Bonus Shares: స్మాల్ క్యాప్ కేటగిరిలోని ఐటీ సెక్టార్ కంపెనీ యాక్సిడెర్ లిమిటెడ్ () ఇటీవలే బంపర్ ఆఫర్ తెచ్చింది. ఈ సంస్థ బోర్డు ఆఫ్ డైరెక్టర్స్ తమ షేర్ హోల్డర్లకు 1:10 రేషియోలో బోనస్ షేర్లు జారీ చేసేందుకు ఆమోదం తెలుపారు. రికార్డు డేట్ మార్చి 06గా నిర్ణయించారు. అంటే శుక్రవారం రోజున షేర్లు ఎక్స్-బోనస్ ట్రేడ్ చేయనున్నాయి. మార్చి 5వ తేదీ మార్కెట్లు ముగిసే నాటికి షేర్లు కొన్నవారికి అర్హత ఉంటుంది. ఈ కంపెనీ షేర్ గత వారం రోజుల్లో 21 శాతం లాభాన్ని అందించింది. యాక్సిడెర్ లిమిటెడ్ అనేది రూ. 100 లోపు ధర ఉన్న పెన్నీ స్టాక్.కంపెనీ ఎక్స్చేంజ్ ఫైలింగ్ ప్రకారం కంపెనీ బోర్డు డైరెక్టర్స్ సమావేశంలో 1:10 రేషియోలో బోనస్ షేర్ల జారీ చేయడానికి ఆమోదం లభించింది. దీని అర్ధం రికార్డు తేదీ నాటికి రూ. 10 ఫేస్ వ్యాల్యూ ఉన్న 10 ఈక్విటీ షేర్లను కొనుగోలు చేసిన తమ డీమ్యాట్ అకౌంట్లో కలిగి ఉన్నవారికి అదనంగా రూ. 10 ఫేస్ వ్యాల్యూ ఉండే 1 ఈక్విటీ షేరుని ఉచితంగా బోనస్ రూపంలో జారీ చేస్తారు. ఈ బోనస్ షేర్లు అందుకునేందుకు అర్హులైన షేర్ హోల్డర్లను నిర్ణయించే రికార్డు డేట్ మార్చి 6, 2026గా నిర్ణయించారు.క్రితం రోజు స్టాక్ మార్కెట్ ముగిసిన ట్రేడింగ్ సెషన్లో యాక్సిడెర్ లిమిటెడ్ షేరు 5 శాతం లాభంతో అప్పర్ సర్క్యూట్ రూ. 55.52 తాకింది. ఈరోజు మార్చి 5వ తేదీన సైతం ఈ స్టాక్ 5 శాతం పెరిగి అప్పర్ సర్క్యూట్ రూ. 58.29ని తాకింది. ఈ షేరు 52 వారాల గరిష్ఠ ధర రూ. 97.46 గా, 52 వారాల కనిష్ఠ ధర రూ. 42.11 వద్ద ఉన్నాయి. గత నెల రోజుల్లో 14 శాతం పడిపోయింది. గత ఆరు నెలల్లో 18 శాతం నష్టాన్ని మిగిల్చింది. గత ఏడాదిలో 18 శాతం నష్టాన్ని మిగిల్చింది. గత ఐదేళ్లలో 619 శాతం లాభాన్ని అందించింది. లక్ష రూపాయల పెట్టుబడిని ఐదేళ్లలో రూ. 7.19 లక్షలు చేసింది. ప్రస్తుతం ఈ కంపెనీ మార్కెట్ విలువ రూ. 26.16 కోట్ల వద్ద ఉంది.