మహిళల వస్త్రధారణపై టాలీవుడ్ లో గత కొన్నాళ్లుగా చర్చలు జరుగుతున్నాయి. చేసిన తర్వాత, ఇది వివాదంగా మారిపోయింది. ఈ అంశంపై నెటిజన్లు రెండు వర్గాలుగా చీలిపోయారు. కొందరు శివాజీకి సపోర్ట్ చేస్తే, మరికొందరు ఆయన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. మహిళలు ఎలాంటి దుస్తులు వేసుకోవాలి? ఎలాంటి బట్టలు వేసుకోకూడదు? అంటూ ఎవరి అభిప్రాయాలు వాళ్లు వ్యక్తం చేస్తున్నారు. తాజాగా నటి ఈ వివాదంపై స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. విలక్షణమైన నటనతో ప్రేక్షకులను అలరించిన వరలక్ష్మీ శరత్ కుమార్.. ఇప్పుడు 'సరస్వతి' సినిమాతో డైరెక్టర్ గా మారారు. ఆమె ప్రధాన పాత్రలో నటిస్తూ, దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఫిబ్రవరి 6న రిలీజ్ కానుంది. ఈ మూవీ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న వరు.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో డైరెక్టర్ గా తన మారడం గురించి మాట్లాడారు. నటనతో పోలిస్తే దర్శకత్వం చాలా భిన్నమని, యాక్టింగ్ చేయాలంటే తన పాత్రపై దృష్టి పెడితే సరిపోతుందని, కానీ దర్శకత్వంలో మొత్తం సినిమాను చూసుకోవాల్సి వస్తుందని తెలిపారు. ఈ క్రమంలో ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలో నటీమణుల డ్రెస్సింగ్‌పై వస్తున్న కామెంట్స్ గురించి కూడా ఆమె తన అభిప్రాయాలను వెల్లడించారు. వ్యక్తిగత స్వేచ్ఛను గౌరవించాలని చెప్పారు.''మీకొక చెల్లి ఉంటే, ఆమె షార్ట్ వేసుకొని బయటికి వెళ్తే రేప్ చేయాలని మీకు అనిపిస్తుందా? మీరు లేడీస్ డ్రెస్సింగ్‌ని ఎలా బ్లేమ్ చేస్తారు?. మగాళ్లు జీన్స్ ప్యాంట్ వేసుకొని వంగితే మొత్తం కనిపిస్తుంది. దానిపై ఎవరూ ఎగబడట్లేదు కదా?. అది ఒక బేసిక్ ఇన్నర్ వేర్. మీ చెడ్డీలు బయటకి కనపడితే తప్పు లేదు, కానీ ఒక మహిళ బ్రా స్ట్రాప్ బయటకి కనిపిస్తే మాత్రం 'అయ్యయ్యో.. లైఫ్ మొత్తం పోయింది' అన్నట్లు మాట్లాడతారు. అసలు దాంట్లో తప్పేం ఉంది? అది ఒక ఇన్నర్ వేర్ అంతేకదా!. ఇక్కడ బేధం ఎందుకు?. అబ్బాయిల విషయంలో ఒకలా, అమ్మాయిల విషయంలో ఇంకోలా ఎందుకు ఆలోచిస్తున్నారు?'' అని వరలక్ష్మీ శరత్ కుమార్ ప్రశ్నించారు.* ''వాళ్ల బాడీ.. వాళ్ల ఛాయిస్. ఎలాంటి బట్టలు వేసుకోవాలని మనం జడ్జ్ చేయకూడదు. మీ చెల్లిని తల్లిని చూసినప్పుడు అలాంటి ఫీలింగ్ రానప్పుడు, బయటి మహిళలను చూసినప్పుడు ఎందుకు వస్తుంది మరి?. మహిళలకు రెస్పెక్ట్ ఇవ్వండి. 'వావ్.. వెరీ నైస్' అంటూ అందాన్ని ఆరాధించడంలో తప్పులేదు. కానీ లైన్ ని క్రాస్ చేయకూడదు'' అని వరలక్ష్మీ శరత్ కుమార్ పేర్కొన్నారు. మహిళల దుస్తులపై చర్చలు జరుగుతున్న వేళ, ఇప్పుడు వరలక్ష్మీ చేసిన ఈ కామెంట్స్ నెట్టింట చర్చనీయాంశంగా మారాయి.