ఎయిరిండియా, ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ హోలీ సేల్.. టికెట్లపై వేలల్లో డిస్కౌంట్స్.. మార్చి 5 వరకు ఆఫర్!

Wait 5 sec.

: విమాన ప్రయాణాలపై కొంత కాలంగా పలు ఎయిర్‌లైన్స్.. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో స్పెషల్ డిస్కౌంట్స్, క్యాష్ బ్యాక్స్, లిమిటెడ్ పీరియడ్‌కు తక్కువ ధరకే విమాన టికెట్లు వంటివి ఆఫర్ చేస్తున్నాయి. ఎక్కువగా న్యూ ఇయర్, రిపబ్లిక్ డే, హోలీ, సమ్మర్, వింటర్, ఇండిపెండెన్స్ డే, దీపావళి, క్రిస్మస్ ఇలా ప్రత్యేక సందర్భాల్లో స్పెషల్ సేల్స్ లాంఛ్ చేస్తుంటాయి. ప్రముఖ ఎయిర్‌లైన్స్ ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ ఇటీవల పే డే సేల్ ప్రకటించగా.. ఇప్పుడు హోలీ సందర్భంగా స్పెషల్ లాంఛ్ చేసింది. ఇక్కడ ఫ్లైట్ టికెట్లపై తగ్గింపుల్ని ప్రకటించింది. HOLISALE కోడ్‌తో దేశీయ విమాన ప్రయాణాలపై ఫ్లాట్ రూ. 350 తగ్గింపు వర్తిస్తుందని.. ఇంటర్నేషనల్ ఫ్లైట్లలో రూ. 500 తక్షణ తగ్గింపు ఉంటుందని స్పష్టం చేసింది. ఇదే సమయంలో నెట్ బ్యాంకింగ్ ద్వారా టికెట్ బుక్ చేస్తే కన్వినియెన్స్ ఫీజు ఉండదని వెల్లడించింది. >> ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ అధికారిక వెబ్‌సైట్ లేదా అఫీషియల్ మొబైల్ అప్లికేషన్ ద్వారా బుక్ చేసినప్పుడు ఈ ఆఫర్ వర్తిస్తుందని స్పష్టం చేసింది. డిస్కౌంట్ ఇంకా బేస్ ఫేర్‌పై వర్తిస్తుంది. 2026 ఫిబ్రవరి 28 నుంచి మార్చి 5 వరకు టికెట్లు బుక్ చేసుకునేందుకు అవకాశం కల్పించింది. ఇప్పుడు టికెట్లు బుక్ చేసుకున్నవారు 2026 ఫిబ్రవరి 28 నుంచి ఏప్రిల్ 30 వరకు ఎప్పుడైనా ప్రయాణించేందుకు వీలు కల్పిస్తోంది. ఇది పరిమిత కాల ఆఫర్ కాబట్టి ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ బేసిస్‌లో టికెట్లు కేటాయిస్తారు. సీట్లు పరిమిత స్థాయిలోనే ఉంటాయి. ఇంకా అన్ని తేదీల్లో అన్ని ఫ్లైట్లలో అందుబాటులో ఉండకపోవచ్చు. . మరోవైపు ఎయిరిండియా కూడా హోలీ సందర్భంగా స్పెషల్ సేల్ ప్రకటించింది. ఇక్కడ గరిష్ఠంగా విమాన టికెట్లపై రూ. 3 వేల వరకు ఆదా చేసుకునే అవకాశాన్ని కల్పిస్తోంది. ఇక్కడ కూడా కోడ్ HOLISALE అని పేర్కొంది. మార్చి 5 లోపు టికెట్లు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. డిస్కౌంట్ బేస్ ఫేర్‌పైనే వర్తిస్తుంది. వన్ వే, రౌండ్ ట్రిప్ జర్నీలకు ఈ ఆఫర్ వర్తిస్తుంది. రూ. 3 వేలు గరిష్ఠ డిస్కౌంట్.. మీ బుకింగ్‌ను బట్టి ఇది ఎంతైనా ఉండొచ్చని ఎయిర్‌లైన్స్ స్పష్టం చేసింది. ఈ ఆఫర్‌లో గ్రూప్ బుకింగ్స్‌కు అవకాశం లేదు. ఎయిరిండియా వెబ్‌సైట్ లేదా అధికారిక యాప్ నుంచే టికెట్లు బుక్ చేసుకోవాలి. .