బిగ్‌బాస్ సీజన్ -9 విన్నర్ కళ్యాణ్ పడాల షో అయిపోయిన తర్వాత ఇంటర్వ్యూలు, షాపింగ్ మాల్ ఓపెనింగ్స్, షోలు అంటూ ఫుల్ బిజీగా ఉన్నాడు. అలానే షో ముగిసి రెండు నెలలు దాటినా ఇప్పటికీ సోషల్ మీడియాలో కళ్యాణ్ ఫాలోయింగ్ ఏమాత్రం తగ్గలేదు. ముఖ్యంగా స్టార్ మా షోలకి కళ్యాణ్ వస్తే రేటింగ్, ప్రోమోల రీచ్ గట్టిగా ఉంది. దీంతో బీబీ జోడీ సీజన్-2లోకి కూడా కళ్యాణ్‌ని గెస్టుగా రప్పించారు.బీబీ జోడీ 2లో ఈ వారం సెలబ్రెటీ గెస్ట్ రౌండ్ జరిగింది. ఇందులో భాగంగా . ప్రియాంక సింగ్-మణికంఠ తమ పెర్ఫామెన్స్ కోసం కళ్యాణ్ పడాలని తీసుకొచ్చారు. బీబీ జోడీ చేసే అదృష్టం రాలేదు కానీ కనీసం బీబీ జోడీ స్టేజ్ మీదకి వచ్చే అదృష్టం వచ్చింది.. అంటూ కళ్యాణ్ చెప్పాడు.పింకీకి గాయంఒక్క నిమిషం మరి ఏమైంది ఎందుకు రాలేదని సదా అడిగారు. టైటిల్ విన్ అయ్యాడు బయటికి రాగానే ఫ్యాన్స్, ఫొటోషూట్స్.. అంటూ కళ్యాణ్‌ని ఆటపట్టించాడు ప్రదీప్. ఇక ముగ్గురూ కలిసి "నాది నక్కిలీసు గొలుసు" పాటకి డ్యాన్స్ చేశారు. డ్యాన్స్ అంతా చాలా ఎనర్జిటిక్‌గా చేశారు కానీ ప్రోమో చివరిలో పింకీని పైకి ఎత్తుకోబోయి కళ్యాణ్ కిందపడేశాడు. ఊహించని ఈ ఘటనతో అందరూ అవాక్కయ్యారు. పింకీకి అయితే గట్టిగనే దెబ్బ తగిలినట్లు అనిపిస్తుంది. కళ్యాణ్ కూడా అనుకోకుండా జరిగిన తప్పుకి తనని తానే గాయపరుచుకుంటూ స్టేజ్ మీద కోపంతో కొట్టాడు. ఇదంతా చూసి వెంటనే పింకీ దగ్గరికి అందరూ వచ్చారు. మరి పింకీకి ఏమైన గాయం అయిందా .. లేక బానే ఉందా అనేది ఎపిసోడ్‌లో చూడాలి. నిజానికి బిగ్‌బాస్ సీజన్-9 నుంచి రెండు జోడీలని బీబీ జోడీ 2 కోసం ట్రై చేశారట. అందులో ఒక జోడీ డీమాన్ పవన్-రీతూ చౌదరి కాగా మరొక జోడీ కళ్యాణ్ పడాల-తనూజ గౌడ. అయితే డీమాన్-రీతూ వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ అంతే త్వరగా ఎలిమినేట్ కూడా అయ్యారు. కానీ కళ్యాణ్-తనూజ జోడీ మాత్రం షోకి రాలేదు. దీంతో కళ్యాణ్ ఇలా గెస్టు ఎంట్రీ ఇచ్చాడు. కానీ ఇలా అనుకోకుండా ఈ పెర్ఫామెన్స్‌లో ఇలా జరిగింది. అయితే ప్రోమో కింద మాత్రం కళ్యాణ్‌కి సపోర్ట్ చేస్తూ ఆడియన్స్ తెగ కామెంట్లు పెడుతున్నారు. ఫర్లేదు కళ్యాణ్ అప్పుడప్పుడూ అలా అవుతుంటాయ్.. ఏం కాదంటూ కామెంట్లు చేస్తున్నారు.