కుమార్తె ఇంటికి వెళ్లడమే ప్రాణాలు పోయేలా చేసింది.. లారిజానీ మృతిపై షాకింగ్ విషయాలు వెలుగులోకి!

Wait 5 sec.

: మధ్యప్రాచ్య యుద్ధంలో ఇరాన్‌కు మరో కోలుకోలేని దెబ్బ తగిలింది. ఆ దేశ అత్యున్నత వ్యూహకర్త, అగ్రశ్రేణి నాయకుడు అలీ లారిజానీ ఇజ్రాయెల్ జరిపిన మెరుపు దాడిలో ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయం అందరికీ తెలిసిందే కాగా.. తాజాగా ఈయన మృతికి సంబంధించిన షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ముఖ్యంగా ఆయన తన కుమార్తెను చూసేందుకు వెళ్లడమే ఆయన పాలిట శాపంగా మారినట్లు తెలుస్తోంది. టెహ్రాన్ శివార్లలోని తన కుమార్తె నివాసానికి లారిజానీ రహస్యంగా వెళ్లిన సమయంలోనే.. ఇజ్రాయెల్ నిఘా సంస్థ మొసాద్ పక్కా సమాచారంతో విరుచుకుపడింది.ప్రాణం తీసింది ఒక్క పొరపాటే..!యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి లారిజానీ అత్యంత కట్టుదిట్టమైన భద్రత నడుమ ఉండేవారు. శత్రువుల కంటపడకుండా ఉండేందుకు ఆయన నిరంతరం తన నివాసాలను మారుస్తూ రహస్య ప్రదేశాల్లో తల దాచుకునేవారు. అయితే మార్చి 17వ తేదీ రాత్రి ఆయన తన కుమార్తె ఇంటికి వెళ్తున్నట్లు ఇజ్రాయెల్ నిఘా వర్గాలు పసిగట్టాయి. లారిజానీ ఆ భవనంలోకి ప్రవేశించిన కొద్ది నిమిషాల్లోనే ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు క్షిపణి దాడులు చేశాయి. ఈ భీకర దాడిలో ఆ భవనం పూర్తిగా నేలమట్టం కాగా.. మొర్తెజా, కార్యాలయ అధిపతి బయట్ కూడా అక్కడికక్కడే మరణించారు.నాయకత్వ సంక్షోభంలో ఇరాన్..ఫిబ్రవరి 28వ తేదీన ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ మరణించినప్పటి నుంచి ఆ దేశం తీవ్ర నాయకత్వ సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఈ క్లిష్ట సమయంలో లారిజానీ వంటి అనుభవజ్ఞుడైన నేతను కోల్పోవడం ఇరాన్‌కు పెద్ద ఎదురు దెబ్బ. కానీ ఇరాన్ సైన్యం అనుసరిస్తున్న .. సైన్యం తన పని తాను చేసుకుంటూ పోతుంది. దీనివల్లే ఇంకా ఇరాన్.. అమెరికా, ఇజ్రాయెల్ సహా గల్ఫ్ దేశాలపై గట్టిగా దాడులు చేయగల్గుతోంది. ప్రతీకారం తీర్చుకుంటామన్న టెహ్రాన్..తమ దేశ చరిత్రలోనే ఇది అత్యంత ఘోరమైన నిఘా వైఫల్యమని ఇరాన్ అంగీకరించింది. శత్రువుకు తమ అగ్రనేత ఆచూకీ ఎలా చిక్కిందనే అంశంపై అంతర్గత విచారణకు ఆదేశించింది. అదే సమయంలో తమ అగ్రనేత హత్యకు ప్రతీకారం తీర్చుకుంటామని, ఇజ్రాయెల్ దీనికి భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని ఇరాన్ ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. అటు ఇజ్రాయెల్ మాత్రం తన లక్ష్యం నెరవేరిందని.. ఇరాన్ లోని ఉగ్రవాద మూలాలను వేటాడతామని స్పష్టం చేసింది.