ఇరాన్ సీక్రెట్ అణు స్థావరం ధ్వంసం.. ఇజ్రాయెల్ ప్రకటన

Wait 5 sec.

పశ్చిమాసియాలో యుద్ధం భీకరంగా సాగుతోంది.రోజు రోజుకూ దిగజారుతున్నాయి. ఇరాన్‌పై ఇజ్రాయెల్ దాడులను మరింత తీవ్రతరం చేసింది. ఈ నేపథ్యంలో ఇరాన్‌ రహస్య భూగర్భ అణు స్థావరాన్ని ధ్వంసం చేసినట్లు ఇజ్రాయెల్‌ డిఫెన్స్ ఫోర్సెస్ ప్రకటించాయి. టెహ్రాన్‌ శివారులోని మింజాదెహైలో రహస్యంగా ఏర్పాటుచేసిన అణ్వాయుధ కేంద్రంపై దాడి చేసినట్లు ఐడీఎఫ్‌ ప్రతినిధి డెఫ్రిన్ వెల్లడించారు. ఇందులో అణు కార్యక్రమాలను శాస్త్రవేత్తలు రహస్యంగా సాగిస్తున్నట్టు తమకు సమాచారం వచ్చిందని తెలిపారు. జూన్ 2025లో తమ దాడుల అనంతరం తన అణు ప్రాజెక్ట్‌ను ఇరాన్ ఇక్కడికి తరలించిందని ఆయన పేర్కొన్నారు. తొలి రోజే మరణించిన విషయం తెలిసిందే. ఆయన ఉండే ప్రదేశంపై 30 బాంబులను ఇజ్రాయెల్ వేసింది.జూన్‌ 2025లో అమెరికాతో కలిసి ఇరాన్‌పై ‘ఆపరేషన్ రైజింగ్ లయన్’ పేరుతో 12 రోజుల పాటు ఇజ్రాయెల్ చేపట్టిన దాడుల గురించి డెఫ్రిన్ ప్రస్తావించారు. ఆనాటి దాడులకు వినియోగించిన పేలుడు పదార్థాలు, మందుగుండు కంటే ఎక్కువ మొత్తంలో ఇరాన్‌పై ఈ నాలుగు రోజుల్లో ప్రయోగించినట్టు ఆయన తెలియజేశారు. అణు స్థావరాలను ధ్వంసం చేసినప్పటికీ కార్యకలాపాలను కొనసాగిస్తూ అణ్వాయుధాలను ఆ దేశం అభివృద్ధి చేస్తోందని డెఫ్రిన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. టెహ్రాన్ శివార్లలోని రహస్య స్థావరంలో వాటిని భద్రపరిచినట్టు తమకు పక్కా సమాచారం అందడంతో ఆ ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకుని దాడులు చేపట్టినట్టు వివరించారు.గతవారం దాడులు ప్రారంభించినప్పటి నుంచి తమ వైమానిక దాడుల్లో ఇరాన్‌కు చెందిన 300 క్షిపణి ప్రయోగ కేంద్రాలను తాకాయని ఇజ్రాయెల్ రక్షణ దళ అధికార ప్రతినిధి పేర్కొన్నారు. ఇరాన్ బాలిస్టిక్ క్షిపణి, వైమానిక రక్షణ వ్యవస్థలే లక్ష్యంగా తమ వైమానిక దాడులు కొనసాగుతున్నట్టు తెలిపారు. తాజా దాడులకు సంబంధించిన దృశ్యాలను సామాజిక మాధ్యమాల్లో షేర్‌ చేసింది. కాగా, టెహ్రాన్‌కు దక్షిణాన ఉన్న నంతాజ్ అణు స్థావరంపై కూడా ఇజ్రాయెల్ దాడిచేసినట్టు అంతర్జాతీయ అణు శక్తి సంస్థ ధ్రువీకరించింది. అయితే, అక్కడ ఎటువంటి రేడియో ధార్మికత విడుదలైన సంకేతాలు లేవని, ప్రస్తుతం ముప్పు లేదని నిర్దారించింది. గత శనివారం నుంచి ఇప్పటి వరకూ ఇరాన్‌పై 4000 బాంబులు, 1,600 యుద్ధ విమానాలతో దాడులు చేసింది.