగుల్ ట్రెండ్స్‌లో నిలిచింది. జమ్మూ కశ్మీర్, ఒడిశా, దాద్రానగర్ హవేలీ, గుజరాత్, రాజస్థాన్‌లకు చెందిన వారు ఎక్కువగా మునీబా అలీ గురించి గూగుల్‌లో వెతికారు.