: వాల్‌మార్ట్ నేతృత్వంలోని ప్రముఖ ఫిన్ టెక్ కంపెనీ ఫోన్ పే అంటే తెలియని వారు ఉండరు. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ) పేమెంట్లలో ఫోన్ పే అత్యధిక వాటా కలిగి ఉంది. అలాంటి సంస్థ నుంచి ఐపీఓ వస్తుంది అంటే అందరిలో ఆసక్తి నెలకొంటుంది. అయితే, ఫోన్ పే పబ్లిక్ ఇష్యూకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. ఇప్పటికే సెబీ నుంచి ఐపీఓకు ఆమోదం పొందినా లిస్టింగ్ నిర్ణయాన్ని తాత్కాలికంగా వాయిదా వేసింది. భౌగోళిక ఉద్రిక్త పరిస్థితుల వల్ల నెలకొన్న మార్కెట్ ఒడుదొడుకులతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఫోన్ పే సంస్థ సీఈఓ సమీర్ నిగమ్ తెలిపారు. ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్య యుద్ధం తీవ్ర రూపం దాల్చిన క్రమంలో చమురు ధరలు ఆకాశాన్నంటాయి. హార్ముజ్ జల సంధిని ఇరాన్ మూసివేసింది. దీంతో వాణిజ్య పరంగా ఇబ్బందులు తలెత్తాయి. దీంతో స్టాక్ మార్కెట్లు భారీగా నష్టపోతున్నాయి. అయితే, మార్కెట్లు స్థిరత్వానికి వచ్చిన తర్వాత మళ్లీ లిస్టింగ్ ప్రక్రియను ప్రారంభిస్తామని ఫోన్ పే సీఈఓ సమీర్ నిగమ్ తెలిపారు. త్వరలో పరిస్థితి సద్దుమణుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఐపీఓ వాయిదా నిర్ణయం సరైనదేనని పేర్కొన్నారు. యుద్ధ ప్రభావం తగ్గి, మార్కెట్లు కుదుటపడిన తర్వాత ఎప్పుడు సబ్‌స్క్రిప్షన్, లిస్టింగ్ ఉంటాయో తెలియజేస్తామని తెలిపారు. ఈ యాప్ వినియోగిస్తున్నారు. 4.7 కోట్ల మర్చంట్లతో డిజిటల్ చెల్లింపుల్లో మార్కెట్ లీడర్‌గా ఆధిపత్యం చెలాయిస్తోంది. డిజిటల్ పేమెంట్లతో పాటు ఇన్సూరెన్స్ అగ్రిగేటర్ గానూ వ్యవహరిస్తోంది. స్టాక్ బ్రోకింగ్ యాప్ షేర్ మార్కెట్, గూగుల్ కు ప్రత్యామ్నాయ వేదికగా ఇండస్ యాప్ స్టోర్ ను ఈ సంస్థ కలిగి ఉంది. ప్రస్తుతం డిజిటల్ పేమెంట్లలో అగ్రగామిగా కొనసాగుతోంది. పబ్లిక్ ఇష్యూ ద్వారా రూ.10 వేల కోట్లకు పైగానే సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. సెబీ నుంచి సైతం ఈ ఐపీఓకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. అయితే, పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా ఐపీఓకు బ్రేక్ పడింది. ఫోన్ పేతో పాటు మరికొన్ని పబ్లిక్ ఇష్యూలు సైతం వాయిదా పడే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే 141 కంపెనీలు సెబీ నుంచి అనుమతి పొందాయి. ఆయా కంపెనీలు సంయుక్తంగా రూ.1.64 లక్షల కోట్లు సమీకరించున్నాయని అంచనా. ఇందులో 80 కంపెనీల ఐపీఓలు వచ్చే 3-9 నెలల్లో రానున్నాయి. మార్కెట్లో ఒడుదొడుకుల కారణంగా వాయిదా పడవచ్చని మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి.