'గబ్బర్ సింగ్' తర్వాత , డైరెక్టర్ హరీష్ శంకర్‌ కాంబోలో తెరకెక్కుతున్న సినిమా ‘’. ఇందులో శ్రీలీల, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని సమ్మర్ స్పెషల్ గా మార్చి 26న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు ఇది వరకే ప్రకటించారు. దానికి తగ్గట్టుగానే ప్రమోషన్స్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఉన్నట్టుండి ఈ సినిమాని వారం ముందుగానే ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం సమకూర్చిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడీ ప్రాజెక్ట్ లోకి మరో మ్యూజిక్ డైరెక్టర్ తమన్‌ వచ్చి చేరాడు. ఈ మూవీకి ఆయన బ్యాగ్రౌండ్ స్కోర్ అందిస్తారని మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ అధికారికంగా ప్రకటించింది. . ఇద్దరు క్రేజీ మ్యూజిక్‌ డైరెక్టర్ల కలయిక అభిమానులకు ఎప్పటికీ మరిచిపోలేని జ్ఞాపకంగా నిలుస్తుందని తెలిపారు. సడన్ గా దేవిశ్రీ స్థానంలో తమన్ ని తీసుకోవడానికి కారణం సినిమాని ప్రీ పోన్ చేస్తుండటమే అనే టాక్ వినిపిస్తోంది.యష్ హీరోగా నటిస్తున్న ‘టాక్సిక్‌’ మూవీ వాయిదా పడిన సంగతి తెలిసిందే. మార్చి 19న రావాల్సిన ఈ చిత్రాన్ని జూన్ 4వ తేదీకి షిఫ్ట్ చేశారు. అయితే ఇప్పుడు ఆ డేట్ పై ఉస్తాద్ భగత్ సింగ్ కన్నేసినట్లుగా ప్రచారం జరుగుతోంది. ఫిబ్రవరి 26న రిలీజ్ చేయాల్సిన పవన్ కళ్యాణ్ సినిమాని, ఒక వారం ముందుగా థియేటర్లలోకి తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని సినీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఆ మేరకు డిస్ట్రిబ్యూటర్లకు ఇప్పటికే ప్రాథమిక సమాచారం వెళ్లిపోయిందని చెప్పుకుంటున్నారు. ఇప్పుడు ఉన్నఫళంగా మరో మ్యూజిక్ డైరెక్టర్ ను తీసుకోవడానికి ఇదే కారణమని అనుకుంటున్నారు.మార్చి మూడో వారంలో ఉగాది, రంజాన్ పండగలు వస్తున్నాయి. లాంగ్ వీకెండ్ కలిసొస్తుంది కాబట్టి, హిట్ టాక్ వస్తే బాక్సాఫీస్ దగ్గర రెండు వారాలు తిరుగుండదు. అదే సమయంలో ‘దురంధర్ 2’ తెలుగు వెర్షన్ రిలీజ్ ఉన్నప్పటికీ, పవన్ కళ్యాణ్ మూవీకి డబ్బింగ్ సినిమా పెద్ద పోటీ అని భావించలేం. అందులోనూ ‘టాక్సిక్’ కోసం కేటాయించిన థియేటర్లు ఖాళీగా ఉంటాయి. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకునే ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకి మార్చి 19న విడుదల చేసే ఆలోచన చేస్తున్నారట. ప్రస్తుతం దేవిశ్రీ ప్రసాద్ ఎల్లమ్మ సినిమాతో బిజీగా ఉన్నారు. అందుకే త్వరగా రీరికార్డింగ్ పూర్తి చేయడానికి తమన్ ను తీసుకొచ్చారని ప్రచారం జరుగుతోంది. దీనిపై స్పష్టత రావాల్సి ఉంది.