లో అత్యంత కీలక దశకు టోర్నీ చేరుకుంది. గురువారం ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగే రెండో సెమీఫైనల్‌లో భారత్, ఇంగ్లండ్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో విజయం సాధించిన జట్టు ఫైనల్‌లో న్యూజిలాండ్‌ను ఎదుర్కోనుంది. సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలోని టీమిండియా సూపర్ 8 దశలో దక్షిణాఫ్రికా చేతిలో ఓటమి ఎదుర్కొన్నప్పటికీ ఆ తర్వాత జింబాబ్వే, వెస్టిండీస్‌పై అద్భుత విజయాలు సాధించి సెమీఫైనల్‌కు చేరుకుంది. మరోవైపు ఇంగ్లండ్ మాత్రం సూపర్ 8 దశలో ఆడిన అన్ని మ్యాచ్‌ల్లో విజయం సాధించి మంచి ఫామ్‌లో ఉంది.ఇలాంటి పరిస్థితుల్లో భారత్ ప్లేయింగ్ 11లో పెద్ద మార్పులు చేసే అవకాశం తక్కువగా కనిపిస్తోంది. వరుసగా రెండు విజయాలు సాధించిన జట్టును అలాగే కొనసాగించే అవకాశమే ఎక్కువగా ఉందని క్రికెట్ వర్గాలు భావిస్తున్నాయి. అయితే బౌలింగ్ విభాగంలో అదనపు స్పిన్నర్‌గా కుల్దీప్ యాదవ్‌ను తీసుకోవాలా అనే అంశంపై మాత్రం టీమ్ మేనేజ్‌మెంట్ ఆలోచిస్తోంది.ఓపెనింగ్ బాధ్యతను మరోసారి అభిషేక్ శర్మ, సంజు శాంసన్ జంటే చేపట్టే అవకాశముంది. గత మ్యాచ్‌లో సంజు శాంసన్ అద్భుత ప్రదర్శనతో జట్టును విజయానికి నడిపించాడు. వెస్టిండీస్‌పై అతను అజేయంగా 97 పరుగులు చేసి మ్యాచ్‌ను ఒంటిచేత్తో గెలిపించాడు. ఇక అభిషేక్ శర్మ ఇటీవల మ్యాచ్‌ల్లో పెద్దగా రాణించలేకపోయినా, సెమీఫైనల్‌లో తిరిగి ఫామ్ అందుకోవాలని చూస్తున్నాడు.మూడో స్థానంలో ఇషాన్ కిషన్ బ్యాటింగ్‌కు రావచ్చు. అతను కూడా కీలక ఇన్నింగ్స్ ఆడాలని టీమ్ ఆశిస్తోంది. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేయనున్నాడు. మధ్య వరుసలో తిలక్ వర్మ ఐదో స్థానంలో కీలక పాత్ర పోషించాల్సి ఉంటుంది.ఆల్‌రౌండర్ల విషయానికి వస్తే శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ త్రయం మళ్లీ జట్టులో కొనసాగడం ఖాయం అనిపిస్తోంది. ఇంగ్లండ్ వంటి బలమైన బ్యాటింగ్ లైనప్‌ను ఎదుర్కోవాలంటే వీరు బౌలింగ్‌లో కూడా మరింత సహకారం అందించాల్సి ఉంటుంది. బౌలింగ్ విభాగంలో జస్ప్రీత్ బుమ్రా, అర్షదీప్ సింగ్ ప్రధాన పేస్ బౌలర్లుగా ఉంటారు. స్పిన్ విభాగంలో వరుణ్ చక్రవర్తి స్పెషలిస్ట్ స్పిన్నర్‌గా కొనసాగే అవకాశముంది. అయితే కుల్దీప్ యాదవ్‌ను జట్టులోకి తీసుకురావాలా అనే అంశం ఇంకా స్పష్టత రాలేదు.వాంఖడే స్టేడియం పిచ్ సాధారణంగా బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండటం, స్పిన్నర్లకు పెద్దగా సహకారం లేకపోవడం వల్ల భారత్ అదనపు స్పిన్నర్‌ను ఆడించకపోవచ్చని అంచనాలు ఉన్నాయి. అందువల్ల విజేత కాంబినేషన్‌ను అలాగే కొనసాగించే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. ఈ కీలక సెమీఫైనల్‌లో భారత్ ఏ కాంబినేషన్‌తో బరిలోకి దిగుతుందో అన్నది అభిమానుల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది.భారత జట్టు అంచనాఅభిషేక్ శర్మ, సంజు శాంసన్, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, అర్షదీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి.