తెలంగాణ నుంచి జరగనున్న సంగతి తెలిసిందే. ఒక స్థానానికి సిట్టింగ్ ఎంపీ అభిషేక్‌ మను సింఘ్వీ పేరును కాగ్రెంస్ అధిష్ఠానం ఇప్పటికే ఖరారు చేసింది. రెండో స్థానం ఎవరికి అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఈ స్థానం కోసం పలువురు పేర్లు తెరపైకి వచ్చాయి. వి.హనుమంతరావు, , వినయ్‌కుమార్, మధుయాస్కీ గౌడ్‌, హర్కర వేణుగోపాల్, మాజీ ఎమ్మెల్యే వంశీచంద్‌రెడ్డి, సాంబయ్య, బెల్లయ్య నాయక్, చిన్నారెడ్డి సహా మొత్తం 16 మంది పేర్లను తెలంగాణ పీసీసీ ఏఐసీసీకి పంపారు. చివరకు వేం నరేందర్‌రెడ్డి, సాంబయ్యల పేర్లను కాంగ్రెస్ అదిష్ఠానం పరిశీలించినా... నరేందర్‌రెడ్డి వైపే మొగ్గు చూపినట్లు సమాచారం.వేం నరేందర్ రెడ్డి రాజ్యసభ అభ్యర్థిత్వం ఖరారు చేయాలని సీఎం రేవంత్‌ రెడ్డి గట్టిగా కోరుతున్నారు. పార్టీకి, ప్రభుత్వానికి మధ్య ఆయన కీలకంగా వ్యవహరిస్తున్నందున అవకాశం ఇవ్వాలని పట్టుపట్టారు. జూబ్లీహిల్స్‌ బై పోల్, పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో క్రియాశీల పాత్ర పోషించడం వంటి అంశాలను పరిగణలోనికి తీసుకొని వేం నరేందర్ రెడ్డి అవకాశమివ్వాలని అధిష్ఠానాన్ని సీఎం కోరినట్లు తెలిసింది. దాంతో పాటు ఆయనకు అందరితో సన్నిహిత సంబంధాలుండటంతో ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం కాలేదట. దీంతో అధిష్ఠానం చివరకు సీఎం రేవంత్ మాటకే ప్రాధాన్యం ఇచ్చినట్లు తెలిసింది. మొదటి స్థానానికి అభిషేక్‌ సింఘ్వీ ఎన్నికకు ఎలాంటి సమస్య లేదు. రెండో స్థానానికి అవసరమైన మెజార్టీ ప్రస్తుతం కాంగ్రెస్‌కు లేదు. ఎంఐంఎంపై ఆధారపడాల్సిన పరిస్థితి. బీఆర్ఎస్ పోటీలో ఉంటేనే రెండో స్థానాన్ని దక్కించుకోవడానికి ఇతరుల మద్దతు కూడగట్టాల్సి ఉంటుంది. పోటీ లేకుంటే ఎన్నిక ఏకగ్రీవమవుతుంది. ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ తన అభ్యర్థిని రంగంలోకి దింపితే రెండో స్థానానికి పోటీ అనివార్యమవుతుంది. ఇప్పటి వరకు గులాబీ పార్టీ ఈ విషయంలో ఒక నిర్ణయానికి రాలేదని తెలిసింది. బీఆర్ఎస్ పోటీలో లేకుంటే రెండు స్థానాలను కాంగ్రెస్‌ ఏకగ్రీవంగా దక్కించుకుంటుంది. నేటితో నామినేషన్ల గడువు ముగియనుండగా.. ఇప్పటి వరకు అధికారికంగా కాంగ్రెస్‌ అభ్యర్థుల జాబితాను విడుదల చేయలేదు. ఇవాళ మధ్యాహ్నానికి లిస్టు రిలీజ్ కానుండగా.. ఆ తర్వాత నామినేషన్లు దాఖలు చేయనున్నారు. నామినేషన్ల ఉపసంహరణకు మార్చి9 చివరి తేదీ కాగా.. మార్చి 16న పోలింగ్ జరగనుంది. అదే రోజు ఫలితాలు కూడా వెల్లడికానున్నాయి.