22K Gold Price: అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధం జరుగుతున్నప్పటికీ బంగారం ధరలు తగ్గుతుండడం భారీ ఊరట కల్పిస్తోంది. ఇలాంటి సంక్షోభ సమయంలో బంగారం ధరలు పెరుగుతాయి. అయితే, ప్రస్తుతం గోల్డ్ రేట్లు భారీగా దిగివస్తున్నాయి. ఇందుకు ప్రధానంగా కరెన్సీ మార్పులు, మార్కెట్ లిక్విడిటీ, డాలర్ విలువ పెరగడం వంటివి కీలకంగా మారుతున్నాయని మల్టీనేషనల్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్, ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీ మోర్గాన్ స్టాన్లీ విశ్లేషణ చేసింది. ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు తగ్గించే అవకాశం లేదన్న అంశం సైతం బంగారం ధరలపై ప్రభావం చూపిస్తున్నట్లు తెలుస్తోంది. మార్కెట్ ఒత్తిడి సమయంలో పెట్టుబడిదారులు క్యాష్ అవసరాల కోసం బంగారాన్ని విక్రయిస్తున్నట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే, రాజకీయ, భౌగోళిక ఉద్రిక్తతలు ఇలాగే కొనసాగితే బంగారం ధరలు మళ్లీ పెరగవచ్చంటున్నారు. ఈ క్రమంలో మార్చి 5వ తేదీన ప్రముఖ జువెలరీలైన తనిష్క్, మలబార్ వంటి వాటిల్లో ఆభరణాల బంగారం రేట్లు తెలుసుకుందాం. దేశీయ మార్కెట్లో గత నాలుగు రోజులుగా బంగారం ధరలు తగ్గుతున్నాయి. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం రేటు తులంపై ఏకంగా రూ.10,210 మేర తగ్గింది. ఇక 22 క్యారెట్ల బంగారం రేటు తులంపై రూ.9,350 మేర దిగివచ్చింది. ఈరోజు ఒక్కరోజే 2 క్యారెట్ల గోల్డ్ రేటు తులంపై రూ.1630 తగ్గగా 22 క్యారెట్ల బంగారం రేటు తులానికి రూ.1500 మేర దిగివచ్చింది. తనిష్క్ జువెలరీల్లో గోల్డ్ రేటుతనిష్క్ జువెలరీల్లో మార్చి 5వ తేదీన 22 క్యారెట్ల బంగారం రేటు 1 గ్రాముకు రూ.150 మేర తగ్గింది. దీంతో గ్రాము గోల్డ్ రేటు రూ.14,970 వద్దకు దిగివచ్చింది. దీంతో 10 గ్రాముల బంగారం రేటు రూ.1,49,700 వద్దకు దిగివచ్చింది. మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్‌లోమలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్‌లో ఈరోజు 22 క్యారెట్ల ఆభరణాల బంగారం రేటు 1 గ్రాముకు రూ.180 మేర తగ్గింది. దీంతో గ్రాము గోల్డ్ రేటు రూ.14,930 వద్దకు తగ్గింది. ఇక తులం బంగారం రేటు రూ.1,49,300 వద్ద ట్రేడవుతోంది. జొయాలుక్కాస్‌లో జొయాలుక్కాస్ జువెలరీల్లో ఈరోజు 22 క్యారెట్ల నగల బంగారం రేటు 1 గ్రాముకు రూ.180 మేర తగ్గింది. దీంతో గ్రాము గోల్డ్ రేటు రూ.14,930 వద్ద ట్రేడవుతోంది. ఇక 10 గ్రాములకు లెక్కవేస్తే రూ.1,49,300 వద్దకు తగ్గింది. కల్యాణ్ జువెలరీల్లోక దీంతో గ్రాము గోల్డ్ రేటు రూ.14,990 వద్ద ఉంది. తులం రేటు రూ.1,49,900 పలుకుతోంది. లలితా జువెలరీల్లోలలితా జువెలరీల్లో ఈరోజు నగల తయారీ బంగారం (22 క్యారెట్ల బంగారం) రేటు గ్రాముకు రూ. 150 మేర తగ్గింది. దీంతో 1 గ్రాము గోల్డ్ రేటు రూ.14,930 వద్ద ట్రేడవుతోంది. ఇక తులం రేటు చూసుకుంటే రూ.1,49,300 వద్ద ఉంది.